Weekly Horoscope | ఈవారం రాశి ఫలాలు.. అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలి!
Weekly Horoscope | చాలా మంది జ్యోతిష్యాన్ని విశ్వసిస్తుంటారు. ఈ క్రమంలో ప్రతి రోజు, ప్రతి వారం తమ రాశిఫలాలకు అనుగుణంగా వ్యక్తులు తమ కార్యకలాపాలను కొనసాగిస్తుంటారు. మరి ఈ వారం రాశిఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.
మేషం (Aries)
ఈ వారం మిశ్రమ ఫలితాలు ఉంటాయి. అన్ని విషయాల్లో అప్రమత్తంగా ఉండాలి. ఉద్యోగులు కెరీర్‌కు సంబంధించిన కీలక నిర్ణయాలు తీసుకోకుండా ఉండటం మంచిది. వ్యాపారులు సాధారణం కంటే ఎక్కువగా కష్టపడాల్సి ఉంటుంది. ముఖ్యమైన వ్యవహారాలను సకాలంలో పూర్తిచేస్తారు. కీలక లావాదేవీల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఆత్మీయులతో సంప్రదించాకే ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవడం మంచిది. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. ప్రముఖులు పరిచయమవుతారు. అనారోగ్య సమస్యలు ఇబ్బంది పెడతాయి.
వృషభం (Taurus)
ఈవారం వృషభ రాశి వారికి అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగాలలో అదనపు బాధ్యతలు పెరుగుతాయి. గతంలో చేజారిన అవకాశాలు మళ్లీ పొందే అవకాశం ఉంది. వ్యాపారులు ఆశించిన లక్ష్యాలను చేరుకోవడానికి అధికంగా శ్రమించాల్సి ఉంటుంది. నూతన ఒప్పందాలు చేసుకోవడానికి అనువైన సమయం. పర్యటనలు వాయిదా వేసుకోవడం మంచిది. దీర్ఘకాలిక పెట్టుబడులు లాభదాయకంగా ఉంటాయి. కుటుంబ బాధ్యతలు మరింత పెరుగుతాయి. ఆస్తి వివాదాల పరిష్కారంలో ఆటంకాలు ఉంటాయి. గృహ వాహన యోగాలు అనుకూలంగా ఉన్నాయి. సమాజానికి మేలు చేసే కార్యక్రమాలు చేపడతారు. శుభవార్తలు వింటారు. ఆరోగ్యం సహకరిస్తుంది.
మిథునం (Gemini)
అన్ని రంగాల వారు కొంత జాగ్రత్తగా ఉండాలి. ఉద్యోగులు ప్రతిఅడుగు జాగ్రత్తగా వేయాలి. ఇతరుల వ్యవహారాల్లో జోక్యం తగ్గించుకుంటే మంచిది. వ్యాపారులు తగిన మెళకువలు పాటించాలి. అందివచ్చిన అవకాశాలు సద్వినియోగం చేసుకుంటే లాభాలు పెరుగుతాయి. వ్యవయప్రయాసలు ఉంటాయి. కాబట్టి ఆర్థిక ప్రణాళికలు జాగ్రత్తగా వేసుకోవాలి. కొత్త పెట్టుబడుల విషయంలో ఆచి తూచి నడుచుకోవాలి. నూతన వాహన యోగం ఉంది. సంతానపరంగా ఇబ్బందులు తొలగిపోతాయి. ఆత్మీయుల నుంచి ఆహ్వానాలు అందుతాయి. కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటారు. ఆరోగ్యం బాగుంటుంది. చిరకాల కోరిక నెరవేరడంతో విద్యార్థులు ఉత్సాహంగా గడుపుతారు.
