Hyderabad Rains | హైదరాబాద్‌ను కమ్మేసిన కారుమేఘాలు.. దంచికొడుతున్న భారీ వర్షం..
Hyderabad Rains | హైదరాబాద్-సికిందరాబాద్ జంటల నగరాల పరిధిలో పలుచోట్ల భారీ వర్షం కురుస్తున్నది. కూకట్‌పల్లి, కేపీహెచ్‌బీ, బాచుపల్లి, ప్రగతినగర్, గచ్చిబౌలి, లింగంపల్లి, హైటెక్ సిటీ, మాదాపూర్‌లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షం పడుతున్నది.
Hyderabad Rains | హైదరాబాద్-సికిందరాబాద్ జంటల నగరాల పరిధిలో పలుచోట్ల భారీ వర్షం కురుస్తున్నది. కూకట్‌పల్లి, కేపీహెచ్‌బీ, బాచుపల్లి, ప్రగతినగర్, గచ్చిబౌలి, లింగంపల్లి, హైటెక్ సిటీ, మాదాపూర్‌లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షం పడుతున్నది. ముషీరాబాద్‌లో ఈదురుగాలులకు విద్యుత్ సరఫరాలో అంతరాయం కలిగింది. చంపాపేట, కర్మన్‌ఘాట్, సరూర్‌నగర్, కోఠి, సుల్తాన్‌బజార్, అబిడ్స్, బషీర్‌బాగ్, నాంపల్లి, నారాయణగూడ, హిమాయత్‌నగర్, హైదర్‌గూడ, లక్డీకపూల్, ట్యాంక్‌బండ్, మియాపూర్, చందానగర్, ముషీరాబాద్ ప్రాంతాల్లో ఒక్కసారిగా భాఈరవ ర్షం డపుతోంది. మాదాపూర్, కొండాపూర్, రాయదుర్గం, రాజేంద్రనగర్, లంగర్‌హౌస్, కార్వాన్, మెహదీపట్నం, ఆర్టీసీ క్రాస్‌రోడ్, చిక్కడపల్లి, బాగ్‌లింగంపల్లి, గాంధీనగర్, భోలక్‌పూర్, కవాడీగూడ, రామ్‌నగర్, విద్యానగర్, యూసఫ్‌గూడ్, బోరబండ, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, ఫిల్మ్‌నగర్, బేగంపేట, పంజాగుట్ట, పరేడ్‌గ్రౌండ్ సహా నగరవ్యాప్తంగా పలుచోట్ల భారీ వర్షం కురుస్తోంది.

ఒక్కసారిగా కురిసిన వర్షానికి వాహనదారులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. రోడ్లపై భారీగా వరద నీరు చేరుతోంది. వర్షం నేపథ్యంలో ట్రాఫిక్ పోలీసులు అడ్వైజరీ జారీ చేశారు. వర్షం నేపథ్యంలో అవసరమైతేనే బయటకు రావాలని సూచించారు. ఇదిలా ఉండగా.. అమీన్‌పూర్, పటాన్‌చెరువు, బాచుపల్లి ప్రాంతంలో ఉరుములు, మెరుపులతో కూడిన తుఫాన్‌లాంటి పరిస్థితి ఏర్పడుతోందని.. రాబోయే గంట నుంచి రెండుగంటల్లో కాప్రా, మల్కాజ్‌గిరి మినహా హైదరాబాద్ నగరవ్యాప్తంగా విస్తరించనుందని వెదర్‌మ్యాన్ తెలిపారు. ఈ క్రమంలో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని హైదరాబాద్ పోలీసులు సూచించారు. వాతావరణంలో వేడి, తేమతో కూడిన గాలి వేగంగా పైకి లేచినప్పుడు 'క్యుములోనింబస్' అనే నల్లటి మేఘాలు ఏర్పడి ఈ తుఫానులు సంభవిస్తాయని వాతావరణ నిపుణులు పేర్కొన్నారు. ఈ సమయంలో కొన్నిసార్లు బలమైన ఈదురుగాలులు వీయడంతో పాటు వడగండ్ల వాన సైతం పడేందుకు అవకాశం ఉందని తెలిపారు.
సంబంధిత వార్తలు

ACB Raids | ఆర్అండ్బీ ఈఎన్సీ మోహన్ నాయక్ ఇంట్లో ఏసీబీ సోదాలు.. రూ.17.97కోట్ల ఆస్తులు వెలుగులోకి..!
జూన్ 9, 2026

CM Revanth Reddy | ఆడబిడ్డలను నిలబెట్టే బాధ్యత నాది : సీఎం రేవంత్‌రెడ్డి
జూన్ 9, 2026

Uttam Kumar Reddy | రబీ ధాన్యం కొనుగోళ్లలో తెలంగాణ నెంబర్ వన్ : మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డి
జూన్ 9, 2026
తాజావార్తలు
- ●ACB Raids | ఆర్అండ్బీ ఈఎన్సీ మోహన్ నాయక్ ఇంట్లో ఏసీబీ సోదాలు.. రూ.17.97కోట్ల ఆస్తులు వెలుగులోకి..!
- ●CM Revanth Reddy | ఆడబిడ్డలను నిలబెట్టే బాధ్యత నాది : సీఎం రేవంత్‌రెడ్డి
- ●Aishwarya Rajesh | అటు మామ.. ఇటు అల్లుడు ... అక్కినేని హీరోలతో ఐశ్వర్యా రాజేష్ డబుల్ ధమాకా!
- ●Uttam Kumar Reddy | రబీ ధాన్యం కొనుగోళ్లలో తెలంగాణ నెంబర్ వన్ : మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డి
- ●Zojila tunnel | జోజిలా టన్నెల్ తుది బ్రేక్‌త్రూ విజయవంతం
- ●India T20 Series | టీ20 సిరీస్ నుంచి మహ్మద్ సిరాజ్ ఔట్.. ప్రసిద్ కృష్ణకు ఛాన్స్..!

ACB Raids | ఆర్అండ్బీ ఈఎన్సీ మోహన్ నాయక్ ఇంట్లో ఏసీబీ సోదాలు.. రూ.17.97కోట్ల ఆస్తులు వెలుగులోకి..!

CM Revanth Reddy | ఆడబిడ్డలను నిలబెట్టే బాధ్యత నాది : సీఎం రేవంత్‌రెడ్డి

Aishwarya Rajesh | అటు మామ.. ఇటు అల్లుడు ... అక్కినేని హీరోలతో ఐశ్వర్యా రాజేష్ డబుల్ ధమాకా!

Uttam Kumar Reddy | రబీ ధాన్యం కొనుగోళ్లలో తెలంగాణ నెంబర్ వన్ : మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డి



