IPL 2026 | రాజస్థాన్ రాయల్స్‌కు షాక్.. గాయంతో ఐపీఎల్‌కు సామ్ కర్రన్ దూరం..?
IPL 2026 | ఐపీఎల్ ప్రారంభానికి ముందు రాజస్థాన్ రాయల్స్‌కు భారీ షాక్ తగిలింది. ఇంగ్లండ్ స్టార్ ఆల్‌రౌండర్ సామ్ కర్రన్ (Sam Curran) గాయం కారణంగా మొత్తం సీజన్‌కు దూరమయ్యే అవకాశాలున్నాయి. ఓ నివేదిక ప్రకారం.. సామ్ కర్రన్ గజ్జ గాయంతో బాధపడుతున్నట్లు తెలుస్తోంది.
Flash news | Published On Mar 20, 2026, 11.48 am IST
IPL 2026 | ఐపీఎల్ ప్రారంభానికి ముందు రాజస్థాన్ రాయల్స్‌కు భారీ షాక్ తగిలింది. ఇంగ్లండ్ స్టార్ ఆల్‌రౌండర్ సామ్ కర్రన్ (Sam Curran) గాయం కారణంగా మొత్తం సీజన్‌కు దూరమయ్యే అవకాశాలున్నాయి. ఓ నివేదిక ప్రకారం.. సామ్ కర్రన్ గజ్జ గాయంతో బాధపడుతున్నట్లు తెలుస్తోంది. ఈ గాయం తీవ్రంగా ఉండడంతో ఐపీఎల్ 2026లో ఆడటం కష్టమని భావిస్తున్నారు. ఇటీవల జరిగిన టీ20 వరల్డ్ కప్‌లో ఇంగ్లండ్ తరఫున ఆడిన విషయం తెలిసిందే.
గత ఏడాది జరిగిన ట్రేడ్‌లో రవీంద్ర జడేజాతో కలిసి సామ్ కర్రన్‌ను చెన్నై సూపర్ కింగ్స్ నుంచి కొనుగోలు చేసింది. గతంలో కర్రన్ రాజస్థాన్ రాయల్స్ తరఫున కూడా ఆడాడు. ఇదే ట్రేడ్‌లో సంజు శాంసన్ సీఎస్కేకు వెళ్లాడు. ఐపీఎల్ 2025లో సామ్ కర్రన్ పెద్దగా ఆకట్టుకోలేకపోయాడు. ఐదు మ్యాచ్‌ల్లో కేవలం 114 పరుగులు చేసి, ఒక్క వికెట్ మాత్రమే తీశాడు. ఈ సీజన్లో తిరిగి ఫామ్‌లోకి రావాలని భావించిన గాయం అడ్డంకిగా మారింది. మాజీ భారత ఫాస్ట్ బౌలర్ లక్ష్మీపతి బాలాజీ రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్సీ నిర్ణయంపై ఆశ్చర్యం వ్యక్తం చేశారు. సీనియర్స్ అయిన సామ్ కర్రన్, జడేజాల్లో ఒకరిని కెప్టెన్‌గా నియమించకుండా యువ ప్లేయర్ రియాన్ పరాగ్‌కు బాధ్యతలు అప్పగించడంపై సందేహాలు వ్యక్తం చేశారు. అయితే, జట్టు యాజమాన్యం మాత్రం యువ ఆటగాడిపై నమ్మకం పెట్టుకుంది.
సామ్ కర్రన్ ఐపీఎల్‌కు దూరమయ్యే అవకాశాలు ఉండడంతో రాయస్థాన్ రాయల్స్ మరో ఆటగాడిని తీసుకునేందుకు ఆసక్తి చూపిస్తోంది. జట్టులో ఇప్పటికే జడేజా లాంటి అనుభవజ్ఞుడైన ఆల్‌రౌండర్ ఉన్నాడు. అదేవిధంగా డొనొవాన్ ఫెరీరా కూడా జట్టులో ఉండడం ఆ జట్టుకు ఊరట కలిగించే విషయం. తన దూకుడైన బ్యాటింగ్‌తో పాటు ఆఫ్‌స్పిన్ సేవలందించగలడు. కర్రన్ లాంటి స్టార్ ఆల్‌రౌండర్ దూరమైతే ఆ స్థానాన్ని భర్తీ చేయేడం కాస్త ఆ జట్టుకు ఇబ్బందికరమైన విషయమే.
ట్యాగ్స్:
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్






