Free Master Health Camp | ప్రెస్ క్లబ్ సభ్యులకు నిమ్జ్‌లో ఉచిత మాస్టర్ హెల్త్ చెకప్ క్యాంప్..!
Free Master Health Camp | తెలంగాణ రాష్ట్ర అవతరణ వారోత్సవాలను పురస్కరించుకుని హైదరాబాద్ ప్రెస్ క్లబ్ సభ్యులందరికీ నిమ్స్ ఆసుపత్రిలో ఉచిత మాస్టర్ హెల్త్ చెకప్ క్యాంప్ నిర్వహించేందుకు మంత్రి దామోదర్ రాజనర్సింహ సానుకూలంగా స్పందించారు. సోమాజిగూడలోని హైదరాబాద్ ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు ఎస్ విజయ్ కుమార్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి రమేశ్ వరికుప్పల, ఉపాధ్యక్షురాలు అరుణ అత్తలూరి మంగళవారం సచివాలయంలో మంత్రిని కలిసి వినతిపత్రం సమర్పించారు. జూన్ 2న ప్రెస్ క్లబ్ సభ్యుల కోసం నిమ్స్ ఆసుపత్రిలో ప్రత్యేక మాస్టర్ హెల్త్ చెకప్ క్యాంప్ నిర్వహించాలని కోరారు.
ఈ సందర్భంగా మంత్రి దామోదర్ రాజనర్సింహ మాట్లాడుతూ నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ బాధ్యతాయుతంగా విధులు నిర్వహించే జర్నలిస్టులు తమ ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాల్సిన అవసరం ఉందన్నారు. మీడియా ప్రతినిధులు క్రమం తప్పకుండా ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. ప్రెస్ క్లబ్ సభ్యుల కోసం నిమ్స్‌లో ప్రత్యేక హెల్త్ చెకప్ నిర్వహణకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వ కార్యదర్శి క్రిస్టీనాకు మంత్రి ఆదేశాలు జారీ చేశారు. ప్రెస్ క్లబ్ సభ్యులకు మాస్టర్ హెల్త్ చెకప్ క్యాంప్ నిర్వహణకు సానుకూలంగా స్పందించిన మంత్రి దామోదర్ రాజనర్సింహకు, రాష్ట్ర ప్రభుత్వానికి హైదరాబాద్ ప్రెస్ క్లబ్ పాలక మండలి సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.
ట్యాగ్స్:
తాజావార్తలు
- ●Global Passport Index 2026 | గ్లోబల్ పాస్‌పోర్ట్ ఇండెక్స్‌లో 125వ స్థానానికి పడిపోయిన భారత్.. ఏయే దేశాలకు వీసా-ఫ్రీగా వెళ్లొచ్చంటే?
- ●Mother Helps Son Crack JEE | బెడ్‌పై కొడుకు.. క్లాస్‌లో తల్లి: జేఈఈ అడ్వాన్స్డ్ క్రాక్ చేసి ఐఐటీ ఢిల్లీకి ఎంపికైన గుంజన్
- ●Gold Ramcharitmanas Missing | అయోధ్య రామమందిరంలో రూ.5 కోట్ల విలువైన బంగారు రామచరితమానస్ ఏమైంది?
- ●Vakiti Srihari | పాడి రైతుల కష్టాలు నాకెరికే.. ఇక 15 రోజులకోసారి బిల్లులు చెల్లిస్తం
- ●New Ration Cards | 48 గంటల్లోనే కొత్త రేషన్ కార్డులు జారీ : మంత్రి పొన్నం
- ●Ponnam Prabhakar | ఉపాధి ఉన్న దగ్గరే ఇందిరమ్మ ఇండ్లు కట్టిస్తం

Global Passport Index 2026 | గ్లోబల్ పాస్‌పోర్ట్ ఇండెక్స్‌లో 125వ స్థానానికి పడిపోయిన భారత్.. ఏయే దేశాలకు వీసా-ఫ్రీగా వెళ్లొచ్చంటే?

Mother Helps Son Crack JEE | బెడ్‌పై కొడుకు.. క్లాస్‌లో తల్లి: జేఈఈ అడ్వాన్స్డ్ క్రాక్ చేసి ఐఐటీ ఢిల్లీకి ఎంపికైన గుంజన్

Gold Ramcharitmanas Missing | అయోధ్య రామమందిరంలో రూ.5 కోట్ల విలువైన బంగారు రామచరితమానస్ ఏమైంది?

Vakiti Srihari | పాడి రైతుల కష్టాలు నాకెరికే.. ఇక 15 రోజులకోసారి బిల్లులు చెల్లిస్తం