కర్కాటకం (Cancer)
కర్కాటక రాశి వారికి ఈ వారం అనుకూలంగా ఉంటుంది. లక్ష్యాలకు చేరువ అవుతారు. వ్యతిరేకులు కూడా అనుకూలంగా మారుతారు. ఉద్యోగులు పదోన్నతులు పొందుతారు. వివాదాలు నెలకొన్నా పరిష్కరించుకుంటారు. వ్యాపారంలో లాభాలు గణనీయంగా పెరుగుతాయి. పెట్టుబడులు మంచి లాభాలను అందిస్తాయి. అనవసర ఖర్చులు పెరగకుండా జాగ్రత్తగా ఉండాలి. చిన్ననాటి మిత్రులను కలుస్తారు. కొత్త పనులు చేపట్టి విజయం సాధిస్తారు. ఆస్తుల వివాదాలు కాస్త ఉపశమనం కలిగిస్తాయి. కుటుంబ సభ్యులతో అనవసర వాదనలకు దూరంగా ఉంటే మంచిది. విహారయాత్రలకు వెళ్తారు. ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం.
సింహం (Leo)
ఈ వారం అన్ని రంగాల వారు ఆశించిన ఫలితాలు పొందవచ్చు. ఉద్యోగంలో పదోన్నతులు పొందుతారు. నూతన అవకాశాలు అందుకుంటారు. వాయిదా మనస్తత్వం వద్దు. వ్యాపారాలు మరింత లాభసాటిగా ఉంటాయి. రాజకీయవర్గాలు విదేశీ పర్యటనలు ఉండవచ్చు. నూతన ప్రాజెక్టులు లాభదాయకంగా ఉంటాయి. ఆర్థికంగా బలోపేతం అవుతారు. మొదట్లో కుటుంబ సమస్యలు ఎదురై కాస్త చికాకు కలిగస్తాయి. శుభకార్యాలకు సంబంధించిన చర్చలు జరుగుతాయి. బంధువుల నుంచి శుభవార్తలు వింటారు. సమాజంలో మీ కీర్తిప్రతిష్ఠలు పెరుగుతాయి. ఆరోగ్యం బాగుంటుంది. పుణ్యక్షేత్రాలు దర్శిస్తారు. నిరుద్యోగుల కృషి ఫలిస్తుంది.
కన్య (Virgo)
ఈ వారం అన్ని రంగాల వారికి కాలం కలిసివస్తుంది. అన్నింటా విజయాలు సాధిస్తారు. ఉద్యోగంలో సుదీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న సమస్యలు పరిష్కారం అవుతాయి. పదోన్నతులకు అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. వ్యాపారాలు సజావుగా సాగుతాయి. వ్యాపారాభివృద్ధి ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆర్థిక విషయాలు సంతృప్తికరంగా ఉంటాయి. రుణభారం తొలగుతుంది. అందరిలోనూ ప్రత్యేకత నిలుపుకుంటారు. ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు. వాహనాలు, గృహం కొనుగోలు చేస్తారు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. కుటుంబంలో శుభాలు జరుగుతాయి. బంధుమిత్రులతో ఆనందంగా గడుపుతారు. ఆరోగ్యం సహకరిస్తుంది.
తుల (Libra)
ఈవారం అన్ని రంగాల వారికి శుభమే కలుగుతుంది. ఉద్యోగంలో అత్యుత్తమ ఫలితాలు ఉంటాయి. అధికారుల నుంచి మద్దతు, సహోద్యోగుల నుంచి సహకారం లభిస్తుంది. అనుకున్న పనుల్లో ప్రతిబంధకాలు తొలగిపోతాయి. ఆర్థికంగా బలం చేకూరుతుంది. సంపదలు వరిస్తాయి. పెట్టుబడుల విషయంలో దీర్ఘకాలిక ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆప్తుల సలహాలు స్వీకరిస్తారు. జీవిత భాగస్వామి నుంచి ధన, ఆస్తి లాభాలు కలుగుతాయి. కుటుంబ సమస్యలు పరిష్కరించడానికి చిత్తశుద్ధితో ప్రయత్నిస్తే సమస్యలు తొలగుతాయి. శుభకారా్యాలకు డబ్బు ఖర్చు చేస్తారు. సమాజంలో పరపతి పెరుగుతుంది. విద్యావకాశాలు పొందుతారు ఆరోగ్యం బాగుంటుంది.
