DGP CV Anand | 14 నుంచి గణేశ్ ఉత్సవాలు.. అప్రమత్తంగా ఉండాల్సిందే : డీజీపీ సీవీ ఆనంద్
DGP CV Anand | గణేశ్ ఉత్సవాలను ప్రశాంతంగా నిర్వహించేందుకు రాష్ట్రవ్యాప్తంగా సమగ్ర భద్రతా చర్యలు చేపట్టాలని డీజీపీ సీవీ ఆనంద్ పోలీసు అధికారులను ఆదేశించారు. ఉత్సవాల ఏర్పాట్లపై సోమవారం డీజీపీ కార్యాలయం నుంచి రాష్ట్రంలోని ఎస్‌ఐలు, ఉన్నతాధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
25న గణేశ్ నిమజ్జనం
విద్యుత్తు , ట్రాఫిక్ నియంత్రణ, జనసమూహాల నిర్వహణపై ప్రత్యేక దృష్టి
DGP CV Anand | త్రినేత్ర.న్యూస్ : గణేశ్ ఉత్సవాలను ప్రశాంతంగా నిర్వహించేందుకు రాష్ట్రవ్యాప్తంగా సమగ్ర భద్రతా చర్యలు చేపట్టాలని డీజీపీ సీవీ ఆనంద్ పోలీసు అధికారులను ఆదేశించారు. ఉత్సవాల ఏర్పాట్లపై సోమవారం డీజీపీ కార్యాలయం నుంచి రాష్ట్రంలోని ఎస్‌ఐలు, ఉన్నతాధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. సెప్టెంబరు 14న ప్రారంభమయ్యే ఉత్సవాలు.. 25న గణేశ్ విగ్రహాల నిమజ్జనంతో ముగియనున్న నేపథ్యంలో ముందస్తు ఏర్పాట్లపై దిశానిర్దేశం చేశారు.
మండపాల వివరాలు ఆన్‌లైన్‌లో

గణేశ్ మండపాల వివరాలను సేకరించి పర్యవేక్షించేందుకు ప్రత్యేక ఆన్‌లైన్ పోర్టల్ అందుబాటులోకి తెచ్చినట్లు డీజీపీ తెలిపారు. మండపం ఉన్న ప్రదేశం, నిర్వాహకులు, కమిటీ సభ్యులు, నిమజ్జనానికి వినియోగించే వాహనాల వివరాలను అందులో నమోదు చేయాలి. ఎస్‌హెచ్‌వోలకు ప్రత్యేక లాగిన్‌లు ఇచ్చినందున మండపాల వద్ద పరిస్థితులను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలి. సీపీలు, డీసీపీలు, ఎస్పీలు మండపాలను సందర్శించి పాయింట్ బుక్స్‌లో పరిశీలన వివరాలు నమోదు చేయాలని సూచించారు.
విద్యుత్తు, ట్రాఫిక్‌పై ప్రత్యేక దృష్టి
మండపాల వద్ద విద్యుత్తు, ట్రాఫిక్ నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించాలని డీజీపీ ఆదేశించారు. విద్యుత్తు, అగ్నిమాపక తదితర శాఖలతో సమన్వయం చేసుకోవాలి. మండపాల వద్ద నిర్వాహకులు స్వచ్ఛంద కార్యకర్తలను ఏర్పాటు చేసుకునేలా చూడడంతోపాటు సీసీ కెమెరాలు, క్యూల నిర్వహణకు తగిన భద్రతా ఏర్పాట్లు చేయాలని సూచించారు.
నిమజ్జన మార్గాలపై ముందస్తు ప్రణాళిక

