Herbal Teas | హెర్బల్ టీలను రోజూ అతిగా తాగుతున్నారా..? అయితే జాగ్రత్త..!
Herbal Teas | ఆరోగ్యంగా ఉండడం కోసం ప్రస్తుతం చాలా మంది హెర్బల్ టీలను సేవిస్తున్నారు. గ్రీన్ టీతోపాటు పలు రకాల మూలికలు లేదా పువ్వులు, ఆకులతో చేసిన హెర్బల్ టీలను అధికంగా తాగుతున్నారు. సహజసిద్ధమైన పదార్థాలు కావడం వల్ల వీటితో ఆరోగ్యకరమైన ప్రయోజనాలు ఉంటాయని వైద్యులు కూడా చెబుతున్నారు.
Herbal Teas | ఆరోగ్యంగా ఉండడం కోసం ప్రస్తుతం చాలా మంది హెర్బల్ టీలను సేవిస్తున్నారు. గ్రీన్ టీతోపాటు పలు రకాల మూలికలు లేదా పువ్వులు, ఆకులతో చేసిన హెర్బల్ టీలను అధికంగా తాగుతున్నారు. సహజసిద్ధమైన పదార్థాలు కావడం వల్ల వీటితో ఆరోగ్యకరమైన ప్రయోజనాలు ఉంటాయని వైద్యులు కూడా చెబుతున్నారు. కనుకనే రోజు రోజుకీ హెర్బల్ టీలను సేవిస్తున్న వారి సంఖ్య పెరుగుతోంది. అయితే హెర్బల్ టీలు ఆరోగ్యకరమే అయినప్పటికీ వీటిని అతిగా తాగకూడదని, హెర్బల్ టీలను అతిగా సేవించడం వల్ల అనేక సమస్యలు వస్తాయని ఇంద్రప్రస్థ అపోలో హాస్పిటల్స్‌కు చెందిన సీనియర్ గ్యాస్ట్రో ఎంటరాలజీ కన్సల్టెంట్ వైద్యుడు డాక్టర్ సుదీప్ ఖన్నా హెచ్చరించారు. హెర్బల్ టీలను రోజూ పరిమితిలోనే తాగాలని, అతిగా తాగకూడదని సూచిస్తున్నారు.
లివర్ కణాలకు నష్టం..
హెర్బల్ టీలలో పైరోలైజైడిన్ ఆల్కలాయిడ్స్ అనే సమ్మేళనాలు ఉంటాయి. ఇవి పరిమిత మోతాదుకు మించి మన శరీరంలో చేరితే కణాలను నాశనం చేస్తాయి. ముఖ్యంగా వీటి ప్రభావం లివర్ కణాలు, రక్త నాళాలపై ఎక్కువగా ఉంటుంది. ఈ క్రమంలో దీర్ఘకాలంలో ఈ సమ్మేళనాలు శరీరంలో అధికంగా చేరడం వల్ల రక్త నాళాలు నాశనం అవడంతోపాటు కొందరిలో అవి బ్లాక్ అయ్యే ప్రమాదం ఏర్పడుతుంది. దీంతో హార్ట్ ఎటాక్ వస్తుంది. అలాగే లివర్ కణాలకు తీవ్రమైన నష్టం జరిగి లివర్ ఫెయిల్ అయ్యే అవకాశాలు ఉంటాయని తెలిపారు. కొందరికి తీవ్రమైన లివర్ సంబంధ వ్యాధులు వచ్చే అవకాశాలు కూడా ఉంటాయన్నారు.
డీహైడ్రేషన్ అధికం..
హెర్బల్ టీలను అధిక మోతదులో సేవించడం వల్ల కొందరికి లివర్ ఎంజైమ్‌లు అధికంగా ఉత్పత్తి అవుతాయి. దీంతో లివర్ విషతుల్యంగా మారుతుంది. కొందరికి కామెర్లు వస్తాయి. మోతాదుకు మించి హెర్బల్ టీలను సేవిస్తే లివర్ డ్యామేజ్ అయ్యే ప్రమాదం మరింత పెరుగుతుందని ఆయన తెలిపారు. హెర్బల్ టీలను అధికంగా సేవించడం వల్ల కొందరిలో తీవ్రమైన డీహైడ్రేషన్ వచ్చే ప్రమాదం ఉంటుంది. శరీరంలో ఎలక్ట్రోలైట్స్ అసమతుల్యతలు ఏర్పడుతాయి. దీని వల్ల శరీరంలో విష పదార్థాలు అధికంగా చేరుతాయి. వాటిని బయకు పంపించడం కిడ్నీలు, లివర్‌కు కష్టంగా మారుతుంది. దీంతో తీవ్ర అనారోగ్య సమస్యలు వస్తాయి. కనుక హెర్బల్ టీలను అతిగా తాగకూడదు. రోజుకు ఒక కప్పు మోతాదులోనే తాగాల్సి ఉంటుందని తెలిపారు.
మనకు మార్కెట్‌లో అనేక రకాల హెర్బల్ టీలు అందుబాటులో ఉన్నాయి. గ్రీన్ టీ, అశ్వగంధ టీ, కవా, అలోవెరా, సెన్నా, కమోమిల్, లెమన్ గ్రాస్, మందార పువ్వు ఇలా అనేక రకాల హెర్బల్ టీలు లభిస్తున్నాయి. అయితే మిగిలిన అన్ని టీల కన్నా గ్రీన్ టీ ఉత్తమమైందని, కానీ దీన్ని కూడా 2 కప్పులకు మించి తాగకూడదని హెచ్చరిస్తున్నారు.
సంబంధిత వార్తలు