వృశ్చికం (Scorpio)
ఈ వారం అన్ని రంగాల వారికి కాలం అనుకూలంగా ఉంది. దైవబలం ముందుకు నడిపిస్తుంది. ముఖ్యమైన కార్యక్రమాలను నేర్పుగా పూర్తిచేస్తారు. ఉద్యోగాలతో పురోగతి సాధిస్తారు. ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. వ్యాపారంలో స్వల్ప ఆటంకాలున్నప్పటికీ వాటిని అధిగమిస్తారు. విదేశీ వ్యాపారాలు లాభదాయకంగా ఉంటాయి. ఆర్థిక పరిస్థితి స్థిరంగా ఉంటుంది. అనుకున్న సమయానికి డబ్బు చేతికందుతుంది. ఆస్తి వివాదాల నుంచి బయటపడతారు. స్థిరాస్తి కొనుగోలుకు అనువైన సమయం. ఇంటి నిర్మాణం చేపట్టే అవకాశం ఉంది. నూతన విద్య, ఉద్యోగ అవకాశాలు పొందుతారు. సన్నిహితులతో తీర్థయాత్రలకు వెళ్తారు. ఆరోగ్యం సహకరిస్తుంది.
ధనుస్సు (Sagittarius)
ఈ వారం అన్ని రంగాల వారు మనోబలంతో వ్యవహరించాలి. ఉద్యోగంలో చిన్న చిన్న సమస్యలు వచ్చే అవకాశం. అయినా నిరాశ చెందవద్దు. వ్యాపారంలో లక్ష్యం సిద్ధించేవరకు ప్రయత్నాలు ఆపవద్దు. ఆర్థిక పరిస్థితి సామాన్యంగా ఉంటుంది. ఊహించని ఖర్చులు ఆందోళన కలిగిస్తాయి. కొన్ని వివాదాలను నేర్పుగా పరిష్కరించుకుంటారు. తీర్థయాత్రలు చేస్తారు. ఆస్తుల వ్యవహారంలో ఒప్పందాలు చేసుకుంటారు. వాహనాలు, భూములు కొనుగోలు చేస్తారు. విద్యార్థులు సమయాన్ని వృథా చేయకుండా చదివితే విజయం లభిస్తుంది. అనారోగ్య సమస్యలు ఇబ్బంది పెడతాయి.
మకరం (Capricorn)
ఈ వారం అన్ని రంగాల వారికి అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగంలో చిక్కులను అధిగమిస్తారు. మార్పు కోరుకునేవారు ఈ వారం మంచి అవకాశాలు అందుకుంటారు. కొత్త ప్రయత్నాలు అనుకూలిస్తాయి. వ్యాపారంలో విశేషమైన లాభాలు ఆర్జిస్తారు. మీ కష్టానికి రెట్టింపు ప్రతిఫలాన్ని పొందుతారు. ఆర్థిక ఇబ్బందులు చాలావరకు తీరుతాయి. స్థిరచరాస్తుల విలువలు పెరుగుతాయి. చిత్రమైన సంఘటనలు ఎదురుకావచ్చు. ఆప్తుల నుచి కీలక సమాచారం అందుకుంటారు. కుటుంబంలో శుభప్రదమైన సంఘటనలు జరుగుతాయి. జీవిత భాగస్వామితో మంచి సమయం గడుపుతారు. విద్యార్థుల కల ఫలిస్తుంది. ఆరోగ్యాన్ని అశ్రద్ధ చేయవద్దు.