గణేష్ నిమజ్జనానికి సంబంధించి మార్గాలు, రహదారులు, వంతెనలను ముందుగానే గుర్తించి వాటి సామర్థ్యాన్ని పరిశీలించాలని డీజీపీ సూచించారు. నిమజ్జన మార్గాల్లో ట్రాఫిక్, బందోబస్తు ఏర్పాట్లను ముందుగానే సిద్ధం చేయాలి. భద్రతా చర్యల్లో భాగంగా బాంబు డిస్పోజల్ బృందాలు, డాగ్ స్క్వాడ్‌లను అవసరమైన చోట వినియోగించాలని ఆదేశించారు.
జియో ట్యాగింగ్‌తో పర్యవేక్షణ
మండపాల ప్రాంతాలను జియో ట్యాగింగ్ చేసి భద్రతా ఏర్పాట్ల వివరాలను నమోదు చేయాలని డీజీపీ సూచించారు. జియో ట్యాగింగ్, తనిఖీల వివరాలను టీజీ-కాప్ ప్లాట్‌ఫాంలోనూ అప్‌లోడ్ చేయాల న్నారు.
కమిటీలతో సమన్వయం
గణేశ్ ఉత్సవ కమిటీలు, శాంతి కమిటీలతో సమావేశాలు నిర్వహించి సమస్యలను ముందుగానే పరిష్కరించాలని డీజీపీ తెలిపారు. బందోబస్తు విధుల్లో పాల్గొనే పోలీసు సిబ్బందికి ప్రత్యేకంగా బ్రీఫింగ్ నిర్వహించాలి. సామాజిక మాధ్యమాలపై నిఘా ఉంచి శాంతిభద్రతలకు విఘాతం కలిగించే అంశాలపై తక్షణమే స్పందించాలని సూచించారు. అన్ని శాఖలు, ఉత్సవ కమిటీలు, ప్రజల సమన్వయంతో ఉత్సవాలను ప్రశాంతంగా నిర్వహించాలని డీజీపీ సీవీ ఆనంద్ పేర్కొన్నారు.
సమావేశంలో డీజీ టెక్నికల్ సర్వీసెస్ వి.వి. శ్రీనివాసరావు, ఐజీ ఇంటెలిజెన్స్ కార్తికేయ, ఐజీ మల్టిజోన్-1 చంద్రశేఖర్‌రెడ్డి, టీస్పార్క్ ఎస్పీ రూపేష్, ఏఐజీ రమణకుమార్, హైదరాబాద్ డీసీపీ అవినాష్‌కుమార్, డీసీపీ విక్రాంత్‌కుమార్ సింగ్‌తో పాటు ఇతర పోలీసు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
సంబంధిత వార్తలు

Rama Nandana | ఉద్యోగాల పేరుతో మోసం ఆరోపణలు.. శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో యూట్యూబర్ నందన అరెస్ట్
సెప్టెంబర్ 7, 2026

Ramchandar Rao Arrest | బీజేపీ అసెంబ్లీ ముట్టడి తీవ్ర ఉద్రిక్తత.. రాంచందర్‌రావు అరెస్ట్
సెప్టెంబర్ 7, 2026

CM Revanth Reddy | రైతుల కోసం జీవితాన్ని ధారపోసిన నాయకుడు సారంపల్లి మల్లారెడ్డి
సెప్టెంబర్ 7, 2026
తాజావార్తలు
- ●DRDO SHIELD Project | శత్రు డ్రోన్ల పాలిట యమపాశం.. 'షీల్డ్' ప్రాజెక్టుతో డీఆర్డీవో సంచలనం
- ●అసెంబ్లీ ఫైట్ కాదు... ఇక ‘స్ట్రీట్ ఫైట్’: రేవంత్ సవాల్‌కు కేసీఆర్ కొత్త కౌంటర్!
- ●SIR | తెలంగాణలో 'సర్' గడువు మరోసారి పొడిగింపు
- ●Telangana Assembly | వారం రోజుల పాటు తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు
- ●Auto Charges | త్వరలో ఆటో ఛార్జీలు పెంపు
- ●KTR | మా ఆడబిడ్డలకు క్షమాపణ చెప్పాల్సిందే.. అప్పటి వరకు రేవంత్‌ను వదిలిపెట్టం : కేటీఆర్

DRDO SHIELD Project | శత్రు డ్రోన్ల పాలిట యమపాశం.. 'షీల్డ్' ప్రాజెక్టుతో డీఆర్డీవో సంచలనం

అసెంబ్లీ ఫైట్ కాదు... ఇక ‘స్ట్రీట్ ఫైట్’: రేవంత్ సవాల్‌కు కేసీఆర్ కొత్త కౌంటర్!

SIR | తెలంగాణలో 'సర్' గడువు మరోసారి పొడిగింపు

Telangana Assembly | వారం రోజుల పాటు తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు



