త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Gajalakshmi Rajyogam | గురు, శుక్రగ్రహాల సంచారంతో అరుదైన గజలక్ష్మి రాజయోగం.. మారనున్న ఈ నాలుగురాశుల అదృష్టం..!

Gajalakshmi Rajyogam | జ్యోతిషశాస్త్రం ప్రకారం ఈ ఏడాది మే నెల విశేషంగా నిలువనుంది. ఎందుకంటే ఈ సమయంలో అత్యంత శక్తివంతమైన, శుభ్రపద్రమైన గ్రహ సంయోగం జరుగుబోతోంది. మే 14న శుక్రగ్రహం మిథునరాశిలోకి ప్రవేశించనుంది. అప్పటికే అదే రాశిలో గురుగ్రహం సంచరిస్తూ ఉంటుంది.

P

Horoscope | Published On Apr 29, 2026, 6.32 am IST

Gajalakshmi Rajyogam | గురు, శుక్రగ్రహాల సంచారంతో అరుదైన గజలక్ష్మి రాజయోగం.. మారనున్న ఈ నాలుగురాశుల అదృష్టం..!
Advertisement

Gajalakshmi Rajyogam | జ్యోతిషశాస్త్రం ప్రకారం ఈ ఏడాది మే నెల విశేషంగా నిలువనుంది. ఎందుకంటే ఈ సమయంలో అత్యంత శక్తివంతమైన, శుభ్రపద్రమైన గ్రహ సంయోగం జరుగుబోతోంది. మే 14న శుక్రగ్రహం మిథునరాశిలోకి ప్రవేశించనుంది. అప్పటికే అదే రాశిలో గురుగ్రహం సంచరిస్తూ ఉంటుంది. ఈ రెండుగ్రహాల సంయోగంతో గజలక్ష్మి రాజయోగం ఏర్పడుతుంది. జూన్‌ 2 వరకు ఈ యోగం ప్రభావం ఉంటుంది. ఈ అరుదైన యోగం ప్రభావం పలురాశుల వారి జీవితాల్లో గణనీయమైన మార్పులు తీసుకువస్తుంది. వ్యత్తిపరమైన పురోగతి, ఆర్థిక పురోగతి, సామాజిక గౌరవం పెరుగుతుంది. సంబంధాల్లో ప్రేమ, సామరస్యం వెల్లివిరుస్తుంది. నాలుగు రాశుల వారికి ఈ గ్రహాల సంయోగంతో అదృష్టం వరించే అవకాశం ఉంది. ఆయా రాశులవారి జీవితాల్లో విజయం, శ్రేయస్సు వైపు కొత్త మార్గాలు తెరుచుకునే అవకాశం ఉంది.

వృషభ రాశి

గజలక్ష్మి రాజయోగం ప్రభావంతో వృషభ రాశి వారి ఆర్థిక పరిస్థితిలో స్పష్టమైన మెరుగుదల కనిపిస్తుంది. ఈ సమయంలో వృత్తిలో పురోగతి సాధించడానికి, ఉద్యోగంలో పదోన్నతి పొందడానికి బలమైన అవకాశాలు ఉన్నాయి. వ్యాపారస్తులకు కొత్త ఒప్పందాలు లభించే అవకాశం ఉంది. దాంతో వారి లాభాలు పెరుగుతాయి. పెళ్లి కాని వారికి వివాహ సంబంధాలు ముందుకు వచ్చే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఈ కాలంలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. వ్యక్తిత్వంలో సానుకూల మార్పులు కనిపిస్తాయి.

తుల రాశి

తుల రాశి వారికి ఈ సమయం ఆర్థికంగా ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. ఆదాయానికి కొత్త వనరులు ఏర్పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆర్థిక లాభాల కోసం లభించే అవకాశాలు పెరుగుతాయి. మీరు కూడబెట్టిన సంపదను సరైన దిశలో వినియోగించుకోవడానికి, పెట్టుబడి పెట్టడానికి మంచి అవకాశాలు లభించే ఛాన్స్‌ ఉంది. వైవాహిక జీవితంలో పరస్పర అవగాహన, సంతోషం, శాంతి పెరుగుతాయి. పని ప్రదేశంలో విజయంతో పాటు సోషల్‌ స్టేటస్‌ పెరిగే అవకాశాలు కూడా ఉన్నాయి.

ధనుస్సు రాశి

ధనుస్సు రాశి వారికి ఈ రాజయోగం అదృష్టం, పురోగతి వైపు కొత్త ద్వారాలను తెరుచుకుంటాయి. ఈ సమయంలో మీరు కొత్త ఇల్లు, వాహనాన్ని కొనుగోలు చేసే అవకాశాలు లభించవచ్చు. వ్యాపారస్తులకు ఈ సమయం ఎంతో లాభదాయకంగా ఉంటుంది. వారంతా మంచి లాభాలను ఆర్జించగలిగే ఛాన్స్‌ ఉంది. ఆర్థిక పరిస్థితి గతంలో కంటే మరింత బలంగా మారే అవకాశం ఉంది. మీ కుటుంబంతో కలిసి ప్రయాణించే, శుభకార్యాల్లో పాల్గొనే అవకాశాలు ఉన్నాయి. దాంతో మీ మనస్సు ప్రశాంతంగా, సంతోషంగా ఉంటుంది.

మీన రాశి

మీన రాశి వారి జీవితాల్లో ఈ సమయంలో శ్రేయస్సు, సంతోషం పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి. ప్రేమ సంబంధాలు మెరుగుపడతాయి. బంధాల్లో స్థిరత్వం ఏర్పడుతుంది. కుటుంబ జీవితంలో సంతోషం, సామరస్యంతో కూడిన వాతావరణం నెలకొంటుంది. దీర్ఘకాలంగా వేధిస్తున్న సమస్యలు పరిష్కారమయ్యే అవకాశం ఉంది. దాంతో మీకు మానసిక ఉపశమనం లభిస్తుంది. మీ కుటుంబంతో కలిసి మంచి, చిరస్మరణీయమైన క్షణాలను గడిపే అవకాశాలు లభించే ఛాన్స్‌ ఉంది.

Advertisement
Advertisement