Juturi Keerthi Reddy | ఏదోటి మాట్లాడి హైలైట్ అవుదామనుకుంటున్నరేమో
Juturi Keerthi Reddy | ఏదోటి మాట్లాడి సీఎం రేవంత్‌రెడ్డి హైలైట్ అవుదామనుకుంటున్నరేమోనని బీజేపీ స్టేట్ ఎగ్జికుటీవ్ మెంబర్ జూటూరు కీర్తిరెడ్డి ఎద్దేవా చేశారు. దేవుళ్లను సైతం విభజించి పాలించే దౌర్భాగ్యమైన సంస్కృతికి కాంగ్రెస్ తెర లేపిందన్నారు.
Flash news | Published On Sep 29, 2026, 7.09 pm IST
- దేవుళ్లను విభజించే నీచమైన సంస్కృతి ఏంది?
- మీ స్థాయికి తగ్గట్లు మాట్లాడండి
- సీఎం రేవంత్ వ్యాఖ్యలపై బీజేపీ స్టేట్ ఎగ్జిక్యూటీవ్ మెంబర్ జూటూరు కీర్తిరెడ్డి ఫైర్
Juturi Keerthi Reddy | త్రినేత్ర న్యూస్: ఏదోటి మాట్లాడి సీఎం రేవంత్‌రెడ్డి హైలైట్ అవుదామనుకుంటున్నరేమోనని బీజేపీ స్టేట్ ఎగ్జిక్యూటీవ్ మెంబర్ జూటూరు కీర్తిరెడ్డి ఎద్దేవా చేశారు. దేవుళ్లను సైతం విభజించి పాలించే దౌర్భాగ్యమైన సంస్కృతికి కాంగ్రెస్ తెర లేపిందన్నారు. నిన్న ఢిల్లీలో రేవంత్ మాటల్లో అది మరోసారి రుజువైందని మండిపడ్డారు. స్థాయికి తగ్గట్లు మాట్లాడాలని హితవు పలికారు. ఈమేరకు మంగళవారం ఆమె తీవ్ర స్థాయిలో ఫైరయ్యారు.
స్వార్థ రాజకీయాల కోసం విభజించి పాలించే నీచమైన సంస్కృతి కాంగ్రెస్ పార్టీదన్నారు. నిన్న ఢిల్లీలో జరిగిన ఓ కార్యక్రమంలో దేవుళ్ల నుద్దేశించి పేదల దేవుడు శివుడు, సంపన్నుల దేవుడు శ్రీరాముడంటూ సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను ఆమె తప్పుబట్టారు. కులం, మతం, ప్రాంతాలనే కాకుండా ఏకంగా దేవుళ్లను సైతం విభజించి పాలించే సంస్కృతికి కాంగ్రెస్ తెర లేపిందన్నారు.
శివుడు పేదల దేవుడు, రాముడు సంపన్నుల దేవుడంటూ రేవంత్ రెడ్డి తెలిసి మాట్లాడుతున్నారో.. ఏదోటి మాట్లాడి హైలెట్ అవుదామనుకుంటున్నారో తెలియదుగానీ.. ఆయన మాటల వల్ల తెలంగాణ ప్రతిష్టకు భంగం కలుగుతోందన్నారు. ఆ వ్యాఖ్యలు దురదృష్టకరమన్నారు. ఓ ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి మాట్లాడే మాటలేనా? అని నిలదీశారు. దేవుడంటేనే లోక కళ్యాణం కోరేవాడు తప్పితే.. ద్రవిడులకు ఓ దేవుడు.. ఇతరులకు ఓ దేవుడంటూ ప్రత్యేకంగా దేవుళ్లే లేరన్నారు. కాంగ్రెస్ స్వార్థ రాజకీయాల కోసం దేశాన్ని విచ్చిన్నం చేసే కుట్ర చేస్తోందని ఆరోపించారు. కాంగ్రెస్‌కు ప్రజాదరణ తగ్గుతున్న ప్రతిసారి ఇలాంటి వ్యాఖ్యలు చేసి పబ్బం గడుపుకోవడం ఆపార్టీ నేతలకు అలవాటేనన్నారు.
గతంలో కాంగ్రెస్‌లో ఉన్ననేత దేవాదాయ శాఖ మంత్రిగా ఉండి జైశ్రీరామ్ అంటే పైసలొస్తాయా? అన్న విషయాన్ని ఈ సందర్భంగా ఆమె గుర్తు చేశారు. కోట్లాదిమంది ప్రజల ఆర్యాధ్య దైవాలకు విభజించి పార్టీలకు, వర్గాలకు అంటగడుతున్నారని ఫైర్ అయ్యారు. రాముడిని ఒక పార్టీకి, శివుడిని మరో వర్గం వారని మాట్లాడటం సబబు కాదని హితవు పలికారు. సీఎం రేవంత్ కు చిత్తశుద్ది ఉంటే.. దేవుళ్లను రాజకీయ మైక్రోఫోన్‌గా మార్చడం కాదు.. ఇచ్చిన హామీలు నెరవేర్చాలన్నారు. వాటిపై మాట్లాడాలని హితవు పలికారు.
తాజావార్తలు
- ●Priya Bhavani Shankar | ఇరుముడి హీరోయిన్ క్యూట్ ఫొటోలు
- ●Telangana Youth Russia War | రష్యా యుద్ధభూమిలో తెలంగాణ యువకులు: జాబ్ పేరుతో తీసుకెళ్లి ఆర్మీలోకి.. కాపాడాలంటూ 'ప్రజావాణి'లో కుటుంబాల రోదన
- ●Rajya Sabha Biennial Elections | రాజ్యసభ ఎన్నికల నగారా: యూపీ, ఉత్తరాఖండ్, బెంగాల్‌లోని 12 స్థానాలకు ఈసీ నోటిఫికేషన్.. అక్టోబర్ 16న పోలింగ్
- ●Ponguleti Srinivas Reddy | ఏడాదిలోపే ఇందిరమ్మ ఇళ్ల తాళాలు : పొంగులేటి శ్రీనివాసరెడ్డి
- ●Allu Arjun | భార్య స్నేహారెడ్డి బర్త్‌డే - రొమాంటిక్‌గా విషెస్ చెప్పిన బన్నీ
- ●Tummala Nageswara Rao | ఖరీఫ్‌లో పప్పుధాన్యాల సాగులో వృద్ధి

Priya Bhavani Shankar | ఇరుముడి హీరోయిన్ క్యూట్ ఫొటోలు

Telangana Youth Russia War | రష్యా యుద్ధభూమిలో తెలంగాణ యువకులు: జాబ్ పేరుతో తీసుకెళ్లి ఆర్మీలోకి.. కాపాడాలంటూ 'ప్రజావాణి'లో కుటుంబాల రోదన

Rajya Sabha Biennial Elections | రాజ్యసభ ఎన్నికల నగారా: యూపీ, ఉత్తరాఖండ్, బెంగాల్‌లోని 12 స్థానాలకు ఈసీ నోటిఫికేషన్.. అక్టోబర్ 16న పోలింగ్

Ponguleti Srinivas Reddy | ఏడాదిలోపే ఇందిరమ్మ ఇళ్ల తాళాలు : పొంగులేటి శ్రీనివాసరెడ్డి





