Breast Cancer | ప్రపంచవ్యాప్తంగా అధిక సంఖ్యలో పెరుగుతున్న బ్రెస్ట్ క్యాన్సర్ కేసులు.. భారత్‌లోనూ ఎక్కువే..
Breast Cancer | ప్రపంచ వ్యాప్తంగా ఏటా బ్రెస్ట్ క్యాన్సర్ కేసుల సంఖ్య ఆందోళనకర రీతిలో పెరుగుతుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) వెల్లడించింది. WHO గణాంకాల ప్రకారం 2022లో సుమారు 23 లక్షల మంది మహిళలకు బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చినట్లు తేలిందని పేర్కొంది.
Breast Cancer | ప్రపంచ వ్యాప్తంగా ఏటా బ్రెస్ట్ క్యాన్సర్ కేసుల సంఖ్య ఆందోళనకర రీతిలో పెరుగుతుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) వెల్లడించింది. WHO గణాంకాల ప్రకారం 2022లో సుమారు 23 లక్షల మంది మహిళలకు బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చినట్లు తేలిందని పేర్కొంది. లాన్సెట్ ఆంకాలజీలో ప్రచురితమైన తాజా నివేదిక ప్రకారం 2023లో 23 లక్షలుగా ఉన్న బ్రెస్ట్ క్యాన్సర్ కేసులు 2050 నాటికి 35 లక్షలు దాటే అవకాశముందని వెల్లడైంది. వార్షిక మరణాలు కూడా సుమారు 7.64 లక్షల నుంచి 14 లక్షలకు చేరుతూ 44 శాతం వరకు పెరగవచ్చని నివేదిక అంచనా వేసింది. ఈ విశ్లేషణను గ్లోబల్ బర్డన్ ఆఫ్ డిసీజ్ స్టడీ బ్రెస్ట్ క్యాన్సర్ కొలాబొరేటర్స్ నిర్వహించారు. 1990 నుంచి 2023 వరకు ఉన్న డేటాను పరిశీలించారు.
జీవనశైలి మార్పులు అవసరం..
పొగ తాగకపోవడం, తగిన శారీరక వ్యాయామం చేయడం, మాంసం తినడాన్ని తగ్గించడం, బరువును నియంత్రణలో ఉంచుకోవడం వంటి ఆరోగ్యకర జీవనశైలి చర్యల వల్ల స్తన క్యాన్సర్ ప్రభావాన్ని తగ్గించవచ్చని, దీని వల్ల కోల్పోయే ఆయుష్షులో పావు వంతుకు పైగా తగ్గించుకోవచ్చని నివేదిక తెలిపింది. ఇన్స్టిట్యూట్ ఫర్ హెల్త్ మెట్రిక్స్ అండ్ ఎవాల్యుయేషన్ (IHME), వాషింగ్టన్ విశ్వవిద్యాలయానికి చెందిన ప్రధాన రచయిత కేలీ బాంగ్దియా మాట్లాడుతూ ఉన్నత ఆదాయ దేశాల్లో స్క్రీనింగ్, సమయానుకూల నిర్ధారణ, సమగ్ర చికిత్స అందుబాటులో ఉండగా, తక్కువ, మధ్య ఆదాయ దేశాల్లో ఆలస్య నిర్ధారణ, నాణ్యమైన చికిత్స లోపం, అధిక మరణాలు మహిళల ఆరోగ్య పురోగతిని వెనక్కి నెడుతున్నాయని పేర్కొన్నారు.
భారత్‌లో గణనీయమైన పెరుగుదల..
ఇండియన్ క్యాన్సర్ సొసైటీ ప్రకారం దేశంలో ప్రతి 28 మంది మహిళల్లో ఒకరికి బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చే అవకాశం ఉన్నట్లు తేలింది. 1990తో పోలిస్తే భారత్‌లో క్యాన్సర్ కేసులు గణనీయంగా పెరిగాయి. 2023లో దేశంలో సుమారు 2.03 లక్షల కొత్త బ్రెస్ట్ క్యాన్సర్ కేసులు నమోదయ్యాయి. ఇది 1990తో పోలిస్తే 477.8 శాతం పెరుగుదల కావడం గమనార్హం. అదే కాలంలో మరణాలు 1.02 లక్షలకు చేరాయి, ఇది 352.3 శాతం పెరిగింది. వయో ప్రమాణీకరణ ప్రకారం 2023లో ప్రతి లక్ష మంది మహిళల్లో 29.4 కొత్త కేసులు నమోదయ్యాయి. ఇది 1990తో పోలిస్తే 126.9 శాతం పెరుగుదల కాగా మరణాల రేటు ప్రతి లక్షకు 15.5గా ఉండి, గత మూడు దశాబ్దాల్లో 74 శాతం పెరిగింది.

