Ponguleti Srinivas Reddy | ఏడాదిలోపే ఇందిరమ్మ ఇళ్ల తాళాలు : పొంగులేటి శ్రీనివాసరెడ్డి
Ponguleti Srinivas Reddy | పేదవాడి సొంతింటి కలను సాకారం చేయడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యమని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నాయకత్వంలోని ప్రజా ప్రభుత్వం పేదల కష్టాలు తెలిసిన ఇందిరమ్మ ప్రభుత్వమని చెప్పారు. పేద కుటుంబాలకు సొంతింటిని అందించాలన్న సంకల్పంతో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాన్ని ప్రతిష్టాత్మకంగా చేపట్టినట్లు తెలిపారు.
Ponguleti Srinivas Reddy | పేదవాడి సొంతింటి కలను సాకారం చేయడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యమని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నాయకత్వంలోని ప్రజా ప్రభుత్వం పేదల కష్టాలు తెలిసిన ఇందిరమ్మ ప్రభుత్వమని చెప్పారు. పేద కుటుంబాలకు సొంతింటిని అందించాలన్న సంకల్పంతో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాన్ని ప్రతిష్టాత్మకంగా చేపట్టినట్లు తెలిపారు. నాంపల్లి నియోజకవర్గంలోని రెడ్‌హిల్స్‌లో మంగళవారం మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, మంత్రి అజారుద్దీన్, ఎంపీ అనిల్‌కుమార్ యాదవ్, ఎమ్మెల్యే మాజిద్ హుస్సేన్‌తో కలిసి ఇందిరమ్మ టవర్స్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో మంత్రి మాట్లాడారు. పేదవాడు జీవితంలో ఒక్కసారైనా సొంతింటిని చూసుకోవాలన్న ఆకాంక్షను నెరవేర్చడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. మహానగరంలో ఎకరం భూమి విలువ రూ.200 కోట్లు, రూ.250 కోట్లు ఉన్నా.. ఆ భూమి ద్వారా ప్రభుత్వానికి ఆదాయం సమకూర్చడం కంటే పేద కుటుంబానికి సొంత ఇల్లు ఇవ్వడానికే ప్రాధాన్యమిస్తున్నామని స్పష్టం చేశారు. నగర పరిధిలో ప్రభుత్వంలోని వివిధ శాఖలకు చెందిన భూములను గుర్తించి, వాటిని హౌసింగ్ శాఖకు బదలాయించి గ్రౌండ్ ప్లస్ టెన్ అంతస్తుల అపార్ట్‌మెంట్లు నిర్మించాలని నిర్ణయించినట్లు తెలిపారు.
డ్రాలో 480 మంది ఎంపిక
పారదర్శకంగా నిర్వహించిన లక్కీడ్రాలో 480 మంది లబ్ధిదారులను ఎంపిక చేసినట్లు మంత్రి తెలిపారు. మిగిలిన వారికి రెండో, మూడో, నాలుగో విడతల్లో ఇళ్లు అందిస్తామన్నారు. నగరంలోని మొత్తం 20 నియోజకవర్గాల్లో భూములను గుర్తించామని, సుమారు 16–17 ప్రాంతాల్లో టెండర్ ప్రక్రియ పూర్తయిందని చెప్పారు. త్వరలోనే ఆయా ప్రాంతాల్లో నిర్మాణ పనులు ప్రారంభమవుతాయని తెలిపారు. ప్రస్తుతం నిర్మిస్తున్న ఒక్కో అపార్ట్‌మెంట్ విలువ సుమారు రూ.80 లక్షల నుంచి రూ.కోటి వరకు ఉంటుందని పొంగులేటి తెలిపారు. రెండు, మూడేళ్లు సమయం తీసుకోకుండా ఏడాదిలోపే నిర్మాణాలు పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. ఇదే వేదిక నుంచి లబ్ధిదారులకు ఇంటి తాళాలు అందిస్తానని చెప్పారు. గతంలో మాదిరిగా కేవలం సర్టిఫికెట్లు ఇచ్చి వదిలేయకుండా.. ఇళ్లను నేరుగా లబ్ధిదారుల పేర్లపై రిజిస్ట్రేషన్ చేసేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. రూపాయి కమిషన్ లేకుండా, రిజిస్ట్రేషన్ ఛార్జీలు లేకుండా ఇళ్లు అందించే విధంగా చర్యలు చేపడతామన్నారు. భవిష్యత్‌లో పిల్లల చదువులు, వివాహాలు వంటి అవసరాలకు రుణం పొందే అవకాశం ఉండేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు.
డ్రైనేజీ సమస్యకు శాశ్వత పరిష్కారం
ఇందిరమ్మ టవర్స్‌లో నివసించే కుటుంబాలకు డ్రైనేజీ సమస్య రాకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను మంత్రి అక్కడికక్కడే ఆదేశించారు. నిర్మాణ ప్రాంతంలోని డ్రైనేజీని మెయిన్ ట్రంక్ లైన్‌కు అనుసంధానం చేసే బాధ్యతను హౌసింగ్ శాఖ తీసుకుంటుందని తెలిపారు. ఇళ్ల నిర్మాణంలో లబ్ధిదారుల భాగస్వామ్యాన్ని కూడా నిర్ధారిస్తామన్నారు. వారానికి ఒక రోజు లబ్ధిదారులు నిర్మాణ ప్రదేశాన్ని సందర్శించి, ఇళ్ల నిర్మాణ నాణ్యతను స్వయంగా పరిశీలించుకునే అవకాశం కల్పిస్తామని చెప్పారు. గత ప్రభుత్వాలు నగరంలో పేదలు నివసించే ప్రాంతాలకు 30–40 కిలోమీటర్ల దూరంలో ఇళ్లు నిర్మించడం వల్ల జీవనోపాధి కోసం వారు ఇబ్బందులు ఎదుర్కొన్నారని మంత్రి అన్నారు. పేదల జీవనోపాధి, పిల్లల చదువులు, కుటుంబ అవసరాలను దృష్టిలో పెట్టుకుని ఇళ్ల నిర్మాణ ప్రాంతాలను ఎంపిక చేస్తున్నామని తెలిపారు. ‘ఇందిరమ్మ ప్రభుత్వం అంటేనే ఇందిరమ్మ ఇల్లు. ప్రతి తండాలో, ప్రతి గూడెంలో, ప్రతి డివిజన్‌లో, ప్రతి వార్డులో పేదలకు ఇళ్లు నిర్మించి చూపిస్తాం’ అని స్పష్టం చేశారు.
లబ్ధిదారులకు ఇళ్ల నంబర్ల కేటాయింపు
గత ప్రభుత్వం పదేళ్లలో నిర్మించిన ఇళ్ల కంటే ప్రజా ప్రభుత్వం తొలి విడతలోనే రెట్టింపు ఇళ్లు నిర్మించి చూపిస్తుందని అన్నారు. పేదల సొంతింటి కలను ఎన్నికల హామీగా కాకుండా ప్రభుత్వ బాధ్యతగా భావించి అమలు చేస్తున్నామని తెలిపారు. ఎన్నికలలోపు నాలుగు విడతల ఇళ్ల నిర్మాణాన్ని పూర్తి చేసి లబ్ధిదారులకు తాళాలు అందిస్తామని మంత్రి హామీ ఇచ్చారు. ఇప్పటికే ఎంపికైన 480 మంది లబ్ధిదారులకు అభినందనలు తెలిపారు. కార్యక్రమంలో భాగంగా లక్కీడ్రాలో విజేతలైన లబ్ధిదారులకు మంత్రి పొంగులేటి ఇళ్ల నంబర్లను కేటాయించారు. వారి పేర్లను ప్రకటించారు. మంత్రి చేతుల మీదుగా మాదేసు లతకు ఇందిరమ్మ ‘ఏ’ టవర్‌లోని 801వ ఇంటిని కేటాయించారు. కార్యక్రమంలో హౌసింగ్ శాఖ ఎండీ గౌతమ్, కలెక్టర్ ప్రియాంక అలాతో పాటు పలువురు అధికారులు పాల్గొన్నారు.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Revanth Reddy | తుమ్మిడిహెట్టి నిర్మాణానికి అనుమతులు ఇప్పించండి.. కేంద్రమంత్రికి సీఎం రేవంత్ రిక్వెస్ట్
సెప్టెంబర్ 29, 2026

