త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

EA Siddique | ప్ర‌ముఖ వ్య‌వ‌సాయ శాస్త్ర‌వేత్త ఇబ్ర‌హీం అలీ అబూబ‌క‌ర్ సిద్ధిఖీ క‌న్నుమూత‌

EA Siddique | ప్ర‌ముఖ వ్య‌వ‌సాయ శాస్త్ర‌వేత్త డాక్ట‌ర్ ఇబ్ర‌హీం అలీ అబూబ‌క‌ర్ సిద్ధిఖీ (89) (EA Siddique) క‌న్నుమూశారు. అనారోగ్య స‌మ‌స్య‌ల‌తో ఆయ‌న తుదిశ్వాస విడిచార‌ని ఆయ‌న కుటుంబ స‌భ్యులు తెలిపారు. ఆయ‌న మృతి ప‌ట్ల తెలంగాణ వ్య‌వ‌సాయ శాఖ మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజ‌న్ రెడ్డి సంతాపం తెలిపారు.

A

Flash news | Published On Jan 23, 2026, 3.26 pm IST

EA Siddique | ప్ర‌ముఖ వ్య‌వ‌సాయ శాస్త్ర‌వేత్త ఇబ్ర‌హీం అలీ అబూబ‌క‌ర్ సిద్ధిఖీ క‌న్నుమూత‌
Advertisement

EA Siddique | ప్ర‌ముఖ వ్య‌వ‌సాయ శాస్త్ర‌వేత్త డాక్ట‌ర్ ఇబ్ర‌హీం అలీ అబూబ‌క‌ర్ సిద్ధిఖీ (89) (EA Siddique) క‌న్నుమూశారు. అనారోగ్య స‌మ‌స్య‌ల‌తో ఆయ‌న తుదిశ్వాస విడిచార‌ని ఆయ‌న కుటుంబ స‌భ్యులు తెలిపారు. దేశంలో వ‌రివంగ‌డాల ప‌రిశోధ‌న‌ల్లో ఆయ‌న విప్ల‌వాత్మ‌క మార్పులు తీసుకువ‌చ్చారు. హైబ్రిడ్ వ‌రి సాగును ప్రోత్స‌హించ‌డంతో పాటు పెద్ద మొత్తంలో ఉత్ప‌త్తి చేయ‌డంలో ఆయ‌న పాత్ర ఎంతో ముఖ్య‌మైన‌ది. అందుకే ఆయ‌న‌ను భార‌త హైబ్రిడ్ వ‌రి పితామ‌హుడిగా భావిస్తారు. భార‌త ప్ర‌భుత్వం 2011లో ఆయ‌న‌ను ప‌ద్మ‌శ్రీ‌తో స‌త్క‌రించింది. త‌మిళ‌నాడుకు చెందిన ఆయ‌న ఇండియ‌న్ అగ్రిక‌ల్చ‌రల్ రీస‌ర్చ్ ఇన్‌స్టిట్యూట్ (ఐఏఆర్ఐఐ) నుంచి ప్ర‌ఖ్యాత‌ వృక్ష‌శాస్త్ర‌జ్ఞుడు ఎంఎస్ స్వామినాథన్ ప‌ర్య‌వేక్ష‌ణ‌లో డాక్ట‌రేట్ సాధించారు.

ఇబ్ర‌హీం అలీ అబూబ‌క‌ర్ సిద్ధిఖీ మృతి ప‌ట్ల తెలంగాణ వ్య‌వ‌సాయ శాఖ మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజ‌న్ రెడ్డి సంతాపం తెలిపారు. దేశ వ్య‌వ‌సాయ రంగానికి తీర‌ని లోట‌ని చెప్పారు. మ‌న‌దేశం బియ్యం ఎగుమ‌తుల్లో అగ్ర‌గామిగా నిలిచేందుకు ఆయ‌న కృషి అనన్య సామాన్య‌మ‌ని కీర్తించారు. పొట్టిరకం బాస్మ‌తి వంగ‌డం అభివృద్ధిలో ఆయ‌న‌ది కీల‌క పాత్ర అని అన్నారు.

ట్యాగ్స్:

Advertisement

తాజావార్తలు

Advertisement