HMWSSB | రాత్రి 10 తర్వాతే మంచి నీళ్ల సరఫరా.. జలమండలి ప్రకటన
HMWSSB | హైదరాబాద్ నగర పరిధిలోని సింగపూర్ - ఖానాపూర్ మధ్య బుల్కాపూర్ గ్రామ సమీపంలో సోమవారం తెల్లవారుజామున 5 గంటలకు మంచి నీటి పైపులైన్ పగిలిపోయింది. దీంతో పలు ప్రాంతాల్లో నీటి సరఫరాకు ఆటంకం ఏర్పడింది.
HMWSSB | త్రినేత్ర.న్యూస్ : హైదరాబాద్ నగర పరిధిలోని సింగపూర్ - ఖానాపూర్ మధ్య బుల్కాపూర్ గ్రామ సమీపంలో సోమవారం తెల్లవారుజామున 5 గంటలకు మంచి నీటి పైపులైన్ పగిలిపోయింది. దీంతో పలు ప్రాంతాల్లో నీటి సరఫరాకు ఆటంకం ఏర్పడింది. ఈ నేపథ్యంలో జలమండలి కీలక ప్రకటన చేసింది.
షేక్‌పేట్ రిజర్వాయర్, భోజగుట్ట రిజర్వాయర్ పరిధిలోని గండిపేట్, కోకాపేట్, నార్సింగి, మంచిరేవుల, పుప్పాలగూడ, ఖానాపూర్, మణికొండతో పాటు పలు ఏరియాల్లో మంచి నీళ్ల సరఫరాకు అంతరాయం కలిగిందని జలమండలి పేర్కొంది. మంచి నీళ్ల పైపులైన్ పగిలిపోయిందని తెలుసుకున్న జలమండలి ఎండీ అశోక్ రెడ్డి హుటాహుటిన ఆ ప్రాంతానికి వెళ్లి పరిశీలించారు. నీటి సరఫరాకు అంతరాయం కలిగిన ప్రాంతాల్లో ట్యాంకర్లతో మంచినీటిని సరఫరా చేయాలని ఆదేశించారు. వీలైనంత త్వరగా మరమ్మతులు చేయాలన్నారు. ఈ క్రమంలో సోమవారం ఉదయం 7 గంటలకే మరమ్మతులు చేపట్టినట్లు అధికారులు పేర్కొన్నారు. రాత్రి 10 గంటల వరకు పనులు పూర్తవుతాయని, ఆ తర్వాతనే నీటి సరఫరా చేస్తామని అధికారులు స్పష్టం చేశారు.
తాజావార్తలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు





