Colon Cancer Symptoms | పెద్ద పేగు క్యాన్సర్ ప్రారంభంలో కనిపించే లక్షణాలు ఇవే.. హెచ్చరిస్తున్న వైద్యులు..
Colon Cancer Symptoms | ప్రపంచవ్యాప్తంగా క్యాన్సర్ సంబంధిత మరణాలకు ప్రధాన కారణాల్లో ఒకటిగా మారిన కోలొరెక్టల్ క్యాన్సర్ (పెద్దపేగు క్యాన్సర్)పై వైద్య నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) అంచనాల ప్రకారం 2020లో ప్రపంచవ్యాప్తంగా దాదాపు 19 లక్షల కొత్త కేసులు నమోదవగా, సుమారు 9.3 లక్షల మంది ఈ వ్యాధి కారణంగా ప్రాణాలు కోల్పోయారు.
Colon Cancer Symptoms | ప్రపంచవ్యాప్తంగా క్యాన్సర్ సంబంధిత మరణాలకు ప్రధాన కారణాల్లో ఒకటిగా మారిన కోలొరెక్టల్ క్యాన్సర్ (పెద్దపేగు క్యాన్సర్)పై వైద్య నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) అంచనాల ప్రకారం 2020లో ప్రపంచవ్యాప్తంగా దాదాపు 19 లక్షల కొత్త కేసులు నమోదవగా, సుమారు 9.3 లక్షల మంది ఈ వ్యాధి కారణంగా ప్రాణాలు కోల్పోయారు. ఇదే పరిస్థితి కొనసాగితే 2040 నాటికి ఏటా 32 లక్షల కొత్త కేసులు, 16 లక్షల మరణాలు సంభవించే ప్రమాదం ఉందని అంచనా వేస్తున్నారు. ఈ క్యాన్సర్లో అత్యంత కీలకమైన అంశం ప్రారంభ దశలో గుర్తించడం. అయితే మొదటి లక్షణాలు చాలా సూక్ష్మంగా ఉండటంతో సాధారణ జీర్ణ సమస్యలుగా భావించి చాలామంది నిర్లక్ష్యం చేస్తుంటారు. దీంతో చికిత్స ఆలస్యం అవుతూ ప్రాణాపాయం పెరుగుతోంది. ఈ నేపథ్యంలో చాలా మంది తరచూ పట్టించుకోని కొన్ని ముఖ్యమైన లక్షణాలపై వైద్యులు హెచ్చరిస్తున్నారు.
మల విసర్జనలో మార్పులు..
దీర్ఘకాలంగా మల విసర్జనలో మార్పులు కనిపించడం పెద్దపేగు క్యాన్సర్కు తొలి సంకేతంగా చెప్పవచ్చు. తరచూ డయేరియా, మలబద్ధకం లేదా మలం ఆకారం మారిపోవడం, ముఖ్యంగా పలుచగా, రిబ్బన్లా రావడం ట్యూమర్ పెరుగుదల కారణంగా జరిగే అవకాశం ఉంటుంది. మొదట తాత్కాలికంగా కనిపించిన ఈ సమస్య, క్యాన్సర్ ఉన్నప్పుడు స్థిరంగా కొనసాగుతుందని నిపుణులు చెబుతున్నారు. మలంలో రక్తం కనిపించడం మరో కీలక హెచ్చరిక. ఎర్రని రక్తం గానీ, నల్లగా కనిపించే మలం గానీ కనిపిస్తే దాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ తేలికగా తీసుకోవద్దని వైద్యులు సూచిస్తున్నారు. పైల్స్ వంటి సాధారణ కారణాలు ఉన్నప్పటికీ రెక్టల్ బ్లీడింగ్ ఉన్నప్పుడు కోలనోస్కోపీ వంటి పరీక్షలు చేయించుకోవడం అత్యవసరం అని సూచిస్తున్నారు.
అనూహ్యంగా బరువు తగ్గడం..
అనూహ్యంగా బరువు తగ్గడం కూడా ప్రమాద సూచకంగా పరిగణించాలి. ఆహార నియమాలు మార్చకపోయినా, వ్యాయామం పెంచకపోయినా 5 కిలోలు లేదా అంతకంటే ఎక్కువ బరువు తగ్గితే అది శరీరంలో జరుగుతున్న అంతర్గత మార్పులకు సంకేతమని అంటున్నారు. ట్యూమర్ శరీర శక్తిని వినియోగించుకోవడం, జీర్ణ ప్రక్రియలో మార్పులు రావడం వల్ల ఈ పరిస్థితి ఏర్పడుతుందని అంటున్నారు. తగినంత విశ్రాంతి తీసుకున్నప్పటికీ ఎప్పటికీ అలసటగా ఉండటం కూడా పెద్ద పేగు క్యాన్సర్కు సంకేతంగా ఉండొచ్చని వైద్యులు హెచ్చరిస్తున్నారు. నెమ్మదిగా జరిగే అంతర్గత రక్తస్రావం వల్ల ఐరన్ లోపం ఏర్పడి శరీరం బలహీనమవుతుంది. ఇటీవలి కాలంలో ఈ వ్యాధి యువతలోనూ పెరుగుతున్నట్లు పరిశోధనలు సూచిస్తున్నాయి. కుటుంబ చరిత్ర, పోషకాహార లోపం, స్థిర జీవనశైలి వంటి కారణాలతో యువకులు కూడా ప్రమాదంలో ఉన్నారని నిపుణులు చెబుతున్నారు. జామా నెట్వర్క్ ఓపెన్లో ప్రచురితమైన అధ్యయనం ప్రకారం, ప్రారంభ దశలో వచ్చే కేసుల్లో సగం మందికి పొట్ట నొప్పి, మలంలో రక్తం వంటి లక్షణాలు కనిపిస్తున్నప్పటికీ, నిర్లక్ష్యం కారణంగా నిర్ధారణకు 4 నుంచి 6 నెలల వరకు ఆలస్యం అవుతోందని తెలిపారు.
లక్షణాలు కనిపించిన వెంటనే వైద్యుడిని సంప్రదించడం అత్యంత అవసరమని చెబుతున్నారు. సాధారణంగా స్క్రీనింగ్ వయస్సు 45-50 ఏళ్లుగా ఉన్నప్పటికీ, లక్షణాలు కొనసాగితే లేదా ప్రమాద కారకాలు ఉంటే తక్కువ వయస్సులోనే పరీక్షలు చేయించుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. శారీరక చురుకుదనం, పీచు పదార్థాలు అధికంగా ఉన్న ఆహారం తీసుకోవడం, పొగాకు, మద్యం నియంత్రణ వంటి ఆరోగ్యకర జీవనశైలిని పాటిస్తే పెద్ద పేగు క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గించుకోవచ్చని చెబుతున్నారు.
సంబంధిత వార్తలు

Cucumber | రాత్రిపూట కీరదోసను తినవచ్చా.. వైద్యులు ఏం చెబుతున్నారు..?
మే 7, 2026

Perimenopause | మహిళల్లో వచ్చే పెరిమెనోపాజ్ దశ అంటే ఏమిటి.. లక్షణాలు ఎలా ఉంటాయి.. ఏం చేయాలి..?
మే 6, 2026

Infertility | ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న సంతాన లోపం సమస్య.. జాగ్రత్తలు తప్పనిసరి అంటున్న WHO..
మే 4, 2026
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్