ఈ దేశాల్లోనూ ఎక్కువే..
భారత్‌తో పాటు మరికొన్ని దేశాల్లో కూడా ఈ క్యాన్సర్ మరణాల పెరుగుదల ఆందోళన కలిగిస్తోంది. లావోస్‌లో 214 శాతం పెరుగుదలతో ప్రపంచంలోనే అత్యధికంగా నమోదైంది. బంగ్లాదేశ్ (91 శాతం), వియత్నాం (80 శాతం), ఇండోనేషియా (78 శాతం), జపాన్ (52 శాతం), ఫిలిప్పీన్స్ (41 శాతం), చైనా (37 శాతం) దేశాలు కూడా గణనీయ పెరుగుదలను చవి చూశాయి. 2023లో 55 ఏళ్లు పైబడిన మహిళల్లో స్తన క్యాన్సర్ కేసులు 20-54 ఏళ్ల మహిళలతో పోలిస్తే మూడు రెట్లు ఎక్కువగా నమోదయ్యాయి. అయితే 20-54 ఏళ్ల వయసు గల మహిళల్లో 1990 నుంచి కేసులు 29 శాతం పెరిగాయి. ఎక్కువ వయసు కలిగిన మహిళల్లో మాత్రం రేటు పెద్దగా మారలేదు. ఇది ప్రీ, పోస్ట్-మెనోపాజ్ మహిళల్లో రిస్క్ ఫ్యాక్టర్‌గా మారిందని అర్థం అవుతోంది.
రిస్క్ ఫ్యాక్టర్లు ఇవే..
బ్రెస్ట్ క్యాన్సర్‌కు కారణమయ్యే అనేక రిస్క్ ఫ్యాక్టర్లు ఉన్నాయి. వాటిలో మార్పుచేసుకోగల జీవనశైలి అంశాలు కూడా ఉన్నాయి. అధిక మాంసం వినియోగం, పొగ తాగడం, అధిక చక్కెర స్థాయిలు, అధిక బాడీ మాస్ ఇండెక్స్ (BMI), అధిక మద్యం సేవనం, తక్కువ శారీరక శ్రమను ప్రధాన కారణాలుగా గుర్తించారు. 1990 నుంచి 2023 మధ్య అధిక మద్యం, పొగతాగడం కారణంగా ఉన్న భారాన్ని తగ్గించడంలో కొంత పురోగతి సాధించినప్పటికీ, ఇతర రిస్క్ ఫ్యాక్టర్ల విషయంలో తగ్గుదల కనిపించలేదని నివేదిక చెబుతోంది. IHME కి చెందిన డాక్టర్ మారీ ఎన్ మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా బ్రెస్ట్ క్యాన్సర్ భారంలో పావు వంతుకు పైగా ఆరు మార్పుచేసుకోగల జీవనశైలి అంశాలే కారణమని, ప్రజారోగ్య విధానాల ద్వారా రిస్క్ ఫ్యాక్టర్లను లక్ష్యంగా చేసుకోవడం, ఆరోగ్యకరమైన ఎంపికలను అందుబాటులోకి తేవడం, స్థూలకాయం, అధిక చక్కెర స్థాయిలను తగ్గించే చర్యలు తీసుకోవడం అత్యవసరం అని పేర్కొన్నారు.
చికిత్స ఖర్చులను తగ్గించాలి..
IHME కి చెందిన మరో డాక్టర్ లిసా ఫోర్స్ మాట్లాడుతూ ప్రతి దేశంలోనూ సకాలంలో నిర్ధారణ, సమగ్ర చికిత్స అందించగల ఆరోగ్య వ్యవస్థలు అవసరమని, చికిత్స ఖర్చులను తగ్గించడం, యూనివర్సల్ హెల్త్ కవరేజ్‌లో బ్రెస్ట్ క్యాన్సర్ చికిత్సను చేర్చడం ద్వారా రోగులను ఆర్థిక భారాల నుంచి రక్షించవచ్చని అభిప్రాయపడ్డారు. ప్రపంచవ్యాప్తంగా బ్రెస్ట్ క్యాన్సర్ పెరుగుదల హెచ్చరికగా మారుతున్న నేపథ్యంలో జీవనశైలి మార్పులు, సమయానుకూల స్క్రీనింగ్, ప్రజారోగ్య విధానాలు కీలకంగా మారాయి.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

