త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Kishan Reddy | హైద‌రాబాద్‌లో 232.7 కోట్ల‌తో సైన్స్ సిటీ: కేంద్ర మంత్రి కిష‌న్‌రెడ్డి

Kishan Reddy | హైదరాబాద్‌(Hyderabad)లోని CSIR-IICTలో రూ.232.7 కోట్ల భారీ బ‌డ్జెట్‌తో స‌రికొత్త సైన్స్ ఎక్స్‌పీరియ‌న్స్ సెంట‌ర్‌ (సైన్స్ సిటీ-Science city) మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేయ‌నున్న‌ట్లు కేంద్ర మంత్రి జీ కిష‌న్‌రెడ్డి (Kishan Reddy) తెలిపారు.

S

Flash news | Published On Nov 18, 2026, 10.32 am IST

Kishan Reddy | హైద‌రాబాద్‌లో 232.7 కోట్ల‌తో సైన్స్ సిటీ: కేంద్ర మంత్రి కిష‌న్‌రెడ్డి
Advertisement

Kishan Reddy | త్రినేత్ర న్యూస్‌: హైదరాబాద్‌(Hyderabad)లోని CSIR-IICTలో రూ.232.7 కోట్ల భారీ బ‌డ్జెట్‌తో స‌రికొత్త సైన్స్ ఎక్స్‌పీరియ‌న్స్ సెంట‌ర్‌ (సైన్స్ సిటీ-Science city) మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేయ‌నున్న‌ట్లు కేంద్ర మంత్రి జీ కిష‌న్‌రెడ్డి (Kishan Reddy) తెలిపారు. హైదరాబాద్‌ను శాస్త్రీయ ఆవిష్కరణల్లో అంతర్జాతీయ స్థాయి కేంద్రంగా తీర్చిదిద్దడమే ఈ ప్రాజెక్ట్ ప్రధాన ఉద్దేశమ‌ని చెప్పారు. విద్యార్థులతో పాటు సామాన్య ప్రజలకు శాస్త్రీయ పరిజ్ఞానాన్ని పెంపొందించేందుకు ఈ కేంద్రం ఎంతగానో ఉపయోగపడనుందని ఆశాభావం వ్య‌క్తం చేశారు. ఈ మేర‌కు బుధ‌వారం ఎక్స్‌వేదిక‌గా ఆయ‌న స్పందించారు.

నిర్మాణంలో ఉన్న సైన్స్‌ సెంటర్‌ నమూనా చిత్రాలను ఆయన తన ఎక్స్‌ ఖాతాలో పోస్టు చేశారు. ఆసక్తి, ఆశ్చర్యగొలిపే ప్రదర్శనలు, ఖగోళ వింతలు, అంతరిక్ష అద్భుతాలు, విజ్ఞానం, రోబోటిక్స్, ఆవిష్కరణల హబ్‌లు ఇందులో ఉన్నాయన్నారు. వికసిత్‌ భారత్‌ దిశగా సాగిస్తున్న ప్రయాణంలో ఇది కీలకపాత్ర పోషించనుందని చెప్పారు. కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో నేషనల్ కౌన్సిల్ ఆఫ్ సైన్స్ మ్యూజియమ్స్ (NCSM) దీన్ని నిర్మిస్తోందని పేర్కొన్నారు. ఈ ప్రాజెక్టు 2027, మే లేదా జూన్ నాటికి అందుబాటులోకి రానుందని వివ‌రించారు.

ఇవీ సైన్స్ సిటీ విశేషాలు

  • ఇంటరాక్టివ్ అండ్‌ ఇమ్మెర్సివ్ ఎగ్జిబిట్స్
  • ఆస్ట్రానమీ & స్పేస్ సైన్స్
  • రోబోటిక్స్ & ఇన్నోవేషన్ హబ్
  • 3D డిజిటల్ డోమ్ థియేటర్
  • వాక్-త్రూ అక్వేరియం
  • మోషన్ సిమ్యులేటర్
  • స్టూడెంట్ యాక్టివిటీ జోన్స్
Advertisement
Advertisement