త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

CM Revanth Reddy | నిజాం లేకుండా మ‌న‌కు చ‌రిత్రనే లేదు.. సీఎం రేవంత్ రెడ్డి కీల‌క వ్యాఖ్య‌లు

CM Revanth Reddy | నిజాం ప్ర‌భువులు లేకుండా మ‌న‌కు చ‌రిత్ర‌నే లేదు అని సీఎం రేవంత్ రెడ్డి కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. ఆయ‌న రాచ‌రికంలో ఉన్న‌ప్ప‌టికీ మ‌నం గుర్తు చేసుకోవాల్సిందే. నిజాం విజువ‌లైజ్ వ‌ల్లే నేడు హైద‌రాబాద్ న‌గ‌రం అద్భుతంగా త‌యారైంద‌ని సీఎం పేర్కొన్నారు.

S

Hyderabad | Published On Mar 13, 2026, 9.24 pm IST

CM Revanth Reddy | నిజాం లేకుండా మ‌న‌కు చ‌రిత్రనే లేదు.. సీఎం రేవంత్ రెడ్డి కీల‌క వ్యాఖ్య‌లు
Advertisement

CM Revanth Reddy | త్రినేత్ర‌.న్యూస్ : నిజాం ప్ర‌భువులు లేకుండా మ‌న‌కు చ‌రిత్ర‌నే లేదు అని సీఎం రేవంత్ రెడ్డి కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. ఆయ‌న రాచ‌రికంలో ఉన్న‌ప్ప‌టికీ మ‌నం గుర్తు చేసుకోవాల్సిందే. నిజాం విజువ‌లైజ్ వ‌ల్లే నేడు హైద‌రాబాద్ న‌గ‌రం అద్భుతంగా త‌యారైంద‌ని సీఎం పేర్కొన్నారు. మూసీ అభివృద్ధిపై తాజ్ కృష్ణాలో ఏర్పాటు చేసిన స‌మావేశంలో సీఎం రేవంత్ పాల్గొని ప్ర‌సంగించారు.

న‌ది ప‌రివాహక ప్రాంతంలోనే నాగ‌రిక‌త వెలసిల్లింది. ఆర్థిక వ్య‌వ‌స్థ అభివృద్ధికి స‌ముద్రాలు,న‌దులే కార‌ణం. వీట‌న్నింటిని దృష్టిలో ఉంచుకుని.. అనేక దేశాలు ప‌ర్య‌టించి.. న‌దీ ప‌రివాహ‌క ప్రాంతాల‌ను ప‌రిశీలించాను. న‌ది ప‌రివాహ‌క ప్రాంతాల్లోని దేశాలు, రాష్ట్రాలు ఆర్థికంగా వేగంగా ప్ర‌యాణిస్తున్నాయి. ఇంకా మ‌నం అభివృద్ధి నిరోధ‌కులుగా మారాం. ఈ నేప‌థ్యంలో మూసీ అభివృద్ధిని బాధ్యాత‌యుతంగా చేయాల‌ని నిర్ణ‌యించాం. రెండేండ్ల నుంచి నిరంత‌రం వేల గంట‌లు అధికారుల‌తో సంప్ర‌దింపులు చేస్తున్నాం. క్షుణ్ణంగా ప్ర‌తి అంశంపై చ‌ర్చించామ‌ని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.

నిజాం ప్ర‌భువులు చ‌లించిపోయి..

హైద‌రాబాద్ న‌గ‌రానికి చరిత్ర ఉంది. నిజాం రాజు చ‌క్ర‌వ‌ర్తి అయి ఉండొచ్చు. ఆయ‌న ప‌రిపాల‌న మీద ఒక్కొక్క‌రికి ఒక్కో ర‌క‌మైన అభిప్రాయాలు ఉండొచ్చు. ఆయ‌న విష‌యంలో ఆద‌ర్శంగా తీసుకుని అభినందించాల్సిందే. మూసీకి ఉప్పెన వ‌చ్చిన‌ప్పుడు 15 వేల మంది ప్రాణాలు పోయిన‌ప్పుడు నిజాం ప్ర‌భువులు చ‌లించిపోయి.. ఈ ప్ర‌మాదం ఉండ‌కూడ‌ద‌ని 1908లో మోక్ష‌గుండం విశ్వేశ్వ‌ర‌య్య‌ను పిలిచి.. వ‌ద‌ర‌ల‌ను నియంత్రించ‌డానికి ప్ర‌ణాళిక సిద్ధం చేశారు. మూసా, ఈసా.. ఈ రెండింటి వ‌ర‌ద‌ల‌ను నియ‌త్రించ‌డానికి ప్ర‌జ‌ల‌కు ఉప‌యోగించ‌డానికి హిమాయ‌త్ సాగ‌ర్, ఉస్మాన్ సాగ‌ర్ 1921లో నిర్మించారని సీఎం రేవంత్ గుర్తు చేశారు.

