Kukatpally | కూకట్‌పల్లిలో భారీ దారి దోపిడీ.. కళ్లలో కారం కొట్టి రూ.కోటి ఎత్తుకెళ్లిన దుండగులు
Kukatpally | హైదరాబాద్‌లోని కూకట్‌పల్లిలో (Kukatpally) భారీ దోపిడీ జరిగింది. బైక్‌పై వెళ్తున్న ఇద్దరు వ్యక్తుల కళ్లలో కారం కొట్టిన దుండగులు.. వారి వద్ద ఉన్న రూ.కోటి నగదు ఎత్తుకెళ్లారు (Robbery).
Kukatpally | త్రినేత్ర.న్యూస్: హైదరాబాద్‌లోని కూకట్‌పల్లిలో (Kukatpally) భారీ దోపిడీ జరిగింది. బైక్‌పై వెళ్తున్న ఇద్దరు వ్యక్తుల కళ్లలో కారం కొట్టిన దుండగులు.. వారి వద్ద ఉన్న రూ.కోటి నగదు ఎత్తుకెళ్లారు (Robbery). సోమవారం రాత్రి బహదూర్‌పురాకు చెందిన ఏసీ మెకానిక్‌లు అయిన ఎండీ ఖుస్రు, ఎంజీ అజీముద్దీన్ ద్విచక్ర వాహనంపై డబ్బు తరలిస్తున్నారు. ఈ క్రమంలో కూకట్పల్లి మెట్రో పిల్లర్ నంబర్ 837 వద్దకు చేరుకోగానే రెండు బైకులపై వచ్చిన నలుగురు దుండగులు వారిని అడ్డుకున్నారు. వారి కళ్లలో కారం కొట్టి దాడిచేశారు. అనంతరం వారివద్ద ఉన్న నగదు తీసుకుని అక్కడి నుంచి పరారయ్యారు. ఆ డబ్బును బహదూర్‌పురా నుంచి జీడిమెట్లకు తరలిస్తున్నట్లు తెలుస్తున్నది.
కాగా, ఈ ఘటనపై బాధితులు పోలీసులను ఆశ్రయించారు. నగదును ఎక్కడి నుంచి ఎక్కడికి తీసుకెళ్తున్నారని వారిని ప్రశ్నించగా, వారినుంచి స్పష్టమైన సమాధానం రాకపోవడంతో అది హవాలా సొమ్ముగా పోలీసులు అనుమానిస్తున్నారు. వారిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. కూకట్పల్లి పరిసరాల్లో సీసీ టీవీ ఫుటేజీని జల్లడపట్టారు. ఈ దోపిడీ పథకం ప్రకారమే జరిగిందా? లేదా బాధితుల పాత్ర ఏమైనా ఉందా? అని లోతుగా పోలీసులు ఆరా తీస్తున్నారు.
చిక్కిన ముగ్గురు దుండగులు
దుండగుల కోసం పోలీసులు 4 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో మంగళవారం ఉదయం శంషాబాద్ విమానాశ్రయంలో ముగ్గురు నిందితులను పట్టుకున్నారు. వారంతా ఉత్తరప్రదేశ్‌లోని లక్నో పారిపోతున్నారని తెలిపారు. మరొకరి కోసం గాలిస్తున్నారు.
తాజావార్తలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు





