CP Ramesh | వర్షాకాల సమస్యలపై సీపీ రమేశ్ క్షేత్రస్థాయి పరిశీలన.. నీటి నిల్వ ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి
CP Ramesh | వర్షాకాలంలో ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా, ట్రాఫిక్ అంతరాయం లేకుండా ముందస్తు చర్యలు చేపట్టేందుకు సైబరాబాద్ పోలీసులు రంగంలోకి దిగారు. ఇందులో భాగంగా సైబరాబాద్ సీపీ డాక్టర్ ఎం రమేశ్ శనివారం నగరంలోని నీరు నిలిచే ప్రాంతాలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు.
CP Ramesh | వర్షాకాలంలో ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా, ట్రాఫిక్ అంతరాయం లేకుండా ముందస్తు చర్యలు చేపట్టేందుకు సైబరాబాద్ పోలీసులు రంగంలోకి దిగారు. ఇందులో భాగంగా సైబరాబాద్ సీపీ డాక్టర్ ఎం రమేశ్ శనివారం నగరంలోని నీరు నిలిచే ప్రాంతాలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. జాయింట్ సీపీ (ట్రాఫిక్) సన్‌ప్రీత్ సింగ్, శేరిలింగంపల్లి, కూకట్‌పల్లి జోన్ల జోనల్ కమిషనర్లు, ఆయా జోన్ల ఇంజినీర్లు, డీసీపీ ట్రాఫిక్, ఏడీసీపీ ట్రాఫిక్ తదితర అధికారులతో కలిసి ఎలక్షన్ బిల్డింగ్, పిస్తా హౌస్ పరిసర ప్రాంతాలను సందర్శించారు. ఇటీవల కురిసిన భారీ వర్షాల సమయంలో ఆయా ప్రాంతాల్లో నీరు నిలిచిపోవడానికి గల కారణాలను అధికారులు పరిశీలించారు.
వాననీరు వేగంగా వెళ్లిపోయేలా డ్రైనేజీ వ్యవస్థ సామర్థ్యాన్ని పెంచడం, బాటిల్‌నెక్ ప్రాంతాలను గుర్తించి తొలగించడం, కల్వర్టులు, స్టార్మ్ వాటర్ డ్రైన్ల విస్తరణ, సిల్ట్, చెత్త తొలగింపు వంటి అంశాలపై అధికారులతో సీపీ చర్చించారు. అవసరమైన ప్రాంతాల్లో అదనపు డ్రైనేజీ లైన్ల ఏర్పాటుతో పాటు తక్షణ, దీర్ఘకాలిక చర్యలు చేపట్టాలని సూచించారు. ఈ సందర్భంగా సీపీ రమేశ్ మాట్లాడుతూ వర్షాకాలంలో ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా ముందస్తు ప్రణాళికతో పనిచేయాలని అధికారులను ఆదేశించారు. నీరు నిలిచే ప్రాంతాల్లో అత్యవసర స్పందన బృందాలు, మోటార్ పంపులు, అవసరమైన యంత్రాలు, సిబ్బందిని సిద్ధంగా ఉంచాలని సూచించారు.
జీహెచ్‌ఎంసీ, ట్రాఫిక్ పోలీసులు, ఇరిగేషన్ శాఖతో పాటు ఇతర సంబంధిత విభాగాలు సమన్వయంతో పనిచేసి నీటి నిల్వ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపేలా కార్యాచరణ రూపొందించాలని అధికారులకు సూచించారు. వర్షపు రోజుల్లో ప్రజలకు ఇబ్బందులు కలగకుండా, ట్రాఫిక్ సాఫీగా కొనసాగేందుకు అవసరమైన చర్యలను వేగంగా అమలు చేయాలని ఆదేశించారు. ప్రజల భద్రత, సౌకర్యం, నిరంతర ట్రాఫిక్ నిర్వహణకు సైబరాబాద్ పోలీసులు అన్ని శాఖలతో సమన్వయంతో పనిచేస్తూ వర్షాకాల సవాళ్లను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నారని అధికారులు తెలిపారు.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●Horoscope | ఆగస్టు 14 రాశిఫలాలు.. ఈ రాశివారు అందరినీ ఆకట్టుకుంటారు!
- ●Telangana Voter List Deletion | 1.30 కోట్ల ఓట్లకు ఎసరు.. ఆ కుట్రలను తిప్పికొట్టండి
- ●SIR Process Telangana | 21 శాతం ఓట్లు గల్లంతయ్యే చాన్స్.. బీజేపీ, బీఆర్ఎస్ కుట్రలను తిప్పికొట్టండి
- ●Komatireddy Rajgopal Reddy | రేవంత్ రెడ్డి సర్కార్ మంచి చేస్తే మంచి అని అంట.. తప్పు చేస్తే తప్పని అంటా..!
- ●BCI Withdraws Order | నల్సార్ వివాదం: దిగివచ్చిన బార్ కౌన్సిల్.. ఆ విద్యార్థులపై బ్యాన్ ఎత్తివేత
- ●BCI NALSAR Controversy | సీజేఐ చీఫ్ గెస్ట్‌గా వద్దన్నందుకు భారీ మూల్యం: నల్సార్ 2026 విద్యార్థుల ఎన్రోల్మెంట్ ఆపేసిన బార్ కౌన్సిల్

Horoscope | ఆగస్టు 14 రాశిఫలాలు.. ఈ రాశివారు అందరినీ ఆకట్టుకుంటారు!

Telangana Voter List Deletion | 1.30 కోట్ల ఓట్లకు ఎసరు.. ఆ కుట్రలను తిప్పికొట్టండి

SIR Process Telangana | 21 శాతం ఓట్లు గల్లంతయ్యే చాన్స్.. బీజేపీ, బీఆర్ఎస్ కుట్రలను తిప్పికొట్టండి

Komatireddy Rajgopal Reddy | రేవంత్ రెడ్డి సర్కార్ మంచి చేస్తే మంచి అని అంట.. తప్పు చేస్తే తప్పని అంటా..!






