త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

CM Revanth Reddy | ఫ్యూచర్ సిటీలో జ‌ర్న‌లిస్టుల‌కు ఇళ్ల స్థలాలు.. హామీ ఇచ్చిన సీఎం రేవంత్‌..!

CM Revanth Reddy | హైదరాబాద్‌లో సోమవారం శాసనమండలిలో జర్నలిస్టుల ప్రతినిధి బృందం సీఎం రేవంత్ రెడ్డిని కలిసింది. ఆర్ అండ్ బీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సమక్షంలో జరిగిన ఈ భేటీలో ప్రెస్ క్లబ్ స్థలం లీజు పెంపుతో పాటు జర్నలిస్టుల హెల్త్ కార్డులు, హౌసింగ్ సమస్యలు చర్చకు వచ్చాయి.

P

Hyderabad | Published On Mar 23, 2026, 8.11 pm IST

CM Revanth Reddy | ఫ్యూచర్ సిటీలో జ‌ర్న‌లిస్టుల‌కు ఇళ్ల స్థలాలు.. హామీ ఇచ్చిన సీఎం రేవంత్‌..!
Advertisement

CM Revanth Reddy | హైదరాబాద్‌లో సోమవారం శాసనమండలిలో జర్నలిస్టుల ప్రతినిధి బృందం సీఎం రేవంత్ రెడ్డిని కలిసింది. ఆర్ అండ్ బీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సమక్షంలో జరిగిన ఈ భేటీలో ప్రెస్ క్లబ్ స్థలం లీజు పెంపుతో పాటు జర్నలిస్టుల హెల్త్ కార్డులు, హౌసింగ్‌ సమస్యలు చర్చకు వచ్చాయి. జర్నలిస్టుల ఇళ్ల స్థలాల అంశాన్ని సీఎం స్వయంగా ప్రస్తావించారు. జేఎన్జే సొసైటీకి భూముల కేటాయింపు న్యాయపరమైన సమస్యలకు దారి తీసే అవకాశం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. ఎలాంటి లీగల్ ఇబ్బందులు లేకుండా అర్హులైన జర్నలిస్టులందరికీ టీజీఐఐసీ ద్వారా ఫ్యూచర్ సిటీలో ఇళ్ల స్థలాలు కేటాయించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపారు.

జేఎన్జే సభ్యులు, ఇతర జర్నలిస్టులకు ఒకేసారి న్యాయం జరిగేలా నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. ఇందుకు జర్నలిస్టులు కలిసి ఒక అభిప్రాయానికి రావాలని, రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డితో చర్చించాలని సూచించారు. జర్నలిస్టుల హౌసింగ్‌ విషయంలో గతంలో జరిగిన మధు రిడ్జ్ అపార్ట్మెంట్ ఘటన పునరావృతం కాకూడదని సీఎం స్పష్టం చేశారు. ఆ ప్రాజెక్ట్‌లో ప్రభుత్వ ప్రతిపాదనకు ముందుగా అంగీకరించి ఆ త‌ర్వాత వెనక్కి తగ్గడం వల్ల సమస్యలు తలెత్తాయని గుర్తు చేశారు. ప్రస్తుతం అలాంటి పరిస్థితి రాకుండా ముందస్తు సమ్మతి తీసుకుని, టీజీఐఐసీ ద్వారా ఫ్యూచర్ సిటీలో స్థలాల కేటాయింపును అమలు చేయాలని ఉద్దేశమన్నారు. సుప్రీంకోర్టు ఆదేశాల తర్వాత జేఎన్‌జే సొసైటీకి ప్రత్యామ్నాయాలు తగ్గాయని సీఎం పేర్కొన్నారు.

నిజాంపేట్, పేట్ బషీరాబాద్ ప్రాంతాల్లో భూముల కేటాయింపు సాధ్యం కాదని స్పష్టం చేశారు. సభ్యులు చెల్లించిన డిపాజిట్ మొత్తాల విషయమై కూడా ఆర్థిక పరిమితులు ఉన్నాయని సూచించారు. ప్రస్తుత పరిస్థితుల్లో పరస్పర సమన్వయం అవసరమని, అందరూ కలిసి ఒక నిర్ణయంతో ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ఇక ప్రెస్ క్లబ్ స్థలం లీజు పెంపు విషయమై సమర్పించిన వినతిపత్రాన్ని ప్రెసిడెంట్ విజయ్ కుమార్ రెడ్డి, సెక్రెటరీ రమేశ్ సీఎం రేవంత్ రెడ్డికి అందించారు. లీజు అంశాన్ని పరిశీలిస్తామని హామీ ఇచ్చారు. సీఎంను క‌లిసిన వారిలో హిందూ పత్రిక పొలిటికల్ ఎడిటర్ రామసాయం రవికాంత్ రెడ్డి, సాక్షి బ్యూరోచీఫ్ శ్రీకాంత్ కగనీకర్, టీ న్యూస్ ఇన్‌పుట్ ఎడిటర్ సూరజ్, ఫ్రీలాన్స్ జర్నలిస్టు ట్యాంక్ బండ్ రాములు ఉన్నారు.

Advertisement

తాజావార్తలు

Advertisement