త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Scan QR | క్యూఆర్ కోడ్ స్కాన్ చేయండి.. రివార్డులు పొందండి..

Scan QR | పాత‌ ఫోన్లు, చెడిపోయిన టీవీలు, రిఫ్రిజిరేట‌ర్ల‌ను మ‌నం బ‌య‌ట ప‌డేస్తుంటాం. దీనివ‌ల్ల ప‌ర్యావ‌ర‌ణానికి హాని జ‌రుగుతున్న‌ది. దీంతో ఎల‌క్ట్రానిక్ వ‌ర్య‌ర్థాల నుంచి పర్యావరణాన్ని ర‌క్షించ‌డ‌మే లక్ష్యంగా జీహెచ్‌ఎంసీ (GHMC) స‌రికొత్త‌ కార్యక్రమాన్ని ప్రారంభించింది.

G

Hyderabad | Published On Apr 23, 2026, 8.42 am IST

Scan QR | క్యూఆర్ కోడ్ స్కాన్ చేయండి.. రివార్డులు పొందండి..
Advertisement

Scan QR | త్రినేత్ర‌.న్యూస్‌: పాత‌ ఫోన్లు, చెడిపోయిన టీవీలు, రిఫ్రిజిరేట‌ర్ల‌ను మ‌నం బ‌య‌ట ప‌డేస్తుంటాం. దీనివ‌ల్ల ప‌ర్యావ‌ర‌ణానికి హాని జ‌రుగుతున్న‌ది. దీంతో ఎల‌క్ట్రానిక్ వ‌ర్య‌ర్థాల (Electric Wastage) నుంచి పర్యావరణాన్ని ర‌క్షించ‌డ‌మే లక్ష్యంగా జీహెచ్‌ఎంసీ (GHMC) స‌రికొత్త‌ కార్యక్రమాన్ని ప్రారంభించింది. రీసైక్లింగ్, ఈ-వ్యర్థాల సేకరణ సంస్థల భాగస్వామ్యంతో స్కాన్ క్యూఆర్ (Scan QR), డ్రాప్ వేస్ట్‌, గెట్ రివార్డ్స్ విధానానికి శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా పలు మొబైల్‌ షాపుల్లో డ్రాప్‌ బాక్సులను ఏర్పాటు చేసింది. మ‌నం చేయాల్సింద‌ల్లా.. పనిచేయని మొబైల్ ఫోన్లను వాటిలో వేసి, క్యూఆర్‌ కోడ్‌ను స్కాన్‌ చేయాలి. దీంతో వినియోగదారులు రివార్డు పాయింట్లు పొంద‌వ‌చ్చు. ఈ విధానం గురువారం నుంచి అందుబాటులోకి రానుంది.

ఈ రివార్డు పాయింట్లతో స్వయం సహాయక సంఘాలు (ఎస్‌హెచ్‌జీ), స్వచ్ఛంద సంస్థలు తయారుచేసిన వస్తువులను కొనుగోలు చేయ‌వ‌చ్చు. త్వ‌ర‌లోనే ఎలక్ట్రానిక్‌ షాపుల్లోనూ ఏదైనా వస్తువును రాయితీతో కొనే సౌకర్యం, ఇతర ప్రయోజనాలను కూడా అందుబాటులోకి తీసుకొస్తామ‌ని అధికారులు వెల్ల‌డించారు.

పాత ఎల‌క్ట్రిక్ ప‌రిక‌రాలు ఎలా ఇవ్వాలంటే..

మ‌న పాత ఎల‌క్ట్రిక్ ప‌రిక‌రాల‌ను డ్రాప్ బాక్సులు, డోర్‌స్టెప్ పిక‌ప్ విధానాన్ని అమలు చేస్తున్నారు.
డ్రాప్‌ బాక్స్‌: నగరంలో 30 ప్రాంతాల్లో డ్రాప్‌ బాక్స్‌లను ఏర్పాటుచేశారు. పనిచేయని ఫోన్లను వాటిలో వేసి క్యూఆర్‌ కోడ్‌ను స్కాన్‌ చేసి, దరఖాస్తులో వివరాలను పొందుపరిస్తే రివార్డు పాయింట్లు వ‌స్తాయి.

డోర్‌స్టెప్‌ పికప్‌: పాడైన టీవీ, ఫ్రిజ్, ఇతర ఎలక్ట్రానిక్‌ వస్తువులను ఇవ్వాలనుకుంటే క్యూఆర్‌ కోడ్‌ స్కాన్‌ చేసి అడ్ర‌స్‌, వస్తువుల వివరాలను నమోదు చేయాలి. అనంత‌రం ఎర్త్‌ సెన్స్, రీసైట్రొనిక్స్, ప్యూర్‌ ఎర్త్, జెడ్‌ ఎన్విరో, గ్రీన్‌ ఎన్విరో వంటి సంస్థల ప్ర‌తినిధులు ఇంటికొచ్చి వాటిని తీసుకెళ్తారు.

Advertisement
Advertisement