Maha Shivratri 2026 | మహాశివరాత్రి నుంచి మూడుగ్రహాల్లో మార్పు.. ఏడురాశుల వారు ధనవంతులయ్యే ఛాన్స్..!
Maha Shivratri 2026 | నేటి మహాశివరాత్రి పర్వదినం జ్యోతిషశాస్త్రపరంగా కీలకం కాబోతున్నది. ద్రిక్ పంచాంగం ప్రకారం.. ఈ సంవత్సం మహాశివరాత్రి ప్రత్యేకంగా నిలువనున్నది. పండుగ రోజున మూడు ప్రధాన గ్రహాలు స్థానాలు మార్చుకోనున్నాయి.
Maha Shivratri 2026 | నేటి మహాశివరాత్రి పర్వదినం జ్యోతిషశాస్త్రపరంగా కీలకం కాబోతున్నది. ద్రిక్ పంచాంగం ప్రకారం.. ఈ సంవత్సం మహాశివరాత్రి ప్రత్యేకంగా నిలువనున్నది. పండుగ రోజున మూడు ప్రధాన గ్రహాలు స్థానాలు మార్చుకోనున్నాయి. కుజుడు శ్రావణ నక్షత్రం నుంచి ధనిష్ఠ నక్షత్రంలోకి, చంద్రుడు శని రాశి మకర రాశిలోకి, బుధుడు శతభిష నక్షత్రం నుంచి పూర్వాభాద్ర నక్షత్రంలో సంచరించనున్నాడు. బుధుడు తన దిశను దక్షిణం నుంచి ఉత్తరం వైపునకు దిశను మార్చుకోనున్నాడు. ఇది జ్యోతిషశాస్త్రంలో అత్యంత శుభప్రదంగా పరిగణిస్తారు. ఈ గ్రహ సంచారం అన్ని రాశిచక్ర గుర్తులను ప్రభావితం చేస్తుంది. కానీ, ఏడు రాశిచక్ర గుర్తులకు ప్రత్యేకంగా ఫలవంతంగా ఉంటుంది. ఆయారాశుల వారిపై శివుడి ప్రత్యేక ఆశీస్సులు ఈ రాశులపై ఉంటాయి. వారి జీవితాల్లో సంపద, విజయం, శ్రేయస్సు కోసం కొత్త అవకాశాలు కల్పించనున్నది.
మేష రాశి
ఈ సమయం మేష రాశి వారికి కొత్త శక్తి, సానుకూల అవకాశాలుంటాయి. కెరీర్, వ్యాపారంలో ఆకస్మిక లాభాలు వచ్చే అవకాశం ఉంటుంది. ఈ సమయంలో చాలాకాలంగా పెండింగ్‌లో ఉన్న పనులు పూర్తవుతాయి. ఇంట్లో శాంతి, ప్రశాంతత ఉంటుంది. కుటుంబ వాతావరణం ఆనందంగా ఉంటుంది. ఆర్థికంగా బలంగా ఉంటారు. మీ కృషికి తగ్గ ఫలితం ఉంటుంది. ఆరోగ్యం సాధారణంగా ఉంటుంది. కానీ, దీర్ఘకాల పనిభారం, ఒత్తిడిని నివారించడానికి కొంత విశ్రాంతి అవసరం. భవిష్యత్తులో లాభాల కోసం అవకాశాలను వచ్చేందుకు ఈ సమయంలో ఏదైనా కొత్త పెట్టుబడి, ఆర్థిక నిర్ణయాలతో లాభదాయకంగా ఉంటుంది.
మిథున రాశి
ఈ సమయం మిథున రాశి వారికి మార్పులుంటాయి. అలాగే, విజయాన్ని తీసుకువస్తుంది. మీ ఉద్యోగం, కెరీర్‌లో మార్పు ప్రయోజనకరంగా ఉంటుంది. విద్యలో ప్రయత్నాలు విజయవంతమవుతాయి. ఆశించిన ఫలితాలను ఇస్తాయి. మీ కుటుంబంలో ప్రేమ, మద్దతు ప్రబలంగా ఉంటాయి. మానసిక ఒత్తిడి తగ్గుతుంది. మీరు మరింత నమ్మకంగా ఉంటారు. ఈ సమయంలో కొత్త నైపుణ్యాలను నేర్చుకోవడం, శిక్షణలో పాల్గొనడం మీ భవిష్యత్తుకు ప్రయోజనకరంగా ఉంటుంది.
