త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Weekly Horoscope | ఈరాశివారు ఆశించిన ఫ‌లితాలు పొందుతారు.. ఆ ప‌నులకు దూరంగా ఉంటే మంచింది!

Weekly Horoscope | చాలా మంది జ్యోతిష్యాన్ని విశ్వసిస్తుంటారు. ఈ క్ర‌మంలో ప్ర‌తి రోజు, ప్ర‌తి వారం త‌మ రాశిఫ‌లాల‌కు అనుగుణంగా వ్య‌క్తులు త‌మ కార్య‌క‌లాపాల‌ను కొన‌సాగిస్తుంటారు. మ‌రి ఈ వారం రాశిఫ‌లాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.

G

Horoscope | Published On Jul 19, 2026, 8.28 am IST

Weekly Horoscope | ఈరాశివారు ఆశించిన ఫ‌లితాలు పొందుతారు.. ఆ ప‌నులకు దూరంగా ఉంటే మంచింది!
Advertisement

మేషం (Aries)

మేష‌ రాశివారికి ఈ వారం అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగ జీవితంలో ఊహించని కొన్ని శుభపరిణామాలు చోటు చేసుకుంటాయి. వృత్తి, వ్యాపారాలు సానుకూలంగా, సంతృప్తికరంగా సాగిపోతాయి. డ‌బ్బుకు సంబంధించిన వ్య‌వ‌హారాల్లో జాగ్ర‌త్త‌గా ఉండాలి. ముఖ్య‌మైన‌ అవసరాలు తీరిపోవడంతో పాటు ఒకటి రెండు ఆర్థిక సమస్యలు కూడా పరిష్కారమవుతాయి. విదేశాల్లో ఉద్యోగాలు, చదువులకు సంబం ధించి ఆశించిన సమాచారం అందుకుంటారు. పెండ్లి ప్రయత్నాలు చాలావరకు సఫలం అవుతాయి. మీ వ్య‌క్తిగ‌త విష‌యాల్లో ఇత‌రులు జోక్యం చేసుకోకుండా చూసుకోండి. ప్రయాణాల్లో కొద్దిగా జాగ్రత్తగా ఉండడం మంచిది. ఆరోగ్యం విష‌యంలో జాగ్ర‌త్త‌లు తీసుకోవాలి. ప్రేమ వ్యవహారాల్లో సాన్నిహిత్యం పెరుగుతుంది.

వృషభం (Taurus)

ఈవారం మిశ్ర‌మ ఫ‌లితాలు ఉంటాయి. వృత్తి, ఉద్యోగాల్లో బరువు బాధ్యతలు పెరుగుతాయి. ప్రారంభించిన ప‌నుల‌న్నీ విజ‌య‌వంతంగా పూర్తిచేస్తారు. వ్యాపారాలు లాభసాటిగా సాగిపోతాయి. ఉద్యోగం మారడానికి సమయం అనుకూలంగా ఉంది. వ్యాపారంలో ఆశించిన ఫ‌లితాలు పొందుతారు. కష్టార్జితాన్ని జాగ్రత్తగా ఖర్చు చేయడం మంచిది. వృథా ఖర్చులతో ఇబ్బంది పడతారు. అందువ‌ల్ల ఆర్థిక లావాదేవీలు జాగ్ర‌త్త‌గా నిర్వ‌హించాలి. నిరుద్యోగులకు దూర ప్రాంతంలో ఉద్యోగం లభించే అవకాశం ఉంది. కుటుంబ జీవితం ఉత్సాహంగా, ఉల్లాసంగా సాగిపోతుంది. వ్యక్తిగత సమస్యలు పరిష్కారమవుతాయి. ఎదురు చూస్తున్న శుభవార్తలు వింటారు. ధనపరంగా ఎవరికీ వాగ్దానాలు చేయకపోవడం మంచిది. ఆరోగ్యం బాగానే ఉంటుంది. విద్యార్థులు చ‌దువులో ఏకాగ్ర‌త పెంచాలి.

