April Gochar 2026 | మీనరాశిలో 30 ఏళ్ల తర్వాత అరుదైన గ్రహాల కలయిక.. ఈ నాలుగు రాశుల వారు తస్మాత్ జాగ్రత్త..!
April Gochar 2026 | గ్రహాల సంచారం దృష్ట్యా ఏప్రిల్ నెల అత్యంత విశేషంగా ఉండబోతోంది. ఈ నెలలో సుమారు 30 సంవత్సరాల తర్వాత మీన రాశిలో నాలుగ్రహాల కలయిక (సంయోగం) జరుగబోతోంది. జ్యోతిష్యశాస్త్రం పరంగా ఇది అరుదుగా జరుగుతుంది. ఏప్రిల్ 2న గ్రహాలకు అధిపతి అయిన కుజుడు (Mars) మీన రాశిలోకి ప్రవేశించాడు.
April Gochar 2026 | గ్రహాల సంచారం దృష్ట్యా ఏప్రిల్ నెల అత్యంత విశేషంగా ఉండబోతోంది. ఈ నెలలో సుమారు 30 సంవత్సరాల తర్వాత మీన రాశిలో నాలుగుగ్రహాల కలయిక (సంయోగం) జరుగబోతోంది. జ్యోతిష్యశాస్త్రం పరంగా ఇది అరుదుగా జరుగుతుంది. ఏప్రిల్ 2న గ్రహాలకు అధిపతి అయిన కుజుడు (Mars) మీన రాశిలోకి ప్రవేశించాడు. కుజుడు మీన రాశిలోకి ప్రవేశించిన తర్వాత, సూర్యుడు, బుధుడు, శని గ్రహాలు కూడా మీన రాశిలోకి ప్రవేశించనున్నాయి. 30 సంవత్సరాల కిందట సైతం మీన రాశిలో శని, కుజుడు, సూర్యుడు, బుధ గ్రహాల కలయిక జరిగింది. మీన రాశిలో నాలుగు ప్రధాన గ్రహాల కలయిక కారణంగా ఏ రాశుల వారు అత్యధిక సమస్యలను ఎదుర్కొనే అవకాశం ఉందో తెలుసుకుందాం..!
మేష రాశి
మేష రాశి వారు ఏప్రిల్ నెలలో రాబోయే రోజుల్లో చాలా జాగ్రత్తగా ఉండటం అవసరం. మేష రాశి వారు ప్రస్తుతం శని 'సాడే సాతి' (ఏలినాటి శని) ప్రభావాన్ని ఎదుర్కొంటున్నారు. అంతేకాకుండా మీ రాశికి అధిపతి అయిన కుజుడు మీ జాతకంలో 12వ స్థానంలో సంచరించనున్నాడు. కాబట్టి ఈ సమయంలో పెట్టుబడి ప్రణాళికల విషయంలో జాగ్రత్త వహించాలి. మీ కుటుంబ జీవితంలో ఉద్రిక్తతలు తలెత్తే అవకాశాలు గోచరిస్తున్నాయి. అలాగే, మీ ప్రణాళికల్లో తాత్కాలికంగా కొన్ని ఆటంకాలు ఎదురై నిలిచిపోయే ఛాన్స్ ఉంది.
కన్యా రాశి
కన్యా రాశి వారికి మీన రాశిలో కుజుడు, సూర్యుడు, శని, బుధ గ్రహాల కలయిక ప్రతికూల ప్రభావం పడుతుంది. ఈ గ్రహాలన్నీ మీ జాతకంలోని ఏడో ఇంటిపై దృష్టి పడుతోంది. కాబట్టి కుటుంబ జీవితం, సంబంధాల విషయంలో మీరు జాగ్రత్తగా ఉండటం అవసరం. ఏదైనా వ్యాపారాన్ని ప్రారంభించాలని యోచిస్తున్న వారు తప్పక జాగ్రత్త వహించాలి. కొత్త వ్యాపారాలను ప్రారంభించడాన్ని ఈ సమయంలో వాయిదా వేయడం మంచిది.
తులా రాశి
తులా రాశి వారు ఏప్రిల్ నెల ప్రారంభ రోజుల్లో తప్పక జాగ్రత్త వహించాలి. ఎందుకంటే కుజుడు వారిపై తన ప్రభావాన్ని చూపనున్నాడు. ఈ సమయంలో మీరు ఏ విషయంలోనూ అజాగ్రత్తగా ఉండకూడదు. మీ వృత్తి, వ్యాపార రంగాలలో మీరు కఠోర శ్రమ చేయాల్సి రావచ్చు. ఆర్థిక లావాదేవీలను నిర్వహణ విషయంలో ఆచితూచి వ్యవహరించడం అవసరం.
మీన రాశి
నాలుగు ప్రధాన గ్రహాల కలయిక మీన రాశి వారికి అంత అనుకూలంగా ఉండదు. ప్రస్తుతం శని 'సాడే సాతి' (ఏలినాటి శని) రెండవ దశ నడుస్తోంది. కాబట్టి, మీ ఆర్థిక విషయాలపై మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న వారు నివాస స్థలాన్ని మార్చాల్సి వచ్చే అవకాశం ఉంది. నిరుద్యోగులు కొత్త ఉద్యోగం కోసం మరికొంత కాలం వేచి ఉండక తప్పదు.
ట్యాగ్స్:
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్