కుంభం (Aquarius)
కుంభ రాశి వారికి ఈ వారం యోగదాయకంగా ఉంటుంది. ఉద్యోగాలలో కొత్త హోదాలు లభిస్తాయి. కష్టానికి తగిన ప్రతిఫలాన్ని పొందుతారు. అనుకున్న పనులు పూర్తిచేస్తారు. కొన్ని సమస్యలకు మంచి పరిష్కారం లభిస్తుంది. వ్యాపారాలు అనుకూలిస్తాయి. వ్యాపార విస్తరణకు చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆర్థికంగా అంతా మంచే జరుగుతుంది. దీర్ఘకాలిక పెట్టుబడులు ప్రయోజనకరంగా ఉంటాయి. ప్రముఖుల పరిచయాలు సంతోషం కలిగిస్తుంది. కుటుంబంలో సమస్యలను అధిగమిస్తారు. ఆరోగ్య సమస్యలు ఉంటాయి.
మీనం (Pisces)
ఈ వారం అన్ని రంగాల వారికి మిశ్రమ ఫలితాలు ఉంటాయి. అందువల్ల ఏకాగ్రతతో పనిచేయాల్సి ఉంటుంది. ముఖ్యమైన పనులను నిదానంగా పూర్తిచేస్తారు. రుణభారాలు కొంత తగ్గుతాయి. ఉద్యోగంలో ఆశించిన విజయాలు సిద్ధిస్తాయి. వ్యాపారంలో మంచి లాభాలు ఆర్జించే అవకాశం ఉంది. ఖర్చులు పెరగవచ్చు. ఆర్థిక పరమైన లావాదేవీలు జాగ్రత్తగా నిర్వహించాలి. ఆత్మీయులు, బంధువుల నుంచి అందిన సమాచారం ఊరటనిస్తుంది. పాతమిత్రులను కలుస్తారు. ఇంటి నిర్మాణాలకు ప్రణాళికలు వేస్తారు. అధికంగా శ్రమించాల్సి ఉంటుంది. కుటుంబంలో పెద్దల మాటలను గౌరవించడం మంచిది. అనారోగ్య సమస్యలు నిర్లక్ష్యం చేయవద్దు.
తాజావార్తలు
- ●Traffic Restrictions | హైదరాబాద్‌లో బోనాలు.. ఈ రూట్లలో వెళ్లారో ఇక అంతే..!
- ●Horoscope | ఆగస్టు 9 రాశి ఫలాలు.. ఈ రాశివారిని ఆరోగ్య సమస్యలు ఇబ్బంది పెడతాయి!
- ●Theyyullathil Sree Kuttichathan Temple | భక్తుల కోరికలు తీర్చే కేరళ 'కుట్టిచాతన్' స్వామి.. ఇక్కడ దేవుడికి మద్యం, మాంసమే నైవేద్యం!
- ●Rajamahendravaram | ప్రాణం పోతుంటే.. పట్టించుకునేవారేరీ?
- ●KTR Warns CM Revanth Reddy | మా ప్రభుత్వం రాగానే ఆ పాలసీని రద్దు చేస్తాం.. కేటీఆర్ సంచలన ప్రకటన
- ●Preity Mukhundhan | చీరలో బ్లాస్ట్ జోన్ హీరోయిన్ అందాలు అదుర్స్

Traffic Restrictions | హైదరాబాద్‌లో బోనాలు.. ఈ రూట్లలో వెళ్లారో ఇక అంతే..!

Horoscope | ఆగస్టు 9 రాశి ఫలాలు.. ఈ రాశివారిని ఆరోగ్య సమస్యలు ఇబ్బంది పెడతాయి!

Theyyullathil Sree Kuttichathan Temple | భక్తుల కోరికలు తీర్చే కేరళ 'కుట్టిచాతన్' స్వామి.. ఇక్కడ దేవుడికి మద్యం, మాంసమే నైవేద్యం!

Rajamahendravaram | ప్రాణం పోతుంటే.. పట్టించుకునేవారేరీ?





