Hyderabad | ఫేక్ నంబర్ ప్లేట్‌తో వాహనం నడుపుతున్న వ్యక్తి అరెస్ట్
Hyderabad | నగరంలో ట్రాఫిక్ తనిఖీల సందర్భంగా ఫేక్ రిజిస్ట్రేషన్ నంబర్ ప్లేట్ వినియోగం వెలుగులోకి వచ్చింది. ఈ మేరకు టోలిచౌకి పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మొహమ్మద్ మోయినుద్దీన్ (43), వృత్తిరీత్యా డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు.
Hyderabad | నగరంలో ట్రాఫిక్ తనిఖీల సందర్భంగా ఫేక్ రిజిస్ట్రేషన్ నంబర్ ప్లేట్ వినియోగం వెలుగులోకి వచ్చింది. ఈ మేరకు టోలిచౌకి పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మొహమ్మద్ మోయినుద్దీన్ (43), వృత్తిరీత్యా డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. టోలిచౌకి బృందావన్ కాలనీలో నివసిస్తున్న సదరు వ్యక్తి తన ద్విచక్ర వాహనానికి నకిలీ నంబర్ ప్లేట్ ఉపయోగిస్తూ పోలీసులకు పట్టుబడ్డాడు. తన హోండా యాక్టివా వాహనానికి అసలు నంబర్ TS12ER2466 ఉండగా, దాని స్థానంలో TS11EU5327 అనే నకిలీ నంబర్‌ను ఉపయోగిస్తున్నట్లు గుర్తించారు. పోలీసులను తప్పుదోవ పట్టించడం, ట్రాఫిక్ చలానాల నుంచి తప్పించుకోవడం, అలాగే ఫైనాన్స్ రికవరీ ఏజెంట్ల నుంచి తప్పించుకునేందుకు ఈ దుశ్చర్యకు పాల్పడ్డట్లు విచారణలో తేలింది.
ఫేక్ నంబర్ ప్లేట్ వాడటం వల్ల ట్రాఫిక్ ఉల్లంఘనలకు సంబంధించిన చలానాలు ఆ నంబర్‌కు చెందిన అసలు వాహన యజమాని ఎండీ లాయిక్ పేరుపై నమోదైనట్లు తెలిపారు. ఈ ఘటనపై భారతీయ న్యాయ సంహిత 318(2), 319(2) సెక్షన్లతో పాటు మోటార్ వాహన చట్టంలోని సెక్షన్ 192 ప్రకారం కేసు నమోదు చేశారు. కేసు విచారణ కొనసాగుతున్నట్లు పోలీసులు తెలిపారు. హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు, టోలిచౌకి పోలీసులు సమన్వయంతో ఈ కేసును ఛేదించారు. నకిలీ లేదా ఇతరుల నంబర్ ప్లేట్లను ఉపయోగించడం శిక్షార్హ నేరమని పోలీసులు హెచ్చరించారు. ఇలాంటి ఉల్లంఘనలను గుర్తించేందుకు సీసీటీవీ పర్యవేక్షణతో పాటు ఏఎన్‌పీఆర్ కెమెరాలను వినియోగిస్తున్నట్లు జాయింట్ ట్రాఫిక్ పోలీస్ కమిషనర్ జోయెల్ డేవిస్ తెలిపారు. తమ వాహన నంబర్ ప్లేట్ల దుర్వినియోగంపై అనుమానం ఉంటే వెంటనే సంబంధిత అధికారులకు సమాచారం ఇవ్వాలని సూచించారు.
ట్యాగ్స్:
తాజావార్తలు
- ●Tirumala | పెటరాసి మాసం.. తిరుమలకు పోటెత్తిన భక్తజనం..
- ●Chintala Ramachandra Reddy | "ఉపఎన్నిక కోసం కొట్లాడింది మేము.. గెలిచేదీ మేమే": విజయా రెడ్డి పిటిషన్లో ఇంప్లీడ్ అవుతాం
- ●Sanjay Malhotra | ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై సవాళ్లు.. అప్రమత్తతే కీలకం: ఆర్బీఐ గవర్నర్
- ●Bollywood Debut | అడవి నుంచి కెమెరా ముందుకు..! మాజీ మహిళా మావోయిస్టులకు బాలీవుడ్ ఛాన్స్
- ●Parliamentary Committee on Defence 2026 | పార్లమెంట్ రక్షణ కమిటీ పునర్వ్యవస్థీకరణ: తెలంగాణ నుంచి దామోదర్ రావు, ఏపీ నుంచి కేశినేని చిన్నికి చోటు.. చైర్మన్‌గా రాధా మోహన్ సింగ్
- ●TG Weather | తెలంగాణకు ఐఎండీ తీపి కబురు.. మళ్లీ జోరందుకోనున్న వానలు..!

Tirumala | పెటరాసి మాసం.. తిరుమలకు పోటెత్తిన భక్తజనం..

Chintala Ramachandra Reddy | "ఉపఎన్నిక కోసం కొట్లాడింది మేము.. గెలిచేదీ మేమే": విజయా రెడ్డి పిటిషన్లో ఇంప్లీడ్ అవుతాం

Sanjay Malhotra | ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై సవాళ్లు.. అప్రమత్తతే కీలకం: ఆర్బీఐ గవర్నర్

Bollywood Debut | అడవి నుంచి కెమెరా ముందుకు..! మాజీ మహిళా మావోయిస్టులకు బాలీవుడ్ ఛాన్స్



