త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Nacharam | గ్లాస్ కోసం గొడ‌వ‌.. మూడంత‌స్తుల బిల్డింగ్ పైనుంచి తోసేసి అన్న‌ను చంపిన త‌మ్ముడు

Nacharam | హైద‌రాబాద్ నాచారంలో (Nacharam) దారుణం చోటుచేసుకున్న‌ది. సంక్రాంతి పండుగ ఆ కుటుంబంలో తీవ్ర విషాదం నింపింది. మ‌ద్యం తాగుతూ గ్లాస్ (Liquor Glass) కోసం జ‌రిగిన గొడ‌బ ఒక‌రి ప్రాణాన్ని బ‌లితీసుకున్న‌ది. బ‌ధువారం అర్ధ‌రాత్రి జ‌రిగిన ఈ ఘ‌ట‌న ఆల‌స్యంగా వెలుగులోకి వ‌చ్చింది.

G

Hyderabad | Published On Jan 17, 2026, 6.49 am IST

Nacharam | గ్లాస్ కోసం గొడ‌వ‌.. మూడంత‌స్తుల బిల్డింగ్ పైనుంచి తోసేసి అన్న‌ను చంపిన త‌మ్ముడు
Advertisement

త్రినేత్ర‌.న్యూస్‌: హైద‌రాబాద్ నాచారంలో (Nacharam) దారుణం చోటుచేసుకున్న‌ది. సంక్రాంతి పండుగ ఆ కుటుంబంలో తీవ్ర విషాదం నింపింది. మ‌ద్యం తాగుతూ గ్లాస్ (Liquor Glass) కోసం జ‌రిగిన గొడ‌బ ఒక‌రి ప్రాణాన్ని బ‌లితీసుకున్న‌ది. బ‌ధువారం అర్ధ‌రాత్రి జ‌రిగిన ఈ ఘ‌ట‌న ఆల‌స్యంగా వెలుగులోకి వ‌చ్చింది.

నాచారంలోని ఓ కుటుంబానికి చెందిన ఇద్దరు అన్నదమ్ములు ఒకే ఇంట్లో నివాసంలో ఉంటున్నారు. సంక్రాంతి పండుగ వేళ బుధవారం అర్ధరాత్రి సమయంలో అన్నదమ్ములు ఇద్దరూ భవనంపై మద్యం సేవిస్తున్నారు. ఈ క్రమంలో గ్లాస్ విషయంలో ఇద్ద‌రి మ‌ధ్య చిన్న గొడ‌వ‌ జరిగింది. మాటా మాటా పెర‌గ‌డం అదికాస్తా పెద్దదిగా మారింది. అస‌లే మద్యం మత్తు, ఆపై లొల్లి.. ఇంకేముంది ఆగ్ర‌హంతో ఊగిపోయిన త‌ప్పుడు.. అన్న రోహ‌న్‌ను మూడంత‌స్తుల భ‌వ‌నం పైనుంచి కిందికి తోసేశాడు.

దీంతో తీవ్రంగా గాయ‌ప‌డిన రోహ‌న్‌ను స్థానికులు ద‌వాఖాన‌కు త‌ర‌లించారు. అయితే మార్గ‌మ‌ధ్య‌లోనే అత‌డు ప్రాణాలు కోల్పోయాడు, స‌మాచారం అందుకున్న పోలీసులు ఘ‌ట‌నా స్థ‌లానికి చేరుకుని ప‌రిశీలించారు. నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. మ‌ద్య మ‌త్తులో విచ‌క్ష‌ణ కోల్పోవడంతోనే ఘాతుకానికి పాల్ప‌డిన‌ట్లు ప్రాథ‌మిక విచార‌ణ‌లో తేలింది. ఈ ఘ‌ట‌న‌పై కేసు న‌మోదుచేసిన పోలీసులు ద‌ర్యాప్తు చేస్తున్నారు.

Hyderabad, Nacharam, Drunken Brothers, Murder, Three Story Building, Liquor Glass

Advertisement

తాజావార్తలు

Advertisement