Old Man Missing | తండ్రి తప్పిపోయాడు.. కొడుకు ఫిర్యాదు చేయడానికెళ్లాడు.. ఆ తర్వాత ఏమైందంటే!
Old Man Missing | రెండు రోజులుగా ఓ వృద్ధ త్రండి కనిపించకుండా పోయాడు. దీంతో తన చిన్న కొడుకు అంబర్‌పేట పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయడానికి వెళ్లగా ఇదే సమయంలో చిలకలగూడ పోలీసుల సంరక్షణలో తన తండ్రి క్షేమంగా ఉన్నాడని సమాచారం అందింది. ఈ విషయంలో మానవత్వం చాటుకున్న పోలీసులపై సర్వత్రా ప్రశంసలు కురుస్తున్నాయి.
Old Man Missing | త్రినేత్ర.న్యూస్: రెండు రోజులుగా ఓ వృద్ధ త్రండి కనిపించకుండా పోయాడు. దీంతో తన చిన్న కొడుకు అంబర్‌పేట పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయడానికి వెళ్లగా ఇదే సమయంలో చిలకలగూడ పోలీసుల సంరక్షణలో తన తండ్రి క్షేమంగా ఉన్నాడని సమాచారం అందింది. కేసును ఉపసంహరించుకుని వెంటనే బయలు దేరాడు. వృద్ధుడిని ఆత్మీయంగా వివరాలు అడిగి తెలుసుకొని కుటుంబ సభ్యులకు అప్పగించడంతో కథ సుఖాంతమైంది. ఈ విషయంలో మానవత్వం చాటుకున్న పోలీసులపై సర్వత్రా ప్రశంసలు కురుస్తున్నాయి. ఈ ఘటన ఎక్కడ జరిగిందంటే..
చిలకలగూడ సహాయ పోలీస్ కమిషనర్ K. శశాంక్ రెడ్డి (Shashank Reddy) ప్రకారం వివరాలి ఉన్నాయి. అంబర్‌పేట ఖాద్రీ బాగ్ కు చెందిన షేక్ ఇస్మాయిల్ (Shaik Esmail Khan) (85) ఈ నెల 22న నమాజ్ కోసమని ఇంటి నుండి బయటకు వెళ్లి తిరిగి రాలేదు. కాగా రెండు రోజుల క్రితం ఆయన చిలకలగూడ పరిసర ప్రాంతాల్లో దిక్కుతోచని స్థితిలో ఒంటరిగా తిరుగుతున్నాడు. ఇది గమనించిన చిలకలగూడ పోలీసులు ఆయన్ను ఆత్మీయంగా విచారించగా.. తాను మౌలాలీ ప్రాంతంలో ఉంటానని, తన కుమారుడు ఆటో డ్రైవర్ అని తెలిపారు. దీనిపై పోలీసులు పత్రికల ద్వారా విస్తృతంగా ప్రచారం చేస్తూనే మరోవైపు వృద్ధుడి గుర్తింపు కోసం ప్రయత్నాలు ముమ్మరం చేశారు.
చిలకలగూడ SHO V. రామకృష్ణ ఆధ్వర్యంలో సబ్-ఇన్‌స్పెక్టర్ (SI) చంద్రయ్య, హోంగార్డ్ ఆఫీసర్ పిచ్చయ్యలు ప్రత్యేక చొరవ తీసుకున్నారు. వారు వృద్ధుడిని నేరుగా మౌలాలీ ప్రాంతానికి తీసుకెళ్లారు. అక్కడ స్థానిక ఆటో డ్రైవర్లకు చూపించగా వారు వృద్ధుడిని గుర్తించారు. వెంటనే బాధిత వృద్ధుడి కుమారులు షేక్ సలీం, షేక్ కలీంలకు సమాచారం అందించారు. అనంతరం షేక్ ఇస్మాయిల్‌ను పోలీసులు వారికి సురక్షితంగా అప్పగించారు. ఎస్‌ఐ చంద్రయ్య, హోంగార్డ్ పిచ్చయ్యలను, అధికారులను ఏసీపీ ప్రత్యేకంగా అభినందించారు.
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●DRDO Scientist Home | డీఆర్డీవో కాంప్లెక్స్‌లో భారీ చోరీ.. శాస్త్రవేత్త ఇంట్లో రూ.50 లక్షల విలువైన బంగారం అపహరణ
- ●Seethakka | పనిచేసే గ్రామీణ మహిళల కోసమే హాస్టళ్లు: మంత్రి సీతక్క
- ●MGBS | ఎంజీబీఎస్‌లో ఆర్టీసీ బస్సులో చెలరేగిన మంటలు.. పరుగులు తీసిన ప్రయాణికులు
- ●Money Saving | చిన్న చిన్న ఖర్చులే దీర్ఘకాలంలో భారీ నష్టాలను ఇస్తాయా.. డబ్బు పొదుపు చేయడంలో మల్లర్నీ ఏం చెప్పారు..?
- ●Smart Phones | ఉదయం నిద్ర లేవగానే ఫోన్లను చూడడం తగ్గిస్తున్నారు.. కారణం ఇదే..
- ●India-Pakistan Border | విద్యుత్‌దీపాలతో వెలుగులీనుతున్న ఇండోపాక్ బోర్డర్.. ఆకట్టుకుంటున్న వీడియో

DRDO Scientist Home | డీఆర్డీవో కాంప్లెక్స్‌లో భారీ చోరీ.. శాస్త్రవేత్త ఇంట్లో రూ.50 లక్షల విలువైన బంగారం అపహరణ

Seethakka | పనిచేసే గ్రామీణ మహిళల కోసమే హాస్టళ్లు: మంత్రి సీతక్క

MGBS | ఎంజీబీఎస్‌లో ఆర్టీసీ బస్సులో చెలరేగిన మంటలు.. పరుగులు తీసిన ప్రయాణికులు

Money Saving | చిన్న చిన్న ఖర్చులే దీర్ఘకాలంలో భారీ నష్టాలను ఇస్తాయా.. డబ్బు పొదుపు చేయడంలో మల్లర్నీ ఏం చెప్పారు..?