Heat Stroke | ఎండల్లో జాగ్రత్త.. హీట్ స్ట్రోక్ వస్తే ఈ 10 లక్షణాలు కనిపిస్తాయి.. లైట్ తీసుకుంటే ప్రాణాలకే ప్రమాదం..
మే 21, 2026

Upper Body Strength Yoga | జిమ్ వద్దు.. బరువులూ ఎత్తొద్దు: మీ ‘అప్పర్ బాడీ’ని ఐరన్‌లా మార్చే బెస్ట్ యోగాసనాలు ఇవే!
మే 17, 2026

Eyes Health | కంటి చూపు స్పష్టంగా ఉన్నంత మాత్రాన కళ్లు ఆరోగ్యంగా ఉన్నట్లు కాదు.. వైద్యులు ఏమంటున్నారు..?
మే 16, 2026
తాజావార్తలు
- ●Traffic Restrictions | నేడు ఉప్పల్‌లో ఐపీఎల్ మ్యాచ్.. ట్రాఫిక్ మళ్లింపులు ఇలా..
- ●Anganwadi Job Notification | నిరుద్యోగ మహిళలకు తీపికబురు.. త్వరలోనే 15,982 అంగన్వాడీ పోస్టుల భర్తీ..!
- ●Heat Wave | నిప్పుల కుంపటిని తలపిస్తున్న ఎండలు.. విలవిలలాడిపోతున్న ప్రజలు
- ●Horoscope | మే 22, శుక్రవారం రాశిఫలాలు.. ఈ రాశి వారి జీవితంలో ఊహించని మార్పులు..!
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Traffic Restrictions | నేడు ఉప్పల్‌లో ఐపీఎల్ మ్యాచ్.. ట్రాఫిక్ మళ్లింపులు ఇలా..

Anganwadi Job Notification | నిరుద్యోగ మహిళలకు తీపికబురు.. త్వరలోనే 15,982 అంగన్వాడీ పోస్టుల భర్తీ..!

Heat Wave | నిప్పుల కుంపటిని తలపిస్తున్న ఎండలు.. విలవిలలాడిపోతున్న ప్రజలు

Horoscope | మే 22, శుక్రవారం రాశిఫలాలు.. ఈ రాశి వారి జీవితంలో ఊహించని మార్పులు..!



