Venus Transit | రోహిణి నక్షత్రంలో శుక్రుడు.. ఈ మూడురాశుల వారికి అన్నీ శుభాలే..!
Venus Transit | శుక్రుడు తన సొంత రాశి అయిన వృషభ రాశిలో సంచరిస్తున్నాడు. సొంత రాశిలో సంచారం సమయంలో శుక్రుడి ప్రభావం మరింత ఎక్కువగా ఉంటుందని జ్యోతిషశాస్త్రం పేర్కొంటున్నది. ఇదే సమయంలో శుక్రుడు త్వరలోనే తన రాశిని మార్చుకోనున్నాడు.
Venus Transit | శుక్రుడు తన సొంత రాశి అయిన వృషభ రాశిలో సంచరిస్తున్నాడు. సొంత రాశిలో సంచారం సమయంలో శుక్రుడి ప్రభావం మరింత ఎక్కువగా ఉంటుందని జ్యోతిషశాస్త్రం పేర్కొంటున్నది. ఇదే సమయంలో శుక్రుడు త్వరలోనే తన రాశిని మార్చుకోనున్నాడు. సోమవారం (ఏప్రిల్ 27న) రోహిణి నక్షత్రంలోకి ప్రవేశించనున్నాడు. రోహిణి నక్షత్రం ప్రేమ, అందం, సృజనాత్మకతకు ప్రతీకగా భావిస్తారు. ఈ నక్షత్రానికి అధిపతి చంద్రుడు. శుక్రుడు ప్రేమ, సౌఖ్యం, ఐశ్వర్యం, శుభఫలితాలకు కారకుడు. ఈ నక్షత్ర మార్పు కొంతమంది రాశుల వారికి విశేష ఫలితాలను అందించే అవకాశం ఉందని జ్యోతిష్యులు సూచిస్తున్నారు. కళల్లో నైపుణ్యం పెరగడం, ఆకర్షణీయత పెరగడం, ఆర్థిక లాభాలుంటాయని పండితులు పేర్కొంటున్నారు.
మేష రాశి
శుక్రుడి ఈ నక్షత్ర మార్పు కారణంగా మేష రాశి వారికి అనుకూల ఫలితాలుంటాయి. ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తున్న వారికి కొత్త అవకాశాలు లభించే సూచనలు ఉన్నాయి. ఉద్యోగంలో మీ కృషికి తగ్గ గుర్తింపు లభిస్తుంది. నాయకత్వ బాధ్యతలు చేపట్టే అవకాశాలు ఉన్నాయి. ఉన్నతాధికారుల నుంచి మద్దతు లభిస్తుంది. వ్యాపార రంగంలో ఉన్నవారికి విస్తరణతో పాటు లాభాలు చేకూరే అవకాశం ఉంది.
వృషభ రాశి
శుక్రుడి సంచారం వృషభ రాశి వారికి ప్రత్యేకంగా అనుకూలంగా ఉంటుంది. కొత్త పరిచయాలు ఏర్పడే అవకాశాలు ఉన్నాయి. కొత్త వ్యాపారాలను ప్రారంభించేందుకు ఇది సరైన సమయం. చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్న పనులు పూర్తవుతాయి. ఆరోగ్య సమస్యలు తగ్గుముఖం పడతాయి. ఆత్మవిశ్వాసం పెరిగి లక్ష్య సాధనలో ముందడుగు వేస్తారు. మీ ప్రతిభకు గుర్తింపు లభించే అవకాశాలు గోచరిస్తున్నాయి.
కర్కాటక రాశి
శుక్రడి సంచారం కారణంగా విజయానికి కొత్త మార్గాలను తెరుస్తుంది. ప్రభుత్వ సంబంధిత విషయాల్లో అనుకూల ఫలితాలు పొందే అవకాశాలున్నాయి. శుక్రుడి ప్రభావంతో మీ ప్రతిష్ట, ప్రభావం పెరుగుతుంది. సంబంధాలు మెరుగవుతాయి. విద్యార్థులు పరీక్షల్లో మంచి ఫలితాలు సాధించే సూచనలు ఉన్నాయి. మీ సోషల్ స్టేటస్ పెరుగుతుంది. మీ మాటకు విలువ పెరుగుతుంది. పిల్లల సాధించే విజయాలతో తల్లిదండ్రులకు ఆనందాన్ని ఇస్తుంది.
ట్యాగ్స్:
తాజావార్తలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు






