Jupiter Transit | పునర్వసు నక్షత్రంలోకి గురువు..! మూడురాశుల వారికి అన్నీ శుభవార్తలే..!
Jupiter Transit | ఏప్రిల్ నెల శుభ యోగంతో ప్రారంభమైంది. ఈ నెలలో దేవ గురు బృహస్పతి సహా అనేక గ్రహాలు తమ రాశులను మార్చుకోనున్నాయి. జ్యోతిషశాస్త్రం ప్రకారం.. బృహస్పతి ఏప్రిల్ 20న పునర్వసు నక్షత్రంలోకి ప్రవేశించనున్నారు. ముఖ్యంగా పునర్వసు నక్షత్రానికి గురువు అధిపతి. ఈ ఘటన అత్యంత శుభప్రదమైంది.
Jupiter Transit | ఏప్రిల్ నెల శుభ యోగంతో ప్రారంభమైంది. ఈ నెలలో దేవ గురు బృహస్పతి సహా అనేక గ్రహాలు తమ రాశులను మార్చుకోనున్నాయి. జ్యోతిషశాస్త్రం ప్రకారం.. బృహస్పతి ఏప్రిల్ 20న పునర్వసు నక్షత్రంలోకి ప్రవేశించనున్నారు. ముఖ్యంగా పునర్వసు నక్షత్రానికి గురువు అధిపతి. ఈ ఘటన అత్యంత శుభప్రదమైంది. ప్రభావవంతమైందిగా పండితులు పేర్కొంటున్నారు. దీన్ని స్వనక్షత్ర సంచారంగా పేర్కొంటారు. గురువు తన సొంత నక్షత్రంలోకి ప్రవేశించిన సమయంలో దాని శక్తి అనేక రెట్లు పెరుగుతుంది. దాంతో తన సానుకూల ఫలితాలను మరింత సమర్థవంతంగా ఉండనుంది. దాతో కొన్ని రాశుల వారు ఈ సంచారంతో గణనీయంగా ప్రయోజనాలు పొందనున్నారు. అందువల్ల, కొన్ని రాశుల వారు ఈ సంచారంతో గణనీయంగా ప్రయోజనం పొందవచ్చు. అదనంగా, జ్ఞానం, అదృష్టం, ఆర్థిక లాభం, వ్యాపార విస్తరణ పెరిగే అవకాశం ఎక్కువగా ఉంది. వీటి గురించి తెలుసుకుందాం.
మిథున రాశి వారికి శుభవార్తలు..
ఈ సమయం మిథున రాశి వారికి ఒక కొత్త ప్రారంభానికి సంకేతం. ఈ సమయంలో అవివాహితులకు పెళ్లి జరిగే అవకాశాలు గోచరిస్తున్నాయి. చాలాకాలంగా సంబంధం కోసం ఎదురుచూస్తున్న వారికి శుభవార్త వింటారు. ముఖ్యంగా మిథున రాశి కుటుంబాలు ఆనందకరమైన వాతావరణాన్ని అనుభవిస్తారు. ఈ సమయంలో కొత్త వాహనం కొనుగోలు చేయాలనే కోరిక నెరవేరుతుంది. వ్యాపార సంబంధిత నిర్ణయాలు మిమ్మల్ని ముందుకు నడిపిస్తాయి.
కన్యా రాశి వారికి కొత్త అవకాశాలు..
ఈ గ్రహ సంచారం కన్యా రాశి వారికి కొత్త అవకాశాలను తీసుకువస్తుంది. ఈ రాశిలో జన్మించిన వారు భవిష్యత్తులో వారికి ఎంతో ఉపయుక్తంగా ఉండే కొత్త వ్యక్తులను కలిసే అవకాశాలున్నాయి. అంతేకాకుండా మీ సోషల్ స్టేటస్ పెరుగుతుంది. దాంతో మీ గుర్తింపు మరింత పెరుగుతుంది. విదేశీ ప్రయాణం, ఆధ్యాత్మిక యాత్రలు చేయాలనుకునే వారిక కల సాకారమయ్యే అవకాశం ఉంది. మీ పిల్లల గురించి, ముఖ్యంగా వృత్తి, చదువులకు సంబంధించి శుభవార్త అందుకునే అవకాశాలున్నాయి. సంతృప్తికరమైన ఫలితాలు చూస్తారు.
మీన రాశి వారికి అదృష్టం..
ఈ సమయంలో మీన రాశి వారికి అదృష్టం కలిసివస్తుంది. చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్న పనులు పూర్తయ్యే అవకాశం ఉంది. ఆకస్మిక శుభవార్త మీ జీవితంలోకి కొత్త శక్తిని నింపుతుంది. ముఖ్యంగా వృత్తిపరమైన విజయాలు అందుకునే ఛాన్స్ ఉంది. మీ కష్టానికి తగ్గ ప్రతిఫలం లభిస్తుంది. మీ ఆర్థిక పరిస్థితి కూడా మెరుగుపడి, మీ ఆత్మవిశ్వాసం రెట్టింపవుతుంది.
ట్యాగ్స్:
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్






