త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Guru Margi 2026 | త్వ‌ర‌లో ప్ర‌త్య‌క్షంలోకి దేవగురువు.. ఈ రాశుల‌వారికి గుడ్ టైమ్ మొద‌లైన‌ట్టే..!

Guru Margi 2026 | దేవ గురువు బృహ‌స్ప‌తి మార్చి 11న ప్ర‌త్య‌క్ష సంచారంలోకి రానున్నాడు. ఈ క‌ద‌లిక జ్యోతిష‌శాస్త్రంలో ఓ కీల‌క‌మైన సంఘ‌ట‌న‌గా పేర్కొంటారు. ఒక గ్ర‌హం ప్ర‌త్య‌క్ష సంచారంలోకి వ‌చ్చిన స‌మ‌యంలో దాని సానుకూల ప్ర‌భావాలు ఆయా రాశుల‌వారిపై క‌నిపిస్తాయి.

P

Horoscope | Published On Feb 4, 2026, 5.00 am IST

Guru Margi 2026 | త్వ‌ర‌లో ప్ర‌త్య‌క్షంలోకి దేవగురువు.. ఈ రాశుల‌వారికి గుడ్ టైమ్ మొద‌లైన‌ట్టే..!
Advertisement

Guru Margi 2026 | దేవ గురువు బృహ‌స్ప‌తి మార్చి 11న ప్ర‌త్య‌క్ష సంచారంలోకి రానున్నాడు. ఈ క‌ద‌లిక జ్యోతిష‌శాస్త్రంలో ఓ కీల‌క‌మైన సంఘ‌ట‌న‌గా పేర్కొంటారు. ఒక గ్ర‌హం ప్ర‌త్య‌క్ష సంచారంలోకి వ‌చ్చిన స‌మ‌యంలో దాని సానుకూల ప్ర‌భావాలు ఆయా రాశుల‌వారిపై క‌నిపిస్తాయి. బృహ‌స్ప‌తి న‌వ‌గ్ర‌హాల్లో అత్యంత శుభ‌ప్ర‌ద‌మైన గ్ర‌హం. దాంతో ప్ర‌త్య‌క్ష సంచారం జీవితంలోని అనేక అంశాల్లో సానుకూల మార్పులు క‌లుగ‌జేస్తుంది. బృహస్పతిని జ్ఞానం, సంతానం, అదృష్టం, వివాహ కార‌కుడిగా భావిస్తారు. అందుకే, బృహస్పతి సంచారం ప్ర‌భావం కొన్ని రాశులపై క‌నిపిస్తుంది. దేవ‌గురువు సంచారంతో ప‌లురాశుల వారు కెరీర్‌, కుటుంబం, పిల్ల‌లు, సంప‌ద‌ల్లో మార్పులు జ‌రుగ‌నున్నాయి. ఆ అదృష్ట జాత‌కులు ఎవ‌రో తెలుసుకుందాం..!

వృష‌భ రాశి

వృషభ రాశి వారికి సమయం సానుకూలంగా ఉండబోతోంది. విదేశాలకు వెళ్లే అవకాశం, విదేశీ ప్రయాణాలకు సంబంధించిన అనుకూలంగా ఉంటుంది. కొత్త ఉద్యోగ కోసం చేసే ప్ర‌య‌త్నాలు విజ‌య‌వంత‌మ‌వుతాయి. వృత్తి రంగంలో పరిస్థితి మునుపటి కంటే మెరుగ్గా ఉంటుంది. ఈ సమయంలో మీ కుటుంబ జీవితంలో ఆనందం, శాంతి నెలకొంటాయి. వివాహానికి అడ్డంకులు తొల‌గిపోతాయి. వృషభ రాశి జాత‌కుల‌కు వారి స్నేహితుల‌తో ఉన్న పాత విభేదాల‌న్నీ తొల‌గిపోతాయి.

సింహ‌రాశి

గురువు సంచారంతో సింహ‌రాశి వారికి ఆర్థిక ప్ర‌యోజ‌నం ల‌భిస్తుంది. గ‌తంలో క‌న్నా ఆర్థిక ప‌రిస్థితి బ‌ల‌ప‌డుతుంది. ఆదాయాన్ని పెంచుకునేందుకు కొత్త అవ‌కాశాలు ల‌భిస్తాయి. బృహస్పతి ప్రభావంతో మీ పిల్లలకు సంబంధించిన సమస్యలు కూడా పరిష్కారమవుతాయి. ఈ సమయం ప్రత్యేకంగా ప్రయోజనకరంగా ఉంటుంది. ఈ సమయంలో విదేశాలకు వెళ్లాల‌న్న మీ కోరిక నెర‌వేరుతుంది. కొత్త బాధ్య‌త‌లు మీలో ఆత్మ‌విశ్వాసాన్ని పెంచుతాయి. కుటుంబంలో అనుకూల ప‌రిస్థితులు నెల‌కొంటాయి. మీ బాధ్య‌త‌ల‌ను నెర‌వేర్చ‌డంలో మీకు అదృష్టం తోడ్ప‌డుతుంది.

మీన‌రాశి

గురువు ప్ర‌త్య‌క్షంలోకి రావ‌డంతో మీన‌రాశి వారికి ఆత్మ‌విశ్వాసం పెరుగుతుంది. కుటుంబ సంబంధాల్లో సామ‌ర‌స్యం నెల‌కొంటుంది. మీ ఆరోగ్యం మెరుగ‌వుతుంది. కెరీర్ ల‌క్ష్యాల‌ను సాధించ‌డంలో స‌ఫ‌లీకృతుల‌వుతారు. ఉద్యోగుల‌కు ఉన్న‌తాధికారుల‌నుంచి మ‌ద్ద‌తు ఉంటుంది. ప‌దోన్న‌తికి సంకేతాలున్నాయి. క‌ష్టానికి త‌గ్గ ప్ర‌తిఫ‌లం ఉంటుంది. కెరీర్ పురోగ‌తికి మంచి అవ‌కాశాలు గోచ‌రిస్తున్నాయి. కుటుంబ జీవితంలో శాంతి నెల‌కొంటుంది. మీకు శారీర‌క సుఖాల్లోనూ సానుకూల మార్పుల‌ను గ‌మ‌నిస్తారు.

Advertisement
Advertisement