మిథునం (Gemini)

అన్ని రంగాల వారు ఈ వారం శ్ర‌మించక త‌ప్ప‌దు. వృత్తి, ఉద్యోగాల్లో అధికారులు మీ పనితీరుతో సంతృప్తి చెందుతారు. ఆకస్మిక ధన లాభం ఉంటుంది. వ్యాపారంలో ఎన్ని ఆటంకాలు వ‌చ్చినా వెన‌క‌డుగు వేయొద్దు. షేర్లు, స్పెక్యులే షన్లు, ఇతర ఆర్థిక లావాదేవీలు అత్యధికంగా లాభాలనిస్తాయి. కొన్ని ముఖ్యమైన వ్యవహారాలను సంతృప్తికరంగా పూర్తి చేస్తారు. నష్టదాయక వ్యవహారాలకు దూరంగా ఉండడం మంచిది. ఆర్థిక సంబంధమైన బాధ్యతలను ఎవరికీ అప్పగించవద్దు. ఖ‌ర్చుల విష‌యంలో ప్ర‌ణాళికాబ‌ద్ధంగా వ్య‌వ‌హ‌రించాలి. ఆహార, విహారాల్లో జాగ్రత్తగా ఉండాలి. కుటుంబ జీవితం సామరస్యంగా ప్రశాంతంగా సాగిపోతుంది. ప్రేమ వ్యవహారాల్లో కొద్దిగా అపార్థాలు తలెత్తే అవకాశం ఉంది.

కర్కాటకం (Cancer)

ఈవారం అన్ని రంగాల వారికి అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగంలో స్థిరత్వం లభించే అవకాశం ఉంది. వృత్తి, ఉద్యోగాలు సానుకూలంగా సాగిపోతాయి. అధికారుల నుంచి ఆశించిన ప్రోత్సాహకాలు అందుతాయి. అధికారులు మీ శ్ర‌మ‌ను గుర్తిస్తారు. వ్యాపారాల్లో లాభాలకు కొరత ఉండదు. ఆర్థిక పరిస్థితిలో మెరుగుద‌ల ఉంటుంది. ఆదాయం కొద్దిగా వృద్ధి చెందే అవకాశం ఉంది. ఖ‌ర్చులు పెర‌గ‌కుండా చూసుకోవాలి. బంధువుల రాకపోకలుంటాయి. ఒక శుభ‌వార్త మీ ఇంట ఆనందాన్ని నింపుతుంది. కొత్త కార్యక్రమాలు, కొత్త ప్రయత్నా లకు అవకాశం ఉంది. కుటుంబంలో సుఖ సంతోషాలు వెల్లి విరుస్తాయి. ఆహార, విహారాల్లో జాగ్రత్తగా ఉండడం మంచిది.

సింహం (Leo)

అన్ని రంగాల వారికి శుభకాలం కొన‌సాగుతుంది. వృత్తి, ఉద్యోగాల్లో అధికారులు మీ పనితీరుతో సంతృప్తి చెందుతారు. వ్యాపారాలలో లాభాలు పెరుగుతాయి. డ‌బ్బు ఖ‌ర్చు చేసే ముందు ఒకటికి రెండుసార్లు ఆలోచించుకోవడం మంచిది. కొద్దిపాటి వ్యయ ప్రయాసలతో ముఖ్యమైన వ్యవహారాలు సకాలంలో పూర్తవుతాయి. కుటుంబ బాధ్య‌త‌లు పెరిగిన‌ప్ప‌టికీ జీవిత భాగ‌స్వామి స‌హ‌కారంతో నెగ్గుకొస్తారు. ఆదాయ వృద్ధికి చేసే ప్రయత్నాలకు సానుకూల స్పందన లభిస్తుంది. నిరుద్యోగులకు విదేశాల నుంచి ఆశించిన సమాచారం అందుతుంది. ప్రయాణాల్లో జాగ్రత్తలు పాటించడం మంచిది.

