త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Hussain Sagar | హుస్సేన్ సాగ‌ర్‌లో దుర్వాస‌న‌.. ప‌ర్యాట‌కుల ఆందోళ‌న‌

Hussain Sagar | హైద‌రాబాద్ వ్యాప్తంగా ఎండ‌లు మండుతున్న నేప‌థ్యంలో ఉక్క‌పోత‌తో న‌గ‌ర ప్ర‌జ‌లు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. దీంతో సేద తీరుదామ‌ని అలా హుస్సేన్ సాగ‌ర్ వైపు వెళ్తే.. అక్క‌డ దుర్వాస‌న వెద‌జల్లుతోంది.

S

Hyderabad | Published On Apr 17, 2026, 5.02 pm IST

Hussain Sagar | హుస్సేన్ సాగ‌ర్‌లో దుర్వాస‌న‌.. ప‌ర్యాట‌కుల ఆందోళ‌న‌
Advertisement

Hussain Sagar | త్రినేత్ర‌.న్యూస్ : హైద‌రాబాద్ వ్యాప్తంగా ఎండ‌లు మండుతున్న నేప‌థ్యంలో ఉక్క‌పోత‌తో న‌గ‌ర ప్ర‌జ‌లు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. దీంతో సేద తీరుదామ‌ని అలా హుస్సేన్ సాగ‌ర్ వైపు వెళ్తే.. అక్క‌డ దుర్వాస‌న వెద‌జల్లుతోంది. క‌నీసం ఒక్క ఐదారు నిమిషాలు కూడా అక్క‌డ నిల‌బ‌డ‌లేని ప‌రిస్థితి. తీవ్ర‌మైన దుర్వాస‌న వెద‌జ‌ల్లుతుండ‌డంతో.. ఆ వాస‌న‌ను భ‌రించ‌లేక వెనుదిరిగిపోతున్నారు. పీవీఎన్ఆర్ మార్గ్, నెక్లెస్ రోడ్, ఎన్టీఆర్ గార్డెన్స్, లుంబినీ పార్కు, ట్యాంక్ బండ్ ప్రాంతాల్లో దుర్వాస‌న వెద‌జ‌ల్లుతోంది.

బుద్ధ పూర్ణిమ ప్రాజెక్టు అథారిటీ ప్ర‌కారం.. ఎండ‌లు దంచికొడుతున్న నేప‌థ్యంలో హుస్సేన్ సాగ‌ర్‌లో గ్రీన్ ఆల్గే స్థాయిలు పెరిగిపోతున్నాయ‌ని బుద్ధ పూర్ణిమ ప్రాజెక్టు అథారిటీ అధికారులు తెలిపారు. 40 డిగ్రీల‌కు పైగా ప‌గ‌టి ఉష్ణోగ్ర‌త‌లు న‌మోద‌వుతున్న నేప‌థ్యంలో మ‌రింత దుర్వాసన వ‌స్తుంద‌ని పేర్కొన్నారు.

ఈ స‌మ‌స్య‌ను అధిగ‌మించేందుకు బ‌యోరెమిడియేష‌న్ ప్రాసెస్ చేప‌ట్టామ‌ని తెలిపారు. దుర్వాస‌న‌ను అరిక‌ట్టేందుకు మైక్రోబియ‌ల్ ద్రావ‌ణాన్ని కూడా పిచికారీ చేస్తున్నామ‌ని పేర్కొన్నారు. ప్ర‌స్తుతానికి 3 నుంచి 5 ట్యాంక‌ర్ల మైక్రోబియ‌ల్ ద్రావ‌ణంను వినియోగిస్తున్నామ‌ని చెప్పారు. ఒక్కో ట్యాంక‌ర్ 3 వేల లీట‌ర్ల సామ‌ర్థ్యంతో కూడి ఉన్నాయ‌ని పేర్కొన్నారు. ర‌సాయ‌నాల‌ను పిచికారీ చేయ‌డం వ‌ల్ల దుర్వాస‌న‌ను అరిక‌డుతున్నామ‌ని స్ప‌ష్టం చేశారు.

మైక్రోబియ‌ల్ ద్రావ‌ణంలో లాక్టిక్ యాసిడ్ బ్యాక్టీరియా, ఈస్ట్‌లు, కిర‌ణ‌జన్య సంయోగ‌క్రియ బ్యాక్టీరియా వంటి ప్ర‌యోజ‌న‌క‌ర‌మైన సూక్ష్మ‌జీవుల ద్ర‌వ మిశ్ర‌మ‌మే మైక్రోబియ‌ల్ ద్రావ‌ణం అని అధికారులు పేర్కొన్నారు.

Advertisement
Advertisement