త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Stray Dogs | వీధి కుక్క‌ల ర‌క్తంతో వ్యాపారం.. ఒక్కో ప్యాకెట్ ధ‌ర రూ. 25 వేలు

Stray Dogs | మ‌న‌షుల‌నే కాదు.. చివ‌ర‌కు కుక్క‌ల‌ను కూడా వ‌ద‌ల‌డం లేదు. మాన‌వ ర‌క్తంతోనే అక్ర‌మ వ్యాపారం చేస్తున్నారు అనుకున్నాం ఇన్నాళ్లు.. కానీ మ‌న‌షుల ప‌ట్ల విశ్వాసంగా మెలిగే వీధి కుక్క‌ల ర‌క్తంతో వ్యాపారం చేస్తున్నారు.

S

Hyderabad | Published On Apr 28, 2026, 8.02 pm IST

Stray Dogs | వీధి కుక్క‌ల ర‌క్తంతో వ్యాపారం.. ఒక్కో ప్యాకెట్ ధ‌ర రూ. 25 వేలు
Advertisement

Stray Dogs | త్రినేత్ర‌.న్యూస్ : మ‌న‌షుల‌నే కాదు.. చివ‌ర‌కు కుక్క‌ల‌ను కూడా వ‌ద‌ల‌డం లేదు. మాన‌వ ర‌క్తంతోనే అక్ర‌మ వ్యాపారం చేస్తున్నారు అనుకున్నాం ఇన్నాళ్లు.. కానీ మ‌న‌షుల ప‌ట్ల విశ్వాసంగా మెలిగే వీధి కుక్క‌ల ర‌క్తంతో వ్యాపారం చేస్తున్నారు. ఈ ఘోర‌మైన దారుణం రాష్ట్ర రాజ‌ధాని హైద‌రాబాద్ న‌గ‌రంలో వెలుగు చూసింది.

వెలుగులోకి ఇలా..

హైద‌రాబాద్ న‌గ‌రంలోని షేక్‌పేట్‌లో కుక్క‌ల‌కు సంబంధించి ఓ ప్ర‌యివేటు ఆస్ప‌త్రి ఉంది. అయితే ఆ ఆస్ప‌త్రిలో వీధి కుక్క‌ల నుంచి ర‌క్తాన్ని సేక‌రించి, పెంపుడు కుక్క‌ల‌కు ఎక్కిస్తున్న‌ట్లు జంతు ప్రేమికుల దృష్టికి వ‌చ్చింది. ఈ మేర‌కు జంతు హ‌క్కుల ఉద్య‌మ‌కర్త మేన‌కా గాంధీ రాష్ట్ర జంతు సంక్షేమ సంస్థ‌కు ఫిర్యాదు చేశారు. దీంతో అధికారులు విచార‌ణ చేప‌ట్టారు. జంతుప్రేమికుల ఫిర్యాదులు, ఆసుపత్రిలో పని చేసే సిబ్బంది ద్వారా బయటకు వచ్చిన ఫొటోలు, వీడియోలు, ఇతర సమాచారాన్ని పరిశీలిస్తే పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

వీధి కుక్క‌ల నుంచి ర‌క్తం సేక‌రించి..

ఇక ఈ ప్ర‌యివేటు ఆస్ప‌త్రి నిర్వాహ‌కులు.. వీధి కుక్క‌ల చికిత్స‌, సంర‌క్ష‌ణ పేరుతో ఆస్ప‌త్రి నిర్వాహ‌కులు వాటిని ఆస్ప‌త్రికి త‌ర‌లిస్తారు. ఇక వాటిని బోన్ల‌లో ఉంచి ఆహారం అందించి పెంచుతారు. ఇది ప‌క్క‌న పెడితే.. ఆస్ప‌త్రి నిర్వాహ‌కుల టార్గెట్ అంతా పెంపుడు శున‌కాలే. అనారోగ్య కార‌ణాల రీత్యా ఆ శున‌కాల‌ను ఆస్ప‌త్రికి త‌ర‌లించిన‌ప్పుడు.. వాటికి అవ‌స‌రం లేకున్నా ర‌క్త ప‌రీక్ష‌లు నిర్వ‌హిస్తారు. ఇక ర‌క్త‌హీన‌త ఉన్న‌ట్టు రిపోర్టులు పుట్టుకొస్తాయి. త‌మ పెంపుడు కుక్క ర‌క్త‌హీన‌త‌తో బాధ‌ప‌డుతుంద‌ని ఆందోళ‌న చెందేలా వాతావ‌ర‌ణాన్ని క్రియేట్ చేస్తారు. దీంతో ర‌క్తం ఎక్కించాల‌నే స్థాయి వ‌ర‌కు ఆస్ప‌త్రి నిర్వాహ‌కులు తీసుకువ‌స్తారు.

ఒక్కో ప్యాకెట్ ర‌క్తం ధ‌ర రూ. 25 వేలు..

ఇక బోనులో ఉన్న వీధికుక్క‌ల రక్తాన్ని ఎక్కిస్తామంటారు. అక్కడ ఒక్కో ప్యాకెట్​ రక్తాన్ని రూ.18 వేల నుంచి రూ.25 వేల వరకు విక్రయిస్తున్నారు. ఈ క్రమంలో ఆరోగ్యంగా ఉన్న పలు వీధి కుక్కలు చివరకు రక్తహీనతతో చనిపోతాయి. ఒక్కోసారి వీధి కుక్కల రక్తం సరిపోక వైద్యం తీసుకుంటున్న పెంపుడు కుక్కల రక్తాన్నీ తీస్తుంటారు అని జంతు ప్రేమికుల విచార‌ణ‌లో తేలింది. ఈ వ్య‌వ‌హారంపై అధికారులు విచార‌ణ కొన‌సాగుతోంది.

Advertisement
Advertisement