ప్ర‌పంచంలోనే మేటి న‌గ‌రంగా హైద‌రాబాద్‌

ఈ రెండు రిజ‌ర్వాయ‌ర్లు హైద‌రాబాద్ ప్ర‌జ‌ల దాహార్తిని తీర్చుతున్నాయి. చెక్కు చెద‌ర‌కుండా క‌ట్ట‌డాలు ఉన్నాయి. ఉపాధి కోసం వ‌చ్చే కోట్లాది మంది దాహార్తిని తీర్చుతున్నాయి. అంతేకాకుండా మూసీ ప‌రివాహ‌క ప్రాంతంలో తారామ‌తి బాద‌ర్, చార్మినార్, హైకోర్టు, సిటీ కాలేజీ, ఉస్మానియా హాస్పిట‌ల్, సాలార్ జంగ్ మ్యూజియం వంటి గొప్ప వార‌స‌త్వ సంప‌ద‌ను అందించారు. ప్ర‌పంచంలోనే మేటి న‌గ‌రంగా హైద‌రాబాద్‌ను అందించారని సీఎం తెలిపారు.

మీ స‌ల‌హాల‌ను స్వీక‌రించేందుకు సిద్ధం

ప్ర‌పంచంలో జ‌రుగుతున్న ప‌ర్యావ‌ర‌ణ మార్పుల‌ను ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకోవాల్సిన అవ‌స‌రం ఉంది. కానీ ప‌దేండ్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్, ప‌న్నెండ్లు అధికారంలో ఉన్న బీజేపీ హైద‌రాబాద్‌ను ప‌ట్టించుకోలేదు. మూసీ సుంద‌రీక‌ర‌ణ‌ను ఎందుకు అడ్డుకుంటున్నారు. ఎందుకు సూచ‌న‌లు ఇవ్వ‌డం లేదు. నేను త‌ప్పు చేస్తే చెప్పు. నేను మీ స‌ల‌హాల‌ను స్వీక‌రించేందుకు సిద్ధంగా ఉన్నానని సీఎం అన్నారు.

నిజాం వార‌స‌త్వ సంప‌ద లేనిది మ‌న అభివృద్ధి ప్ర‌ణాళిక‌లు లేవు..

ప్ర‌స్తుతం హైద‌రాబాద్‌లో ఒక‌ కోటి 34 ల‌క్ష‌ల జ‌నాభా ఉంది. త్వ‌ర‌లోనే 2 కోట్ల 80 ల‌క్ష‌ల జ‌నాభాకు చేరుకోబోతున్నాం. మౌలిక వ‌స‌తుల‌ను క‌ల్పించాల్సిన బాధ్య‌త మాపై ఉంది. చంద్ర‌బాబు, వైఎస్సార్.. హైద‌రాబాద్‌ను అభివృద్ధి చేశారు. అంత‌ర్జాతీయ ఎయిర్‌పోర్టు, ఔట‌ర్ రింగ్ రోడ్డు, హైటెక్ సిటీ, గూగుల్, ఇన్ఫోసిస్, మైక్రోసాఫ్ట్ వంటి సంస్థ‌ల‌ను తీసుకొచ్చారు. నిజాం వార‌సులు లేక‌పోయినా అభివృద్ధిపై చ‌ర్చించిన‌ప్పుడు అత‌న్ని గుర్తుంచుకోవాలి. నిజాం లేకుండా మ‌నకు చ‌రిత్ర‌నే లేదు. అత‌ను నిర్మించిన వార‌స‌త్వ సంప‌ద లేనిది మ‌న అభివృద్ధి ప్ర‌ణాళిక‌లు లేవు. చార్మినార్ వ‌ద్ద గాజుల‌తో పాటు ప్ర‌పంచంలో దొర‌క‌ని ముత్యాలు ల‌భిస్తున్నాయి. ప్ర‌ప‌చంలోని ప్ర‌తి వ‌స్తువు చార్మినార్ వ‌ద్ద ల‌భిస్తుంది. నాడు నిజాం చార్మినార్ వ‌ద్ద స్పెష‌ల్ ఎక‌నామిక్ జోన్‌ను త‌యారు చేశారు. ప్ర‌తి అంశాన్ని నిజాం విజువ‌లైజ్ చేశారు. ఉస్మానియా యూనివ‌ర్సిటీ, నిజాం కాలేజీ, ఆలియా జూనియ‌ర్ కాలేజీ, నిలోఫ‌ర్ హాస్పిట‌ల్ ఏర్పాటు చేశారు. ఇంత అద్భుత‌మైన న‌గ‌రాన్ని మ‌న‌కు వార‌స‌త్వంగా అందించార‌ని సీఎం తెలిపారు.

Advertisement
Advertisement