త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Jalamandali | హైద‌రాబాదీల‌కు అల‌ర్ట్‌.. ఈ ప్రాంతాల్లో 24 గంటల పాటు నీళ్లు బంద్‌

Jalamandali | హైద‌రాబాద్ వాసుల‌కు అల‌ర్ట్‌.. న‌గ‌రంలోని ప‌లు ప్రాంతాల్లో మే 2న నీటి స‌ర‌ఫ‌రా బంద్ కానుంద‌ని జ‌ల‌మండ‌లి (Jalamandali) అధికారులు తెలిపారు.

G

Hyderabad | Published On Apr 30, 2026, 10.29 am IST

Jalamandali | హైద‌రాబాదీల‌కు అల‌ర్ట్‌.. ఈ ప్రాంతాల్లో 24 గంటల పాటు నీళ్లు బంద్‌
Advertisement

Jalamandali | త్రినేత్ర‌.న్యూస్‌: హైద‌రాబాద్ వాసుల‌కు అల‌ర్ట్‌.. న‌గ‌రంలోని ప‌లు ప్రాంతాల్లో మే 2న నీటి స‌ర‌ఫ‌రా బంద్ కానుంద‌ని జ‌ల‌మండ‌లి (Jalamandali) అధికారులు తెలిపారు. ఆసిఫ్‏నగర్‌ ఫిల్టర్‌ బెడ్స్‌లో ఉన్న 1.36ఎంఎల్‌ సామర్థ్యం గల పాత బ్యాలెన్సింగ్‌ ట్యాంక్‌ శుభ్రపరిచే పనులను మే 2న ఉదయం 6గంటల నుంచి మరుసటి రోజు(3వ తేదీ) ఉదయం 6 గంటల వరకు చేపట్టనున్నారు. ఈ నేప‌థ్యంలో శ‌నివారం ఉద‌యం నుంచి 24 గంటల పాటు తాగునీటి సరఫరాలో అంతరాయం తలెత్త‌నుంది.

అందువ‌ల్ల‌ నగరంలోని కొన్ని ప్రాంతాల్లో త‌క్కువ‌ ప్రెజర్‌తో నీటిసరఫరా జ‌రుగుతుంద‌ని అధికారులు వెల్ల‌డించారు. ఇక‌ గోషామహల్‌, కార్వాన్‌, గోల్కొండ, కవాడిగూడ, జూబ్లీహిల్స్‌ సర్కిళ్ల పరిధిలో సరఫరాలో అంతరాయాలు తలెత్తుతాయ‌ని చెప్పారు. ఈ నేప‌థ్యంలో వినియోగదారులు నీటిని పొదుపుగా వాడుకోవాలని సూచించారు.

Advertisement
Advertisement