Osmania University | తెలంగాణ ప్రతీపల్లె పద సాహిత్య మయం: ఎమ్మెల్సీ గోరేటి వెంకన్న
Osmania University | తెలంగాణ (Telangana)లోని ప్రతీపల్లె పద సాహిత్యాలతో, భజన కీర్తనలతో విరాజిల్లుతోందని ఎమ్మెల్సీ (MLC), ప్రముఖ వాగ్గేయకారులు డాక్టర్ గోరటి వెంకన్న (Goreti Venkanna) అన్నారు. ఉస్మానియా యూనివర్సిటీ (Osmania University) ఆర్ట్స్ కళాశాల (Arts College) వేదికగా, తెలుగు శాఖ (Telugu Department) నిర్వహించిన "తెలంగాణ పద సాహిత్యం - సమాలోచన" అనే జాతీయ సదస్సుకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు.
Osmania University | తెలంగాణ (Telangana)లోని ప్రతీపల్లె పద సాహిత్యాలతో, భజన కీర్తనలతో విరాజిల్లుతోందని ఎమ్మెల్సీ (MLC), ప్రముఖ వాగ్గేయకారులు డాక్టర్ గోరటి వెంకన్న (Goreti Venkanna) అన్నారు. ఉస్మానియా యూనివర్సిటీ (Osmania University) ఆర్ట్స్ కళాశాల (Arts College) వేదికగా, తెలుగు శాఖ (Telugu Department) నిర్వహించిన "తెలంగాణ పద సాహిత్యం - సమాలోచన" అనే జాతీయ సదస్సుకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. అలాగే కీలక ఉపన్యాసం చేసిన ప్రముఖ పరిశోధకులు డాక్టర్ పి భాస్కర యోగి మాట్లాడుతూ సాహిత్య చరిత్రలో విస్మరణకు గురైన ఎందరో పద కవులపై విస్తృతమైన పరిశోధనలు జరగడం అభినందించదగిన విషయమని అన్నారు. ఆ దిశలో తెలుగు శాఖ ఉస్మానియా విశ్వవిద్యాలయం ఆర్ట్స్ కాలేజీలో తెలంగాణ పద సాహిత్యంపై జాతీయ సదస్సు నిర్వహించడం గర్వించదగ్గ విషయమని అన్నారు.
తెలుగుశాఖ అధ్యక్షులు ఆచార్య సాగి కమలాకర శర్మ అధ్యక్షత జరిగిన ఈ కార్యక్రమంలో శ్రీ సురవరం ప్రతాపరెడ్డి తెలుగు విశ్వవిద్యాలయం ఉపాధ్యక్షులు ప్రొఫెసర్ వెలుదండ నిత్యానందరావు, తెలంగాణ సాహిత్య అకాడమీ ప్రథమ అధ్యక్షుడు డాక్టర్ నందిని సిధారెడ్డి, ఆర్ట్స్ కళాశాల ప్రిన్సిపల్ ప్రొఫెసర్ సి. కాశీం, డీన్ ఫ్యాకల్టీ ఆఫ్ ఆర్ట్స్ ప్రొఫెసర్ సైయీదా తలత్ సుల్తానాలు ప్రసంగించారు. అలాగే ఈ సదస్సులో తెలంగాణ పద సాహిత్యంపై ప్రామాణికమైన పరిశోధన పత్రాలను సమర్పించారు. తెలంగాణలోని సబ్బండ వర్గాల వారి సాంస్కృతిక విశేషాలను, తాత్విక విషయాలపై పద కవుల సాహిత్యంపై లోతైన విశ్లేషణలు అవసరమని పలువురు వ్యక్తులు అభిప్రాయపడ్డారు. ఈ సదస్సు స్ఫూర్తితో పలువురు పద కర్తలపై విస్తృతమైన పరిశోధనలు సమగ్రంగా జరిగేందుకు దారులు ఏర్పడ్డాయని అభిప్రాయపడ్డారు. ఈ సదస్సులో తెలుగు బోర్డ్ ఆఫ్ స్టడీస్ చైర్‌పర్సన్ డాక్టర్ ఏలే విజయలక్ష్మి, డాక్టర్ ఎస్. రఘు, ప్రొఫెసర్ విస్తాలి శంకర్రావు, డాక్టర్ పి.సి. వెంకటేశ్వర్లు, డాక్టర్ బాణాల భుజంగ రెడ్డి, డాక్టర్ యువ శ్రీ, డాక్టర్ ఇమ్మిడి మహేందర్, అవుసుల భాను ప్రకాష్ తదితరులు ప్రసంగించారు.
సంబంధిత వార్తలు

RS Praveen Kumar | బండి భగీరథ్‌ను అరెస్టు చేయలేదు.. లొంగిపోయాడు : ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
మే 21, 2026

K Srinivas Reddy | 21 మంది జర్నలిస్టు కుటుంబాలకు ఆర్థిక సాయం: మీడియా అకాడమీ చైర్మన్ కే శ్రీనివాస్‌రెడ్డి
మే 21, 2026

CM Revanth Reddy | కేటీఆర్ జడ్జి.. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఐవో.. బండి భగీరథ్ కేసుపై సీఎం రేవంత్ కామెంట్స్
మే 21, 2026
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్



