త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Telangana Unemployed Youth Rally | 2 లక్షల ఉద్యోగాలు, నిరుద్యోగ భృతి ఏమాయే? దిల్ షుక్ నగర్‌లో భగ్గుమన్న నిరుద్యోగ యువత

హైదరాబాద్ దిల్ షుక్ నగర్ నిరుద్యోగుల కవాతుతో దద్దరిల్లింది. కాంగ్రెస్ ఇచ్చిన 2 లక్షల ఉద్యోగాల హామీ ఏమైందంటూ బీఆర్ఎస్ నేత రాకేష్ రెడ్డి ప్రభుత్వాన్ని నిలదీశారు.

J

Hyderabad | Published On May 26, 2026, 11.00 pm IST

Telangana Unemployed Youth Rally | 2 లక్షల ఉద్యోగాలు, నిరుద్యోగ భృతి ఏమాయే? దిల్ షుక్ నగర్‌లో భగ్గుమన్న నిరుద్యోగ యువత
Advertisement
  • హైదరాబాద్ దిల్ షుక్ నగర్‌లో నిరుద్యోగ యువత, పోలీస్ అభ్యర్థులతో కలిసి బీఆర్ఎస్ నేత ఏనుగుల రాకేష్ రెడ్డి భారీ నిరసన ర్యాలీ
  • ఏడాదిలో 2 లక్షల ఉద్యోగాలు, రూ. 4000 నిరుద్యోగ భృతి హామీలు ఏమయ్యాయని కాంగ్రెస్ ప్రభుత్వంపై ఫైర్
  • వివాదాస్పద జీవో 46, జీవో 87లను తక్షణమే రద్దు చేసి మెగా డీఎస్సీ ప్రకటించాలని డిమాండ్
  • పోలీస్ కానిస్టేబుల్ వయోపరిమితి 36 ఏళ్లకు, ఎస్సై వయోపరిమితి 38 ఏళ్లకు పెంచి వెంటనే 18,000 పోస్టులకు నోటిఫికేషన్ ఇవ్వాలని పట్టు

Telangana Unemployed Youth Rally | త్రినేత్ర.న్యూస్ : నిరుద్యోగ యువత కవాతుతో హైదరాబాద్‌లోని దిల్ షుక్ నగర్ (Dilsukhnagar) దద్దరిల్లింది. అసెంబ్లీ ఎన్నికల వేళ యువతకు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను తక్షణమే నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు ఏనుగుల రాకేష్ రెడ్డి (Yenugula Rakesh Reddy) ఆధ్వర్యంలో భారీ నిరసన ప్రదర్శన జరిగింది. ముఖ్యంగా పోలీస్ కానిస్టేబుల్, ఎస్సై అభ్యర్థులతో కలిసి రోడ్డెక్కిన ఆయన.. రాష్ట్ర ప్రభుత్వ తీరును తీవ్ర స్థాయిలో ఎండగట్టారు.

BRS Leader Yenugula Rakesh Reddy Leads Massive Unemployed Youth Protest in Dilsukhnagar

కాంగ్రెస్ సర్కార్‌కు నిరుద్యోగుల సూటి ప్రశ్నలు

ర్యాలీలో పాల్గొన్న నిరుద్యోగులు, బీఆర్ఎస్ శ్రేణులు.. కాంగ్రెస్ ప్రభుత్వం (Congress Govt) ముందు ప్రధానంగా ఆరు ప్రశ్నలు ఉంచారు.

  • అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్న హామీ ఏమైంది?
  • 20 వేల పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీ ఎప్పుడు చేస్తారు?
  • నిరుద్యోగుల పాలిట శాపంగా మారిన జీవో 46 (GO 46) ను ఎప్పుడు రద్దు చేస్తారు?
  • మెగా డీఎస్సీ (Mega DSC) హామీని ఎందుకు గాలికొదిలేశారు?
  • ఎస్సీ, ఎస్టీ, బీసీ బ్యాక్‌లాగ్ (Backlog) పోస్టుల భర్తీ ఏది?
  • ఎన్నికల ముందు ఊదరగొట్టిన రూ. 4,000 నిరుద్యోగ భృతి ఎందుకు ఇవ్వడం లేదు?

వయోపరిమితి పెంచాలి.. నోటిఫికేషన్లు ఇవ్వాలి

గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో సీఎం కేసీఆర్ (KCR) కనీసం రెండేళ్లకోసారి పోలీస్ ఉద్యోగ నోటిఫికేషన్లు, ఆరు నెలలకోసారి ఏదో ఒక ప్రభుత్వ ఉద్యోగ నోటిఫికేషన్ (Job Notification) ఇచ్చేవారని రాకేష్ రెడ్డి గుర్తుచేశారు. కానీ కాంగ్రెస్ వచ్చాక పరిస్థితి దారుణంగా తయారైందని విమర్శించారు. ప్రభుత్వం తక్షణమే జీవో 87 (GO 87) ను రద్దు చేయాలని డిమాండ్ చేశారు.

BRS Leader Yenugula Rakesh Reddy Leads Massive Unemployed Youth Protest in Dilsukhnagar

అలాగే, పోలీస్ అభ్యర్థులకు ఊరటనిచ్చేలా కానిస్టేబుల్ వయోపరిమితిని (Age limit) 36 ఏళ్లకు, ఎస్సై వయోపరిమితిని 38 ఏళ్లకు పెంచాలని పట్టుబట్టారు. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 18 వేల పోలీస్ ఎస్సై, కానిస్టేబుల్ ఉద్యోగాలకు వెంటనే నోటిఫికేషన్ విడుదల చేయాలని డిమాండ్ చేశారు.

రోడ్డున పడ్డ నిరుద్యోగులు

నిరుద్యోగ భృతి అనే హామీ పూర్తిగా నీరుగారిపోయిందని, రాజీవ్ యువ వికాసం వికసించకుండానే వాడిపోయిందని ఆందోళనకారులు మండిపడ్డారు. ఎన్నో ఏళ్లుగా పోలీస్ ఉద్యోగాల కోసం (Police jobs) రాత్రింబవళ్లు కష్టపడి చదువుకున్న అభ్యర్థులు.. నేడు నోటిఫికేషన్లు లేక చిరు వ్యాపారులుగా ఎందుకు మారాల్సి వస్తోందంటూ రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ప్రభుత్వం వెంటనే స్పందించి నిరుద్యోగుల సమస్యలు పరిష్కరించకపోతే ఆందోళనలు మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు.

BRS Leader Yenugula Rakesh Reddy Leads Massive Unemployed Youth Protest in Dilsukhnagar

Advertisement

తాజావార్తలు

Advertisement