త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

British Dentist | ముత్తాత తండ్రి స‌మాధి కోసం 19 ఏండ్లు అన్వేష‌ణ‌.. ఇంగ్లండ్ నుంచి వ‌చ్చి నివాళుల‌ర్పించిన బ్రిటిష్ డాక్ట‌ర్

British Dentist | అస‌లే మానవ‌ సంబంధాలు అడుగంటిపోతున్న రోజులివి.. ఒక్క త‌ల్లికి పుట్టిన పిల్ల‌లు ఒక‌రికిఒక‌రు ప‌డ‌క ప‌గ‌లు పెంచుకున్నారు. ఆస్తుల కోసం ఒక‌రినొక‌రు చంపుకుంటున్నారు. క‌న్న త‌ల్లి దండ్రుల‌ను వ‌దిలించుకునేందుకు దారులు వెతుక్కుంటున్నారు. అలాంటివారికి కండ్లు తెరింపించేదే ఈ స్టోరి.. ఎప్పుడో 130 ఏండ్ల క్రితం మ‌ర‌ణించిన ముత్తాత తండ్రి (Great-Grandfather) స‌మాధిని వెతుక్కుంటూ ఓ బ్రిటిష్ డెంటిస్ట్ (British dentist) ఇంగ్లండ్ నుంచి త‌న భార్య‌తో క‌లిసి హైద‌రాబాద్ వ‌చ్చాడు.

G

Hyderabad | Published On Feb 20, 2026, 9.54 am IST

British Dentist | ముత్తాత తండ్రి స‌మాధి కోసం 19 ఏండ్లు అన్వేష‌ణ‌.. ఇంగ్లండ్ నుంచి వ‌చ్చి నివాళుల‌ర్పించిన బ్రిటిష్ డాక్ట‌ర్
Advertisement

British Dentist | త్రినేత్ర‌.న్యూస్‌: అస‌లే మానవ‌ సంబంధాలు అడుగంటిపోతున్న రోజులివి.. ఒక్క త‌ల్లికి పుట్టిన పిల్ల‌లు ఒక‌రికిఒక‌రు ప‌డ‌క ప‌గ‌లు పెంచుకున్నారు. ఆస్తుల కోసం ఒక‌రినొక‌రు చంపుకుంటున్నారు. క‌న్న త‌ల్లి దండ్రుల‌ను వ‌దిలించుకునేందుకు దారులు వెతుక్కుంటున్నారు. అలాంటివారికి కండ్లు తెరింపించేదే ఈ స్టోరి.. ఎప్పుడో 130 ఏండ్ల క్రితం మ‌ర‌ణించిన ముత్తాత తండ్రి (Great-Grandfather) స‌మాధిని వెతుక్కుంటూ ఓ బ్రిటిష్ డెంటిస్ట్ (British dentist) ఇంగ్లండ్ నుంచి త‌న భార్య‌తో క‌లిసి హైద‌రాబాద్ వ‌చ్చాడు. 19 ఏండ్ల‌పాటు సాగించిన అన్వేష‌ణ ఫ‌లించ‌డంతో తాత స‌మాధి వ‌ద్ద భావోద్వేగంతో నివాళుల‌ర్పించాడు. ఎక్కడో పుట్టిన పిల్లల్ని, ఎవరో విదేశీయులు దత్తత తీసుకుంటే.. మ‌రెక్క‌డో పెరిగిన పిల్లలు, పెద్దలయ్యాక తమ మూలాలు వెతుక్కుంటూ హైద‌రాబాద్ రావ‌డం.. నిజంగా ఆశ్చ‌ర్య‌మే క‌దా..

1858లో ఇంగ్లండ్‌లోని వెవ‌ర్ద‌న్‌లో చార్లెస్ విల్స‌న్ (Lieutenant Charles Wilson) జ‌న్మించారు. 1880లో బ్రిటిష్ సైన్యంలో చేరారు. విధుల్లో భాగంగా బెంగళూరు, మద్రాసులో పనిచేశారు. ఆ తర్వాత సికింద్రాబాద్ రెజిమెంట్‌లో (Secunderabad cantonment) లెఫ్టినెంట్‌గా పనిచేశారు. ఆ స‌మ‌యంలో అనారోగ్యంతో తిరుమ‌ల‌గిరిలోని స్టేష‌న్ ద‌వాఖాన‌లో చేరారు. 1906 ఆగస్టు 4న మరణించారు. అప్పుడు ఆయ‌న వ‌య‌సు 48 ఏండ్లు. దీంతో ఆయ‌న మృత‌దేహాన్ని తిరుమ‌ల‌గిరి (Tirumalagiri) సిమెట్రీలో ఖ‌న‌నం చేశారు. విల్స‌న్ చ‌నిపోయిన త‌ర్వాత ఆయ‌న భార్య హ్యారియెట్ త‌న న‌లుగురు పిల్ల‌ల‌ను తీసుకుని 1907, మార్చిలో ఇంగ్లండ్‌లోని బ‌ర్మింగ్‌హామ్ వెళ్లిపోయారు.

కాగా, ఇంట్లోని పాత దస్త్రాల ద్వారా తన తాత తండ్రికి తండ్రి.. అంటే ముత్తాతకు తండ్రి అయిన చార్లెస్ విల్సన్ బ్రిటిష్ ఇండియాలో మరణించారని డెంటిస్టు అయిన డాక్ట‌ర్‌ రాబిన్ డిక్సన్ (Dr. Robin Dickson) తెలుసుకున్నారు. కుటుంబ స‌భ్యుల‌తో క‌లిసి ఆయ‌న స‌మాధికి నివాళుల‌ర్పించాల‌నుకున్నారు. దీంతో అప్పటి నుంచి తన ముత్తాత సమాధి ఎక్కడ ఉందో తెలుసుకోవాలని డిక్సన్ గట్టిగా సంకల్పించుకున్నారు. సుమారు 19 ఏండ్ల‌ పాటు బెంగళూరు, చెన్నై, సికింద్రాబాద్‌లలో గాలించారు. అయినా గుర్తించ‌లేక‌పోయారు. ఈ క్రమంలో ఆయ‌న‌కు స్థానిక జ‌ర్న‌లిస్టు రవిరెడ్డి సహాయం దొరికింది. సికింద్రాబాద్‌లోని తిరుమలగిరి సిమెట్రీ-12లో చార్లెస్ విల్సన్ సమాధిని ఎనిమిది నెలల క్రితం గుర్తించారు. వివ‌రాలు స‌రిపోల్చుకున్న రాబిన్ డిక్సన్.. త‌న భార్య లిన్‌తో క‌లిసి ఇంగ్లండ్ నుంచి హైద‌రాబాద్ చేరుకున్నారు. ముత్తాత సమాధిపై తెల్ల గులాబీలు ఉంచి పుష్పాంజ‌లి ఘ‌టించారు. ఈ క్ష‌ణం కోసం ఎన్నో ఏండ్లు ఎదురుచూశాను. ఇప్పుడు నా హృద‌యం సంతృప్తితో నిండిపోయింది అని రాబిన్ భావోద్వేగానికి గుర‌య్యారు.

Advertisement
Advertisement