కర్కాటక రాశి
ఈ సమయం కర్కాటక రాశి వారికి చాలా శుభప్రదంగా ఉంటుంది. గృహ విషయాలలో కోరుకున్న విజయం సాధిస్తారు. తల్లిదండ్రులు, పెద్దల ఆశీస్సులు మీకు లభిస్తాయి. ఆర్థిక పరిస్థితి బలపడుతుంది. ఆర్థిక ఒత్తిళ్లు తొలగిపోతాయి. ప్రయాణాలకు ఇది అనుకూలమైన సమయం. ఆరోగ్యం సాధారణంగా ఉంటుంది. కానీ, అప్పుడప్పుడు విశ్రాంతి అవసరం. కుటుంబంతో ఎక్కువ సమయం గడపడంతో మానసిక ప్రశాంతత, ఆనందం పెరుగుతుంది.
సింహ రాశి
సింహ రాశి వారికి ఈ సమయంలో వృత్తి లాభాలుంటాయి. సామాజికంగా ప్రతిష్ట పెరుగుతుంది. పాత పెట్టుబడులు, ఆస్తి సానుకూల ఫలితాలను ఇచ్చే అవకాశం ఉంది. విద్య, పిల్లల సంబంధిత విషయాల్లో సానుకూల ఫలితాలుంటాయి. స్నేహితులు, కుటుంబ సభ్యుల నుంచి మీకు సంపూర్ణంగా మద్దతు సహాయపడుతుంది. ఈ సమయం మీకు అనుకూలంగా ఉంటుంది. వ్యాపారం, ఉద్యోగంలో కొత్తగా వచ్చే అవకాశాలపై దృష్టి పెట్టాలి.
తులరాశి
ఈ సమయం తుల రాశి వారికి కొత్త అవకాశాలు రావడంతో పాటు ఆనందం వెల్లివిరుస్తుంది. మీ జీవిత భాగస్వామి, కుటుంబంతో సంబంధాలు బలంగా ఉంటాయి. వ్యాపారం, వృత్తి జీవితంలో కొత్త ప్రణాళికలు విజయవంతమవుతాయి. ఆరోగ్యం సాధారణంగా ఉంటుంది. మానసిక సమతుల్యత ఉంటుంది. ఈ సమయం ప్రయాణం అభిరుచులకు అనుకూలంగా ఉంటుంది. మీ లక్ష్యాలపై దృష్టి ఎట్టి.. వారికి ప్రాధాన్యత ఇవ్వడం ద్వారా మీకు ప్రయోజనకరంగా ఉంటుంది.
మకరరాశి..
ఈ కాలం మకర రాశి వారికి మానసికంగా పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. ఆర్థికంగా బలంగా ఉంటారు. పాత వివాదాలు పరిష్కారమవుతాయి. కుటుంబంలో శాంతి, ఆనందంగా ఉంటారు. ఆర్థిక లాభం కోసం కొత్త అవకాశాలు వస్తాయి. కొత్త వ్యాపారాలను ప్రారంభించడానికి ఇది అనుకూలమైన సమయం. స్నేహితులు, సామాజిక పరిచయాలు పెరుగుతాయి. ఈ సమయంలో మీ ఆలోచనలు, ప్రణాళికలను రాసి వాటిని అమలు చేయడం చాలా ప్రయోజనకరంగా ఉంటుంది.
సంబంధిత వార్తలు

Stock Markets | ఆరంభంలో లాభాలు.. ముగింపులో నష్టాలు.. స్టాక్ మార్కెట్లలో తీవ్ర అస్థిరత..
మే 21, 2026

Gold And Silver Prices Today | స్వల్పంగా పెరిగిన బంగారం, వెండి ధరలు.. సేఫ్ హావెన్ ఆస్తులపై తగ్గుతున్న ఆసక్తి..
మే 21, 2026

Stock Markets | స్టాక్ మార్కెట్లలో జోష్.. లాభాల్లో ట్రేడవుతున్న సూచీలు..
మే 21, 2026
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్



