త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Musi River | మూసీ పున‌రుజ్జీవం.. ఏప్రిల్ 15 వ‌ర‌కు సూచ‌న‌ల స్వీక‌ర‌ణ‌

Musi River | మూసీ న‌ది పున‌రుజ్జీవానికి కాంగ్రెస్ ప్ర‌భుత్వం చ‌ర్య‌లు తీసుకుంటున్న సంగ‌తి తెలిసిందే. ఈ క్ర‌మంలో ప్ర‌జ‌ల భాగ‌స్వామ్యాన్ని మ‌రింత పెంచేందుకు వారి నుంచి అభిప్రాయాలు, సూచ‌న‌లు స్వీక‌రించేందుకు ప్ర‌భుత్వం సిద్ధ‌మైంది.

S

Hyderabad | Published On Mar 31, 2026, 5.55 pm IST

Musi River | మూసీ పున‌రుజ్జీవం.. ఏప్రిల్ 15 వ‌ర‌కు సూచ‌న‌ల స్వీక‌ర‌ణ‌
Advertisement

Musi River | త్రినేత్ర‌.న్యూస్ : మూసీ న‌ది పున‌రుజ్జీవానికి కాంగ్రెస్ ప్ర‌భుత్వం చ‌ర్య‌లు తీసుకుంటున్న సంగ‌తి తెలిసిందే. ఈ క్ర‌మంలో ప్ర‌జ‌ల భాగ‌స్వామ్యాన్ని మ‌రింత పెంచేందుకు వారి నుంచి అభిప్రాయాలు, సూచ‌న‌లు స్వీక‌రించేందుకు ప్ర‌భుత్వం సిద్ధ‌మైంది. ఈ నేప‌థ్యంలో స‌చివాల‌యంలో మూసీ స‌బ్ క‌మిటీ స‌భ్యుడు, మంత్రి పొన్నం ప్ర‌భాక‌ర్‌తో క‌లిసి డిప్యూటీ సీఎం, ఆర్థిక మంత్రి భ‌ట్టి విక్ర‌మార్క అధికారుల‌తో స‌మీక్ష నిర్వ‌హించారు.

మార్చి 31 నుండి ఏప్రిల్ 15 వరకు ఆన్‌లైన్ ద్వారా ప్రజల అభిప్రాయాలు, సూచనలు స్వీకరిస్తామని వెల్లడించారు.
ప్రజల నుంచి వచ్చే ప్రతి విలువైన సూచనను అధికారులు సమగ్రంగా విశ్లేషించి, అవసరమైన అంశాలపై సూచనలు చేసిన వారితో సబ్ కమిటీ సభ్యులు దశలవారీగా నేరుగా భేటీ అవుతారని తెలిపారు. ప్రజల ఆలోచనలు, అవసరాలు ప్రతిబింబించేలా ప్రణాళికలు రూపొందిస్తామని స్పష్టం చేశారు.

మూసీ పునరుజ్జీవం ప్రాజెక్టు అమలులో భాగంగా, నిర్మాణ డిజైన్లు తుది దశకు తీసుకురావడం, పునరావాసితులతో సంప్రదింపులు, డిఫెన్స్ సంబంధిత అంశాలు, బ్యాంకర్లతో చర్చలు వంటి కీలక పనులను సమన్వయంతో ముందుకు తీసుకెళ్లాలని అధికారులకు ఆదేశించారు. ఈ ప్రాజెక్టు రాష్ట్రానికి మాత్రమే కాకుండా అధికారుల వృత్తి జీవితాల్లో కూడా ఒక మైలురాయిగా నిలవాలని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, యావత్ క్యాబినెట్ సంకల్పాన్ని సాకారం చేయాలని సూచించారు.

మూసీ సబ్ కమిటీ సభ్యులు 24 గంటలు అందుబాటులో ఉంటారని, అధికారులకు అవసరమైన మార్గదర్శకత్వం, సూచనలు ఎప్పటికప్పుడు అందిస్తామని తెలిపారు. ప్ర‌జ‌లు త‌మ అభిప్రాయాలు, సూచ‌న‌ల‌ను musirrdc@gmail.com మెయిల్‌కు పంపొంచ్చు.

Advertisement

తాజావార్తలు

Advertisement