Balakrishna | బాలకృష్ణ హీరో – మాధురీ దీక్షిత్ హీరోయిన్ – అనౌన్స్‌మెంట్ వరకు వచ్చి ఆగిపోయిన బాలీవుడ్ మూవీ
యాభై ఏళ్ల సినీ ప్రయాణంలో బాలకృష్ట తెలుగు తప్ప ఇతర భాషల్లో సినిమాలు చేయలేకపోయారు. 1992లో బాలకృష్ణ ఓ స్ట్రెయిట్ బాలీవుడ్ మూవీ చేయాల్సింది. హీరోయిన్, డైరెక్టర్ ఫిక్సయిన తర్వాత ఈ మూవీ ఆగిపోయింది.
Entertainment | Published On Feb 23, 2026, 8.49 pm IST
Balakrishna | పాన్ ఇండియన్ కల్చర్‌తో సినిమాల పరంగా భాషపరమైన హద్దులు తొలగిపోయాయి. ఓ భాషకు చెందిన యాక్టర్లు మరో లాంగ్వేజ్‌లో సినిమాలు చేయడం కామన్‌గా మారింది. తమిళ, మలయాళంతో పాటు బాలీవుడ్‌కు చెందిన నటులు టాలీవుడ్‌లో ఫుల్ బిజీగా ఉన్నారు. కానీ తెలుగు హీరోలు మాత్రం ఇతర భాషల్లో అంతగా అవకాశాలను అందుకోలేకపోతున్నారు.
చిరంజీవి...నాగార్జున....
పాన్ ఇండియన్ ట్రెండ్ మొదలుకాకముందే నాగార్జున, చిరంజీవి, వెంకటేష్ బాలీవుడ్‌లో సినిమాలు చేశారు. కానీ బాలకృష్ణ మాత్రం టాలీవుడ్‌కు పరిమితమయ్యారు. యాభై ఏళ్ల సినీ ప్రయాణంలో ఇతర భాషల్లో ఒక్క సినిమా చేయలేకపోయారు.
స్ట్రెయిట్ మూవీ....
1990 దశకంలో స్ట్రెయిట్ బాలీవుడ్ మూవీలో బాలకృష్ణ నటించాల్సింది. హీరో, డైరెక్టర్‌తో పాటు స్టోరీ రెడీ అయిన తర్వాత ఈ సినిమా ఆగిపోయింది. బాలకృష్ణను బాలీవుడ్‌కు పరిచయం చేయాలని సీనియర్ ప్రొడ్యూసర్ ఏఎమ్ రత్నం ప్లాన్ చేశారు. 1992లో ఓ హిందీ మూవీని అనౌన్స్‌చేశాడు. బాలకృష్ణ బాలీవుడ్ డెబ్యూ మూవీకి దర్శకుడిగా ఎన్ చంద్ర ఫిక్సయ్యాడు. హీరోయిన్‌గా మాధురీ దీక్షిత్‌ను ఫైనల్ చేశారు.
మాధురీ దీక్షిత్...
తేజాబ్, నరసింహా విజయాలతో ఎన్ చంద్ర మంచి ఫామ్‌లో ఉండటంతో ఈ మూవీపై భారీగా అంచనాలు నెలకొన్నాయి. బాలకృష్ణ ఇమేజ్‌కు తగ్గట్లుగా ఓ పవర్‌ఫుల్ స్క్రిప్ట్‌ను కూడా ఎన్ చంద్ర రెడీ చేశారు. ఆ టైమ్‌లో బాలకృష్ణతో పాటు మాధురీ దీక్షిత్ బిజీగా ఉండటంతో ఈ బాలీవుడ్ మూవీ షూటింగ్ డిలే అవుతూ వచ్చింది. ఒకరి డేట్స్ అడ్జెస్ట్ అయితే మరొకరి డేట్స్ దొరక్కపోవడంతో ఈ బాలీవుడ్ డెబ్యూ మూవీని ఏఎమ్‌రత్నం పక్కనపెట్టేశారు.
బాలకృష్ణ మూవీ స్థానంలోనే ఎన్ చంద్ర దర్శకత్వంలో విజయశాంతి కర్తవ్యం సినిమాను తేజస్విని పేరుతో రీమేక్ చేశారు. అలా బాలకృష్ణ బాలీవుడ్ డెబ్యూ మూవీ మిస్సయ్యింది.
సంబంధిత వార్తలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
మే 21, 2026

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
మే 21, 2026

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
మే 21, 2026
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్



