SSPE Disease After Measles | హైదరాబాద్‌లో ఉచిత వైద్య శిబిరం: పిల్లల్లో ‘తట్టు’ తర్వాత వచ్చే ప్రాణాంతక SSPE ముప్పును గుర్తించండి!
చిన్నప్పుడు తట్టు (Measles) వచ్చి తగ్గిపోయిందని నిర్లక్ష్యం చేస్తున్నారా? అది SSPE అనే ప్రాణాంతక మెదడు వ్యాధికి దారితీయొచ్చు. హైదరాబాద్‌లో ఉచిత వైద్య శిబిరం వివరాలు మీకోసం.
- పిల్లల్లో తట్టు (Measles) తగ్గిన తర్వాత వచ్చే అరుదైన, ప్రాణాంతక మెదడు వ్యాధి SSPE
- ఈ వ్యాధిపై పరిశోధన, అవగాహన కోసం రెస్‌ప్లైస్ (RESPLICE) ఆటిజం రీసెర్చ్ ఫౌండేషన్ ఉచిత వైద్య శిబిరం
- ఆగస్టు 9, 2026న హైదరాబాద్‌లోని మణికొండలో ఉచిత వైద్య పరీక్షలు
- తట్టు సోకిన చరిత్ర ఉన్నవారు, MMR టీకాతో ఇబ్బంది పడిన పిల్లల తల్లిదండ్రులు హాజరు కావాలని నిపుణుల సూచన
SSPE Disease After Measles | త్రినేత్ర.న్యూస్ : చిన్నపిల్లలకు తట్టు (Measles) రావడం సాధారణమే కదా, తగ్గిపోయిందిలే అని నిర్లక్ష్యం చేస్తున్నారా? అయితే మీరు కచ్చితంగా ఈ విషయం తెలుసుకోవాలి. తట్టు తగ్గిపోయిన కొన్నేళ్ల తర్వాత అది SSPE (Subacute sclerosing panencephalitis) అనే అత్యంత ప్రమాదకరమైన, ప్రాణాంతకమైన మెదడు వ్యాధికి దారితీసే అవకాశం ఉంది.
ఈ అరుదైన నాడీ సంబంధిత సమస్యను ముందే గుర్తించి, నివారించేందుకు హైదరాబాద్‌కు చెందిన 'రెస్‌ప్లైస్ ఆటిజం రీసెర్చ్ ఫౌండేషన్ అండ్ ఇన్‌స్టిట్యూట్' (RESPLICE Autism Research Foundation & Institute) ఒక బృహత్తర పరిశోధనా కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా ఆగస్టు 9న మణికొండలో ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహిస్తోంది.

SSPE అంటే ఏమిటి? ఇది ఎందుకంత ప్రమాదకరం?
SSPE అనేది తట్టు వైరస్ వల్ల వచ్చే అరుదైన, ప్రాణాంతక మెదడు వ్యాధి. ఒకసారి తట్టు వ్యాధి సోకి తగ్గిన తర్వాత, చాలా మంది పూర్తిగా కోలుకుంటారు. కానీ, కొందరిలో ఈ వైరస్ పూర్తిగా నశించకుండా మెదడు కణజాలంలో ఏళ్ల తరబడి నిద్రాణ స్థితిలో ఉండిపోతుంది. కాలక్రమేణా అది ఉత్పరివర్తనాలకు (mutations) గురై, నరాల కణాలను క్రమంగా నాశనం చేస్తుంది.

"తట్టు వైరస్ మీ బిడ్డను మీ నుంచి శాశ్వతంగా దూరం చేసే ప్రమాదం ఉంది. ఇది SSPE అనే వినాశకరమైన దీర్ఘకాలిక నాడీ సంబంధిత సమస్యకు దారితీస్తుంది. ఈ వ్యాధికి ప్రస్తుతం శాశ్వత చికిత్స లేదు, మరణాల రేటు దాదాపు 100 శాతంగా ఉంటుంది," అని రెస్‌ప్లైస్ ఆటిజం రీసెర్చ్ ఫౌండేషన్ వ్యవస్థాపక చైర్మన్ డాక్టర్ చంద్రశేఖర్ తొడుపునూరి హెచ్చరించారు.
ఎవరికి ముప్పు ఎక్కువ?
- ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) లెక్కల ప్రకారం, తీవ్రమైన తట్టు కేసుల్లో ప్రతి లక్ష మందిలో 4 నుంచి 11 మందికి SSPE వచ్చే ప్రమాదం ఉంది.
- ముఖ్యంగా ఇది మగపిల్లల్లో (75% - 92%) ఎక్కువగా కనిపిస్తుంది.
- 5 ఏళ్లలోపు పిల్లలకు తట్టు సోకితే ఈ ముప్పు మరింత పెరుగుతుంది.
- అదే ఏడాది వయసులోపు శిశువులకు తట్టు వస్తే.. ప్రతి 609 మందిలో ఒకరికి SSPE వచ్చే అత్యంత తీవ్రమైన ముప్పు ఉంటుంది.
ఉచిత వైద్య శిబిరం: ఎవరు హాజరుకావచ్చు?
తట్టు సోకిన ప్రతి ఒక్కరికీ ఈ వ్యాధి ఎందుకు రాదు? కేవలం కొందరిలోనే ఈ వైరస్ ఎందుకు విజృంభిస్తుంది? అనే దానిపై మల్టీ-ఓమిక్స్ (Multi-omics) విధానం ద్వారా లోతైన పరిశోధన చేసేందుకు రెస్‌ప్లైస్ సంస్థ సిద్ధమైంది. ఇప్పటికే ఢిల్లీ, మహారాష్ట్రల నుంచి ముగ్గురు బాధితులు ఇక్కడ రిజిస్టర్ చేసుకున్నారు.