కన్య (Virgo)

క‌న్యా రాశివారికి ఈ వారం ఫ‌ల‌వంతంగా ఉంటుంది. ఉద్యోగంలో ఆదరాభిమానాలు పెరుగుతాయి. అధికారులు ప్రత్యేక బాధ్యతలను అప్పగిస్తారు. గ‌తంలో ఆగిపోయిన ప‌నులు తిరిగి ప్రారంభిస్తారు. వృత్తి, వ్యాపారాల్లో మీ నిర్ణయాలు, మీ ఆలోచనలు ఆశించిన ఫలితాలనిస్తాయి. పెట్టుబ‌డులు, లాభాల రూపంలో ఆదాయం పెరిగే అవకాశం ఉంది. పెండ్లి ప్రయత్నాలు సత్ఫలితాలనిస్తాయి. ఉద్యోగం మారడానికి సమయం అనుకూలంగా ఉంది. అన‌వ‌స‌ర ఖ‌ర్చులు త‌గ్గించుకుంటే మంచిది. ఆరోగ్యం బాగానే ఉంటుంది. విద్యార్థులు కొద్ది శ్రమతో ఉత్తమ ఫలితాలు సాధిస్తారు.

తుల (Libra)

అన్ని రంగాల వారు ప‌ట్టుద‌ల‌తో ప‌నిచేయాల్సి ఉంటుంది. ఉద్యోగంలో కొన్ని ఆటంకాలు ఎదురైనా శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. వ్యాపారాల్లో లాభాలు నిలకడగా పురోగమిస్తాయి. శుభ వార్తలు వింటారు. కుటుంబంలో క‌ల‌హాపూరిత వాతావ‌ర‌ణం నెల‌కొంటుంది. బంధు మిత్రులతో ఒక శుభ కార్యంలో పాల్గొంటారు. ఆర్థిక సమస్యలు చాలావరకు తగ్గుతాయి. శుభకార్యాలు, దైవకార్యాల్లో పాల్గొంటారు. ఆరోగ్యం కొద్దిగా ఇబ్బంది పెడుతుంది. అయితే దీర్ఘకాలిక అనారోగ్యం నుంచి కూడా ఉపశమనం లభిస్తుంది.

వృశ్చికం (Scorpio)

అన్నిరంగాల వారికి విజ‌యావ‌కాశాలు పెరుగుతాయి. ఉద్యోగ జీవితం సాఫీగా సాగిపోతుంది. వృత్తి, వ్యాపారాల్లో ఆర్థిక లావాదేవీల విషయంలో కాస్తంత జాగ్రత్తగా ఉండడం మంచిది. భాగ‌స్వామ్య వ్యాపారాల్లో ఏక‌ప‌క్ష నిర్ణ‌యాల‌తో న‌ష్టం వాటిల్లవ‌చ్చు. స‌మిష్టి నిర్ణ‌యాల‌కు ప్రాధాన్యం ఇవ్వాలి. ప్రణాళికతో ఒకటి రెండు ఆర్థిక సమస్యలు, వ్యక్తిగత సమస్యలు పరిష్కారం అవుతాయి. ఖ‌ర్చుల విష‌యంలో ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం మంచిది. కొత్త ప్రయత్నాలకు, కార్య క్రమాలకు సమయం అనుకూలంగా ఉంది. కుటుంబ జీవితం ప్రశాంతంగా సాగిపోతుంది. ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది.

ధనుస్సు (Sagittarius)

ఈ రాశివారికి వారం మొత్తం అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగ జీవితంలో పనిభారం ఎక్కువగా ఉన్నప్పటికీ, ప్రతిఫలానికి లోటుండదు. వ్యాపారం లాభాలు పొందుతారు. అనుకున్న పనులు విజ‌య‌వంతంగా పూర్తవ‌డంతో ఆర్థిక లాభాలు కలుగుతాయి. ఆదాయ మార్గాలు పెరిగే అవకాశం ఉంది. ఆర్థిక స్థిరత్వం ఏర్పడుతుంది. ఒకటి రెండు వ్యక్తిగత సమస్యలను పరిష్కరించుకుంటారు. ఆరోగ్యానికి లోటుండదు. ప్రేమ వ్యవహారాల్లో అనుకూలత ఉంటుంది. విద్యార్థులు బాగా పురోగతి సాధిస్తారు. ముఖ్యమైన కార్యకలాపాలను విజయవంతంగా పూర్తి చేస్తారు. అనారోగ్య స‌మ‌స్య‌ల నుంచి ఉప‌శ‌మ‌నం ల‌భిస్తుంది.