She Teams | గణేశ్ ఉత్సవాల్లో రెచ్చిపోయిన పోకిరీలు.. 2,935 మంది అదుపులోకి తీసుకున్న షీటీమ్స్..
సెప్టెంబర్ 29, 2026

Bhatti Vikramarka | దళితుల ఆత్మగౌరవం కోసం ఐక్య పోరాటం : భట్టి విక్రమార్క
సెప్టెంబర్ 29, 2026
తాజావార్తలు
- ●Revanth Reddy | తుమ్మిడిహెట్టి నిర్మాణానికి అనుమతులు ఇప్పించండి.. కేంద్రమంత్రికి సీఎం రేవంత్ రిక్వెస్ట్
- ●Yashmi Gowda | రొమాంటిక్ సీరియల్‌తో తెలుగులోకి బిగ్‌బాస్ బ్యూటీ రీఎంట్రీ
- ●RS Praveen Kumar | ఈనాడు రాసింది..తప్పుడు వార్త! ఆ మాత్రం తెలియకపోతే ఎలా?
- ●She Teams | గణేశ్ ఉత్సవాల్లో రెచ్చిపోయిన పోకిరీలు.. 2,935 మంది అదుపులోకి తీసుకున్న షీటీమ్స్..
- ●Bhatti Vikramarka | దళితుల ఆత్మగౌరవం కోసం ఐక్య పోరాటం : భట్టి విక్రమార్క
- ●Madhapur OYO Room Death | మాదాపూర్ ఓయో రూమ్‌లో యువతి మృతి కేసు మిస్టరీ వీడింది: పెళ్లి ప్రస్తావన తేగానే దాడి.. ప్రియుడే హంతకుడు

Revanth Reddy | తుమ్మిడిహెట్టి నిర్మాణానికి అనుమతులు ఇప్పించండి.. కేంద్రమంత్రికి సీఎం రేవంత్ రిక్వెస్ట్

Yashmi Gowda | రొమాంటిక్ సీరియల్‌తో తెలుగులోకి బిగ్‌బాస్ బ్యూటీ రీఎంట్రీ

RS Praveen Kumar | ఈనాడు రాసింది..తప్పుడు వార్త! ఆ మాత్రం తెలియకపోతే ఎలా?

She Teams | గణేశ్ ఉత్సవాల్లో రెచ్చిపోయిన పోకిరీలు.. 2,935 మంది అదుపులోకి తీసుకున్న షీటీమ్స్..



