త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

CM Prajavani | ప్రజాభవన్‌లో ‘సీఎం ప్రజావాణి’.. 634 దరఖాస్తులు.. అధికారులకు ఫోన్ చేసి స్పాట్‌లోనే సమస్యలకు చెక్

మహాత్మా జ్యోతిబా పూలే ప్రజాభవన్‌లో జరిగిన 225వ సీఎం ప్రజావాణికి ప్రజల నుంచి విశేష స్పందన లభించింది. 634 దరఖాస్తులు రాగా.. పలు సమస్యలను అక్కడికక్కడే పరిష్కరించారు.

J

Hyderabad | Published On May 26, 2026, 10.00 pm IST

CM Prajavani | ప్రజాభవన్‌లో ‘సీఎం ప్రజావాణి’.. 634 దరఖాస్తులు.. అధికారులకు ఫోన్ చేసి స్పాట్‌లోనే సమస్యలకు చెక్
Advertisement

CM Prajavani | త్రినేత్ర.న్యూస్ : హైదరాబాద్‌లోని (Hyderabad) మహాత్మా జ్యోతిబా పూలే ప్రజాభవన్‌లో మంగళవారం నిర్వహించిన 225వ 'సీఎం ప్రజావాణి' (CM Prajavani) కార్యక్రమానికి ప్రజల నుంచి విశేష స్పందన లభించింది. తమ సమస్యలు పరిష్కారం అవుతాయనే నమ్మకంతో రాష్ట్రం నలుమూలల నుంచి వచ్చిన ప్రజలు పెద్ద ఎత్తున దరఖాస్తులు సమర్పించారు. అధికారులు, నాయకులు దగ్గరుండి వారి వినతులను స్వీకరించారు.

ఎక్కువ దరఖాస్తులు ఆ శాఖలకే

ఈ దఫా ప్రజావాణిలో మొత్తం 634 అప్లికేషన్లు (Applications) అందినట్లు అధికారులు వెల్లడించారు. ఇందులో అత్యధికంగా పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖలకు సంబంధించి 296 వినతులు రాగా.. సొంతింటి కల నెరవేర్చుకునేందుకు ఇందిరమ్మ ఇండ్ల (Indiramma Houses) కోసం 181 మంది దరఖాస్తు చేసుకున్నారు. అలాగే, రెవెన్యూ శాఖకు 48, ఎన్ఆర్ఐల సమస్యల పరిష్కారానికి ఉద్దేశించిన 'ప్రవాసి ప్రజావాణి'కి 2 దరఖాస్తులు వచ్చాయి. ఇతర శాఖలకు సంబంధించి మరో 107 ఫిర్యాదులు అందాయి.

అక్కడికక్కడే పరిష్కారం (Spot Resolution)

సీఎం ప్రజావాణి ఇంచార్జ్, రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ డాక్టర్ జీ. చిన్నారెడ్డి స్వయంగా ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరించారు. వారి సమస్యలను ఓపికగా విన్న ఆయన.. తక్షణమే స్పందించారు. సంబంధిత అధికారులకు నేరుగా ఫోన్ చేసి పలు సమస్యలను అక్కడికక్కడే పరిష్కరించడం విశేషం. దీంతో దూరం నుంచి వచ్చిన బాధితులు సంతోషం వ్యక్తం చేశారు.

ఈ కార్యక్రమంలో ఏసీపీ ఉమేందర్, ఎన్ఆర్ఐ (NRI) సమన్వయ మండలి వైస్ చైర్మన్ మంద భీంరెడ్డి, ప్రవాసి ప్రజావాణి కోఆర్డినేటర్ బొజ్జా అమరేందర్ రెడ్డితో పాటు వివిధ శాఖల నోడల్ అధికారులు యాక్టివ్‌గా పాల్గొన్నారు.

Advertisement

తాజావార్తలు

Advertisement