Maha Shivratri 2026 | మహాశివరాత్రి రోజున శుక్రాధిత్య యోగం.. మహాదేవుడి అనుగ్రహంతో ఈ మూడు రాశుల వారి కష్టాలు తీరినట్టే..!
Maha Shivratri 2026 | ఫాల్గుణ మాసం కృష్ణపక్షం చతుర్దశి తిథి రోజున మహాశివరాతి పండుగను జరుపుకోవడం ఆనవాయితీగా వస్తున్నది. శివరాత్రి రోజున పార్వతీ పరమేశ్వరులను పూజిస్తారు. ఈ శుభదినాన రుద్రాభిషేకం చేయడం వల్ల జీవితంలోని అన్ని దుఃఖాలు తొలగిపోయి, ఆ దేవదేవుడి అనుగ్రహం లభిస్తుంది. ఈ సంవత్సరం మహాశివరాత్రి జ్యోతిషశాస్త్రం పరంగా కీలకం కాబోతోంది. ఈ ఏడాది మహాశివరాత్రి ఫిబ్రవరి 15న జరుపుకోనున్నాం. అదృష్టానికి కారకుడైన శుక్రుడు, గ్రహాలకు అధిపతి అయిన సూర్యుడు కుంభరాశిలో సంచరిస్తారు. ఈ రెండు గ్రహాల కలయికతో శుక్రాధిత్య యోగం ఏర్పడనున్నది. మహాశివరాత్రి పర్వదినాన శుక్రాధిత్య యోగం ఏర్పడనుండడం అరుదు. ఈ యోగం కారణంగా పలు రాశులవారికి ఎంతో ప్రయోజనం ఉంటుంది. పరమేశ్వరుడి ఆశీస్సులు లభించనున్నాయి. శంకరుడి అనుగ్రహం పొందనున్న అదృష్ట జాతకులెవరో తెలుసుకుందాం..!
మేష రాశి
మేష రాశి వారికి ఈ సమయం ఎంతో ప్రత్యేకంగా నిలుస్తుంది. కీలక పనిలో విజయం సాధిస్తారు. మీ గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ఆర్థిక పరిస్థితి మెరుగవుతుంది. ప్రేమ సంబంధాల్లో అనుకూల పరిస్థితులు ఉంటాయి. ఈ సమయంలో మీ పూర్తి దృష్టి కెరీర్, వ్యాపారంలో కేంద్రీకరించి విజయవంతంగా ముందుకెళ్తారు. కొత్త ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న వారి కోరిక నెరవేరుతుంది. కటుంబంలో శుభకార్యం జరిగే ఛాన్స్ ఉంది.
కన్యారాశి
కన్యారాశి వారి కోరికలన్నీ నెరవేరుతాయి. విద్యార్థులు పరీక్షలు, పోటీ పరీక్షల్లో విజయం సాధిస్తారు. భూమి, భవనం, వాహనం యోగం ఉన్నది. పిల్లలకు సంబంధించిన విషయంలో సంతోషంగా ఉంటారు. వ్యాపార సంబంధిత వ్యవహారాల్లో సుదూర ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. ఈ ప్రయాణంతో మీకు అంతా మేలు జరుగుతుంది. వ్యాపారంలో పురోగతి, లాభం ఉంటుంది. శుక్రాధిత్య యోగం కారణంగా ఈ సమయం మీకు అనుకూలంగా ఉంటుంది.
కుంభ రాశి
మార్కెట్‌లో వృద్ధిని విజయవంతంగా సద్వినియోగం చేసుకుంటారు. కొత్ తపనులు చేపడుతారు. వ్యాపారంలో ఉన్న వారికి ఈ సమయంలో ఎంతో అనుకూలంగా ఉంటుంది. విద్యార్థులు పూర్తి ఏకాగ్రతతో చదువుతారు. మీ జీవిత భాగస్వామితో కలిసి ప్రయాణం చేయాల్సి వస్తుంది. మీరు మీ కెరీర్, వ్యాపారాన్ని మరింత మెరుగ్గా తీర్చిదిద్దుకునేందుకు ప్రయత్నిస్తారు. సూర్యుడు, శుక్రుడి అనుగ్రహంతో మీకు అంతా కలిసి వస్తుంది.
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్