AstraZeneca | ఆస్ట్రాజెనెకా భారీ విజయం.. కొత్త బ్రెస్ట్ క్యాన్సర్ ఔషధానికి యూఎస్ఎఫ్డీఏ అనుమతి..
సెప్టెంబర్ 5, 2026

Measles | ప్రపంచవ్యాప్తంగా భారీగా పెరుగుతున్న మీజిల్స్ (తట్టు) కేసులు.. కారణాలేంటి..?
సెప్టెంబర్ 3, 2026

Python Jodie Foster | కొండ చిలువకు క్యాన్సర్ చికిత్స.. ప్రపంచంలోనే ఇది తొలిసారి
ఆగస్టు 23, 2026
తాజావార్తలు
- ●Old Monk Ban | హైకోర్టులో ఓల్డ్ మంక్కు చుక్కెదురు: అసలు అది 'రమ్' కానే కాదన్న ఫుడ్ సేఫ్టీ అథారిటీ.. నెక్స్ట్ ఏంటి?
- ●Coal Gasification Scheme | బొగ్గు గ్యాసిఫికేషన్ పథకానికి స్పందన కరువంటూ వార్తలు.. స్పష్టతనిచ్చిన కేంద్రం..!
- ●Telangana Employees | చలో హైదరాబాద్.. రేపే ఉద్యోగుల సంకల్ప సభ
- ●CEO Sudarshan Reddy | సర్ గడువు పొడిగించండి.. ఈసీఐకి సీఈవో లేఖ
- ●Sumitra Anand | ఎన్ని కథలు చెప్పినా రేవంత్ రెడ్డికి సున్నా మార్కులే
- ●P Muralidhar Rao vs Konda Surekha | "బీజేపీ ఏమైనా చెత్తకుప్పా?".. కొండా సురేఖ చేరిక వార్తలపై మురళీధర్ రావు సంచలన ట్వీట్

Old Monk Ban | హైకోర్టులో ఓల్డ్ మంక్కు చుక్కెదురు: అసలు అది 'రమ్' కానే కాదన్న ఫుడ్ సేఫ్టీ అథారిటీ.. నెక్స్ట్ ఏంటి?

Coal Gasification Scheme | బొగ్గు గ్యాసిఫికేషన్ పథకానికి స్పందన కరువంటూ వార్తలు.. స్పష్టతనిచ్చిన కేంద్రం..!

Telangana Employees | చలో హైదరాబాద్.. రేపే ఉద్యోగుల సంకల్ప సభ

CEO Sudarshan Reddy | సర్ గడువు పొడిగించండి.. ఈసీఐకి సీఈవో లేఖ