ఈ కింది లక్షణాలు లేదా చరిత్ర ఉన్న పిల్లల తల్లిదండ్రులు ఈ ఉచిత క్యాంపుకు హాజరుకావచ్చు
- తట్టు (Measles) ఇన్ఫెక్షన్ సోకినట్లు నిర్ధారించబడిన పిల్లలు
- SSPE ప్రారంభ దశలో ఉన్నట్లు లేదా ఆ వ్యాధి ఉన్నట్లు అనుమానం ఉన్నవారు
- తట్టు లేదా MMR టీకా తీసుకున్న తర్వాత తీవ్రమైన నాడీ సంబంధిత ఇబ్బందులు (గ్రోత్ ఆగిపోవడం తదితర) ఎదుర్కొన్న పిల్లలు
శిబిరం వివరాలు
తేదీ: 2026 ఆగస్టు 9 (ఆదివారం)
సమయం: ఉదయం 10.00 గంటల నుంచి సాయంత్రం 5.00 గంటల వరకు
వేదిక: రెస్‌ప్లైస్ ఆటిజం రీసెర్చ్ ఫౌండేషన్, శివపురి కాలనీ, ముప్పాస్ పంచవటి కాలనీ, వైష్ణవియోన్, విజేత సూపర్ మార్కెట్ పైన, మణికొండ, హైదరాబాద్ - 500089.
రిజిస్ట్రేషన్ కోసం నంబర్లు: 9100065552 / 8433529769
ఆటిజం, జీర్ణకోశ రుగ్మతలు, నాడీ సంబంధిత సమస్యల చికిత్సలో రెస్‌ప్లైస్ (RESPLICE) వినూత్న విధానాలను అవలంబిస్తూ దేశంలోనే మొట్టమొదటి పరిశోధన ఆధారిత కేంద్రంగా గుర్తింపు పొందింది. ఈ ఉచిత వైద్య శిబిరాన్ని సద్వినియోగం చేసుకుని పిల్లల భవిష్యత్తును సురక్షితం చేసుకోవాలని సంస్థ ప్రతినిధులు కోరుతున్నారు.
తాజావార్తలు
- ●HDFC Bank | హెచ్డీఎఫ్సీ బ్యాంకు పెట్టుబడిదారులకు భారీ షాక్.. రూ.4 లక్షల కోట్ల సంపద ఆవిరి..
- ●కొండా సురేఖను కేబినెట్ నుంచి తొలగించిన ఆ ఐదు కీలక కారణాలు! ఇవే
- ●Eatala Rajendar | పేదల ఉసురు పోసుకుంటున్నావ్ రేవంత్
- ●Tamannaah | వెంకటేష్ సినిమాలో మిల్కీ బ్యూటీ స్పెషల్ సాంగ్ - నాలుగోసారి కాంబో రిపీట్
- ●Supreme Court | లా విద్యార్థులపై క్రమశిక్షణా చర్యలు తీసుకునే అధికారం బార్ కౌన్సిల్‌కు లేదు.. తేల్చి చెప్పిన సుప్రీంకోర్టు
- ●Redmi 17 5G | రెడ్మీ 17 5జి ఫోన్ వచ్చేసింది.. 7900 ఎంఏహెచ్ భారీ బ్యాటరీతో అదిరిపోయింది..

HDFC Bank | హెచ్డీఎఫ్సీ బ్యాంకు పెట్టుబడిదారులకు భారీ షాక్.. రూ.4 లక్షల కోట్ల సంపద ఆవిరి..

కొండా సురేఖను కేబినెట్ నుంచి తొలగించిన ఆ ఐదు కీలక కారణాలు! ఇవే

Eatala Rajendar | పేదల ఉసురు పోసుకుంటున్నావ్ రేవంత్

Tamannaah | వెంకటేష్ సినిమాలో మిల్కీ బ్యూటీ స్పెషల్ సాంగ్ - నాలుగోసారి కాంబో రిపీట్






