Traffic Advisory | అర్ధరాత్రి పూట అక్కడ ఆంక్షలు…ఎందుకో తెలుసా
Traffic Advisory | హైదరాబాద్‌లోని మెహదీపట్నం రైతుబజార్, బస్టాప్ పరిసరాల్లో స్కైవాక్ నిర్మాణ పనులు కొనసాగుతున్న నేపథ్యంలో ట్రాఫిక్ రద్దీని నివారించేందుకు వాహనాలను మళ్లిస్తున్నట్లు ట్రాఫిక్ పోలీసులు వెల్లడించారు.
Traffic Advisory | హైదరాబాద్‌లోని మెహదీపట్నం రైతుబజార్, బస్టాప్ పరిసరాల్లో స్కైవాక్ నిర్మాణ పనులు కొనసాగుతున్న నేపథ్యంలో ట్రాఫిక్ రద్దీని నివారించేందుకు వాహనాలను మళ్లిస్తున్నట్లు ట్రాఫిక్ పోలీసులు వెల్లడించారు. ఈ మార్పులు మంగళవారం అర్ధరాత్రి నుంచి బుధవారం, బుధవారం అర్ధరాత్రి నుంచి గురువారం ఉదయం 6 గంటల వరకు అమలులో ఉంటాయని అధికారులు పేర్కొన్నారు. మాసబ్ ట్యాంక్ నుంచి రేతిబౌలి, నానల్‌నగర్ వైపు వెళ్లే వాహనాలను ఎన్‌ఎండీసీ, ఎస్‌డీ కంటి ఆసుపత్రి మార్గం నుంచి పీవీఎన్ఆర్ ఎక్స్‌ప్రెస్‌వే పిల్లర్ నంబర్లు 2, 3 వద్ద ఉన్న అజీజియా మసీదు దగ్గర మళ్లించనున్నారు. అక్కడి నుంచి మెరాజ్ కేఫ్ వద్ద కుడివైపు తిరిగి మెహదీపట్నం (పిల్లర్ నంబర్ 15 వద్ద) మీదుగా తిరిగి సాధారణ రోడ్‌లోకి చేరవచ్చని తెలిపారు.
అలాగే టోలిచౌకి, లంగర్ హౌస్, అత్తాపూర్ ప్రాంతాల నుంచి మాసబ్ ట్యాంక్ వైపు వచ్చే వాహనాలను పీవీఎన్ఆర్ ఎక్స్‌ప్రెస్‌వే పిల్లర్ నంబర్ 23 వద్ద ఉన్న యూ-టర్న్ వద్ద మళ్లించనున్నారు. అక్కడి నుంచి వ్యతిరేక దిశలో ప్రయాణించి పిల్లర్ నంబర్లు 4, 5 వద్ద తిరిగి ప్రధాన మార్గంలోకి చేరుకోవాల్సి ఉంటుంది. ట్రాఫిక్ అప్‌డేట్స్ కోసం నగర ట్రాఫిక్ పోలీసుల సామాజిక మాధ్యమ ఖాతాలను అనుసరించాలని సూచించారు. అత్యవసర పరిస్థితుల్లో హెల్ప్‌లైన్ నంబర్ 9010203626 ను సంప్రదించాలన్నారు. స్కైవాక్ నిర్మాణ పనులు పూర్తయ్యే వరకు వాహనదారులు సహనంతో వ్యవహరించి, సూచించిన ప్రత్యామ్నాయ మార్గాలను ఉపయోగించాలని జాయింట్ సీపీ (ట్రాఫిక్) జోయల్ డేవిస్ సూచించారు.
ట్యాగ్స్:
తాజావార్తలు
- ●Tirumala | పెటరాసి మాసం.. తిరుమలకు పోటెత్తిన భక్తజనం..
- ●Chintala Ramachandra Reddy | "ఉపఎన్నిక కోసం కొట్లాడింది మేము.. గెలిచేదీ మేమే": విజయా రెడ్డి పిటిషన్లో ఇంప్లీడ్ అవుతాం
- ●Sanjay Malhotra | ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై సవాళ్లు.. అప్రమత్తతే కీలకం: ఆర్బీఐ గవర్నర్
- ●Bollywood Debut | అడవి నుంచి కెమెరా ముందుకు..! మాజీ మహిళా మావోయిస్టులకు బాలీవుడ్ ఛాన్స్
- ●Parliamentary Committee on Defence 2026 | పార్లమెంట్ రక్షణ కమిటీ పునర్వ్యవస్థీకరణ: తెలంగాణ నుంచి దామోదర్ రావు, ఏపీ నుంచి కేశినేని చిన్నికి చోటు.. చైర్మన్‌గా రాధా మోహన్ సింగ్
- ●TG Weather | తెలంగాణకు ఐఎండీ తీపి కబురు.. మళ్లీ జోరందుకోనున్న వానలు..!

Tirumala | పెటరాసి మాసం.. తిరుమలకు పోటెత్తిన భక్తజనం..

Chintala Ramachandra Reddy | "ఉపఎన్నిక కోసం కొట్లాడింది మేము.. గెలిచేదీ మేమే": విజయా రెడ్డి పిటిషన్లో ఇంప్లీడ్ అవుతాం

Sanjay Malhotra | ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై సవాళ్లు.. అప్రమత్తతే కీలకం: ఆర్బీఐ గవర్నర్

Bollywood Debut | అడవి నుంచి కెమెరా ముందుకు..! మాజీ మహిళా మావోయిస్టులకు బాలీవుడ్ ఛాన్స్



