Illegal E-Cigarettes Hyderabad | బంజారాహిల్స్‌లో ఈ-సిగరెట్లు, నిషేధిత విదేశీ సిగరెట్ల దందా.. తక్కువ ధరకు తెచ్చి, సిటీలో భారీ రేట్లకు విక్రయం
శ్రీనగర్ కాలనీలో చట్టవిరుద్ధంగా ఈ-సిగరెట్లు (వేప్స్), విదేశీ బ్రాండ్లను అమ్ముతున్న ముఠాను హైదరాబాద్ టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. భారీగా సరుకు సీజ్ చేశారు.
- బంజారాహిల్స్ పరిధిలోని శ్రీనగర్ కాలనీలో 'స్మోకర్స్.ఇన్' షాపుపై పోలీసుల రైడ్ (Raid)
- ముంబై నుంచి తక్కువ ధరకు తెచ్చి, సిటీలో యువతకు భారీ రేట్లకు అమ్ముతున్న కేరళ ముఠా పట్టివేత
- సుమారు రూ.2 లక్షల విలువైన ఈ-సిగరెట్లు (వేప్స్), బ్యాన్ చేసిన విదేశీ సిగరెట్ల స్వాధీనం
- ఎలక్ట్రానిక్ సిగరెట్ల నిషేధ చట్టం ప్రకారం ముగ్గురిని అరెస్ట్ చేసినట్లు వెల్లడించిన టాస్క్ ఫోర్స్ డీసీపీ వైభవ్ గైక్వాడ్
Illegal E-Cigarettes Hyderabad | త్రినేత్ర.న్యూస్ : హైదరాబాద్‌లో యువతను టార్గెట్ (Target) చేసుకుని సాగుతున్న మరో అక్రమ దందాను సిటీ పోలీసులు బట్టబయలు చేశారు. దేశవ్యాప్తంగా బ్యాన్ (Ban) ఉన్నప్పటికీ, గుట్టుచప్పుడు కాకుండా విదేశీ ఈ-సిగరెట్లు (వేప్స్) అమ్ముతున్న ఒక ముఠాను బుధవారం నాడు కమిషనర్స్ టాస్క్ ఫోర్స్ (జూబ్లీహిల్స్ జోన్), బంజారాహిల్స్ పోలీసులు జాయింట్ ఆపరేషన్ చేసి పట్టుకున్నారు.
కేరళ నుంచి వచ్చి.. ఇక్కడ బిజినెస్
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కేరళకు చెందిన కొందరు వ్యక్తులు ఇటీవల హైదరాబాద్‌కు మకాం మార్చారు. బంజారాహిల్స్ సమీపంలోని శ్రీనగర్ కాలనీలో గ్రీన్ బావర్చి లేన్ వద్ద 'స్మోకర్స్.ఇన్' (Smokers.in) అనే పేరుతో ఒక షాపు ఓపెన్ చేశారు. బయటకు సాధారణ షాపులాగా కనిపిస్తున్నా, లోపల మాత్రం సీక్రెట్‌గా ఇండియాలో నిషేధించిన ఈ-సిగరెట్లను, విదేశీ బ్రాండ్లను కస్టమర్లకు విక్రయిస్తున్నారు. దీనిపై పక్కా సమాచారం అందుకున్న టాస్క్ ఫోర్స్ (Task Force) పోలీసులు షాపుపై అకస్మాత్తుగా దాడి చేశారు. ఈ దందా నడుపుతున్న మహమ్మద్ మునీర్, అబ్దుల్ రెహమాన్, మహమ్మద్ ఇయాస్ అనే ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు.
రూ.600 కు తెచ్చి.. రూ.2500 కు సేల్
సిటీలో వేప్స్‌కి (Vapes) కుర్రకారులో ఉన్న డిమాండ్‌ను ఈ ముఠా బాగా క్యాష్ చేసుకుంటోంది. ముంబై నుంచి ఈ అక్రమ సరుకును కేవలం రూ. 600 నుంచి రూ. 800 కే తెప్పిస్తున్నారు. ఇక్కడ ఏకంగా రూ. 2,500 వరకు అమ్ముతూ భారీగా అక్రమ లాభాలు ఆర్జిస్తున్నట్లు పోలీసుల విచారణలో తేలింది.
రూ.2 లక్షల సరుకు సీజ్
నిందితుల దగ్గరి నుంచి 53 వేప్స్, 10 లిక్విడ్ బాటిళ్లు, 76 విదేశీ సిగరెట్ బాక్సులను స్వాధీనం చేసుకున్నారు. వీటి మార్కెట్ వాల్యూ సుమారు రూ. 2 లక్షలు ఉంటుందని అధికారులు అంచనా వేశారు. ఈ ఆపరేషన్‌ను జూబ్లీహిల్స్ టాస్క్ ఫోర్స్ ఇన్స్పెక్టర్ యాదేందర్, ఎస్ఐ జాహిద్ బృందం సక్సెస్ ఫుల్‌గా పూర్తి చేసిందని టాస్క్ ఫోర్స్ డీసీపీ (DCP) వైభవ్ గైక్వాడ్ తెలిపారు. "ఎలక్ట్రానిక్ సిగరెట్ల నిషేధ చట్టం" ప్రకారం ఈ-సిగరెట్లు అమ్మడం, నిల్వ చేయడం కఠినమైన నేరమని పోలీసులు హెచ్చరించారు.
ట్యాగ్స్:
తాజావార్తలు
- ●WhatsApp Cyber Fraud | వాట్సప్‌లో 'బాస్' మెసేజ్.. ఏకంగా రూ.1 కోటి కొల్లగొట్టిన కేటుగాడు, పోలీసుల ఎంట్రీతో ఊహించని ట్విస్ట్
- ●Konda Susmitha | రేవంత్.. నువ్వొచ్చినా, రేవూరి తాతొచ్చినా పరకాల ఎమ్మెల్యే నేనే
- ●January 12 Vidudala | ‘జనవరి 12 విడుదల’.. వెంకటేశ్, కల్యాణ్‌రామ్ మల్టీస్టారర్ మూవీ టైటిల్ ఫిక్స్..
- ●UPI | పొరపాటున వేరే వ్యక్తికి యూపీఐ ద్వారా డబ్బు పంపారా? ఇలా చేస్తే తిరిగి పొందవచ్చు..
- ●CEIR | మొబైల్ ఫోన్ల రికవరీ.. బాధితులకు అందజేసిన అత్తాపూర్ పోలీసులు
- ●Gold Prices | ఆగస్టులో మళ్లీ పుంజుకున్న బంగారం ధరలు.. ఇంకా పెరుగుతాయా, తగ్గుతాయా..?

WhatsApp Cyber Fraud | వాట్సప్‌లో 'బాస్' మెసేజ్.. ఏకంగా రూ.1 కోటి కొల్లగొట్టిన కేటుగాడు, పోలీసుల ఎంట్రీతో ఊహించని ట్విస్ట్

Konda Susmitha | రేవంత్.. నువ్వొచ్చినా, రేవూరి తాతొచ్చినా పరకాల ఎమ్మెల్యే నేనే

January 12 Vidudala | ‘జనవరి 12 విడుదల’.. వెంకటేశ్, కల్యాణ్‌రామ్ మల్టీస్టారర్ మూవీ టైటిల్ ఫిక్స్..

UPI | పొరపాటున వేరే వ్యక్తికి యూపీఐ ద్వారా డబ్బు పంపారా? ఇలా చేస్తే తిరిగి పొందవచ్చు..