మకరం (Capricorn)

అన్నిరంగాల వారు వృత్తిప‌రంగా నూత‌న అవ‌కాశాలు అందుకుంటారు. ఉద్యోగంలో పని ఒత్తిడి నుంచి ఉపశమనం లభిస్తుంది, ప‌దోన్న‌తులు అందుకుంటారు. వ్యాపారాలు లాభాల బాట పడతాయి. శ్ర‌మ‌కు త‌గిన‌విధంగా ఆదాయం పెరుగుతుంది. కుటుంబ ఖర్చులు కొద్దిగా పెరిగే అవకాశం ఉంది. స్థిరాస్తుల కొనుగోలుకు ఇది అనుకూల స‌మ‌యం. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. ఖ‌ర్చులు ఎక్కువగా చేస్తారు. ఆర్థిక వ్యవహారాల్లో సొంత నిర్ణయాలు తీసుకోవ‌డం మంచిది. ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది. ప్రయాణాల్లో జాగ్రత్తలు పాటించాలి. ప్రేమ వ్యవహారాలు సానుకూలంగా సాగిపోతాయి.

కుంభం (Aquarius)

ఉద్యోగంలో పనిభారం పెర‌గ‌డంతోపాటు ఉన్న‌త స్థానం ల‌భిస్తుంది. వృత్తి జీవితం సాదా సీదాగా సాగిపోతుంది. వ్యాపారాల్లో లాభాలు ఉంటాయి. పెట్టుబ‌డుల విష‌యంలో జాగ్ర‌త్త‌గా ఉండాలి. కుటుంబ బాధ్యతలు కూడా పెరుగుతాయి. కుటుంబంలో స‌మ‌స్య‌లు రాకుండా కోపాన్ని త‌గ్గించుకోవాలి. ఆరోగ్యం మీద శ్రద్ద పెట్టడం మంచిది. ఆస్తి వివాదాల విషయంలో ఆశించిన శుభవార్త వింటారు. ఆదాయ సంబంధమైన ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆర్థిక లావాదేవీల‌కు దూరంగా ఉండాలి. అనవసర ఖర్చులు తగ్గించుకోవాలి. పిల్లల వల్ల కుటుంబంలో చికాకులు తలెత్తే అవకాశం ఉంది. ఆరోగ్యం బాగానే ఉంటుంది. విద్యార్థులు చ‌దువు ప‌ట్ల మ‌రింత ఏకాగ్ర‌త పెట్టాలి.

మీనం (Pisces)

అన్నిరంగాల వారికి ఈ వారం అనుకూలంగా ఉంటుంది. వృత్తి, ఉద్యోగాల్లో ఒకటి రెండు శుభవార్తలు వింటారు. ఆదాయం పెరుగుతుంది. రావలసిన సొమ్ము కూడా చేతికి అందుతుంది. వ్యాపారంలో నూత‌న అవ‌కాశాలు ఎదుర‌వుతాయి. మీరు ఏ ప్రయత్నం తలపెట్టినా విజయవంతమవుతుంది. ఆదాయం నిలకడగా ఉంటుంది. ముఖ్య‌మైన ప‌నుల్లో ఆత్మీయుల స‌ల‌మాలు పాటించ‌డం మంచింది. ఊహించ‌ని లాభాలు క‌లుగుతాయి. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. కుటుంబ జీవితం సంతోషంగా సాగుతుంది. విద్యార్థులు కొద్దిపాటి శ్రమతో ఉత్తమ ఫలితాలు సాధిస్తారు. ప్రేమ వ్యవహారాలు హ్యాపీగా, సాఫీగా సాగిపోతాయి.

Advertisement
Advertisement