త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

CM Revanth Reddy | స‌ర్పంచ్‌ల‌కు కూడా పాసులివ్వండి.. క‌లెక్ట‌ర్, డీసీపీకి సీఎం రేవంత్ రెడ్డి సూచ‌న‌

CM Revanth Reddy | భ‌విష్య‌త్‌లో ఫ్యూచ‌ర్ సిటీలో ఏ అభివృద్ధి కార్య‌క్ర‌మం జ‌రిగినా కూడా స‌ర్పంచ్‌ల‌ను, కార్పొరేట‌ర్ల‌ను భాగ‌స్వామ్యం చేయాల‌ని అధికారుల‌కు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. ఈ క్ర‌మంలో స‌ర్పంచ్‌లు, కార్పొరేట‌ర్లు, కౌన్సిల‌ర్ల‌కు పాసులు అంద‌జేయాల‌ని మ‌హేశ్వ‌రం డీసీపీ, రంగారెడ్డి క‌లెక్ట‌ర్‌కు సీఎం సూచించారు.

S

Hyderabad | Published On Apr 28, 2026, 6.25 pm IST

CM Revanth Reddy | స‌ర్పంచ్‌ల‌కు కూడా పాసులివ్వండి.. క‌లెక్ట‌ర్, డీసీపీకి సీఎం రేవంత్ రెడ్డి సూచ‌న‌
Advertisement

CM Revanth Reddy | త్రినేత్ర‌.న్యూస్ : భ‌విష్య‌త్‌లో ఫ్యూచ‌ర్ సిటీలో ఏ అభివృద్ధి కార్య‌క్ర‌మం జ‌రిగినా కూడా స‌ర్పంచ్‌ల‌ను, కార్పొరేట‌ర్ల‌ను భాగ‌స్వామ్యం చేయాల‌ని అధికారుల‌కు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. ఈ క్ర‌మంలో స‌ర్పంచ్‌లు, కార్పొరేట‌ర్లు, కౌన్సిల‌ర్ల‌కు పాసులు అంద‌జేయాల‌ని మ‌హేశ్వ‌రం డీసీపీ, రంగారెడ్డి క‌లెక్ట‌ర్‌కు సీఎం సూచించారు. ఫ్యూచర్ సిటీ క‌మిష‌న‌రేట్‌కు శంకుస్థాప‌న చేసిన సంద‌ర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారు.

ఈ ప్రాంత ప్ర‌జ‌ల‌కు ముఖ్యంగా ఫ్యూచ‌ర్ సిటీ ప్రాంత ప్ర‌జ‌ల‌కు శుభాకాంక్ష‌లు తెలియ‌జేస్తున్నా. మ‌హేశ్వ‌రం డీసీపీ, రంగారెడ్డి జిల్లా క‌లెక్ట‌ర్‌కు సూచ‌న చేస్తున్నా.. అభివృద్ధి కార్య‌క్ర‌మాలు ఏర్పాటు చేసినా ఫ్యూచ‌ర్ సిటీ ప‌రిధిలో ఉన్న ప్ర‌తి ఒక్క‌రికి పాసులు ఇవ్వాలి. అప్పుడే భ‌విష్య‌త్ త‌రాల‌కు అద్భుత‌మైన న‌గ‌రంగా రాణిస్తుంది. సీఎం స్థాయిలో నేను, ఐటీ మినిస్ట‌ర్‌గా శ్రీధ‌ర్ బాబు ఇత‌ర మంత్రులు అనుకుంటే స‌మ‌స్య‌లు ప‌రిష్కారం కావు. స‌ర్పంచ్‌లు, కార్పొరేట‌ర్లు, కౌన్సిల‌ర్లు ప్ర‌భుత్వానికి స‌హ‌క‌రించిన‌ప్పుడే స‌మ‌స్య‌లు ప‌రిష్కారం అవుతాయి. ఫ్యూచ‌ర్ సిటీ ప‌రిధిలోకి వ‌చ్చే గ్రామాల సర్పంచ్‌ల‌ను గుర్తించి పాసులు పంపించండి.. విధిగా. పాసులు ఇవ్వ‌క‌పోవ‌డం మ‌న‌కు మంచిది కాదు. ఇది ప్ర‌జా ప్ర‌భుత్వం.. ప్ర‌జ‌ల కోసం ఏర్ప‌డ్డ ప్ర‌భుత్వం. కాబ‌ట్టి అంద‌రికీ పాసులు ఇవ్వాల‌ని అధికారుల‌కు సూచ‌న చేస్తున్నా అని సీఎం అన్నారు.

మా గ్రామాల‌ను ఫ్యూచ‌ర్ సిటీలో క‌ల‌పండి అని కొంద‌రు విజ్ఞ‌ప్తి చేశారు. అభివృద్ధి విస్త‌రిస్త‌ద‌ని, ఫ్యూచ‌ర్ సిటీ అభివృద్ధిలో మేం కూడా భాగ‌స్వాములం అవుతామ‌ని నా దృష్టికి తీసుకొచ్చారు. ఆ గ్రామాల‌కు సంబంధించి గ్రామ‌స‌భ‌లు పెట్టి.. తీర్మానం కాపీల‌ను క‌లెక్ట‌ర్‌కు, ఇంచార్జి మంత్రి శ్రీధ‌ర్ బాబుకు అందించండి.. ఆ త‌ర్వాత అభివృద్ధి ఫ‌లాలు అందే విధంగా ప్ర‌భుత్వం నిర్ణ‌యం తీసుకుంటుంది. వారి ఆకాంక్ష‌ల‌కు అనుగుణంగా ప్ర‌భుత్వం ప‌ని చేస్తుంది. అధునాత‌న న‌గ‌రంగా తీర్చిదిద్దాల‌న్న‌దే ఈ ప్ర‌భుత్వ ల‌క్ష్యం అని సీఎం స్ప‌ష్టం చేశారు.

Advertisement
Advertisement