Ranya Rao | డీజీపీ రాసలీలల వీడియో వైరల్..! మళ్లీ వార్తలకెక్కిన నటి రన్యారావు..!
Ranya Rao | కర్నాటక డైరెక్టరేట్ ఆఫ్ సివిల్ రైట్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ (DCRE), డీజీపీ కే రామచంద్రరావు కార్యాలయంలోనే మహిళలో అసభ్యంగా ప్రవర్తించిన వీడియోలు వైరల్ అయ్యాయి. కార్యాలయంలోనే రాసలీలల వీడియోలు వెలుగులోకి రావడంతో ఆయనను ప్రభుత్వం సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. తాజాగా బంగారం స్మగ్లింగ్ కేసులో అరెస్టయిన నటి రన్యారావు సవతి తండ్రి కావడం గమనార్హం.
Entertainment | Published On Jan 20, 2026, 6.48 pm IST
Ranya Rao | కర్నాటక డైరెక్టరేట్ ఆఫ్ సివిల్ రైట్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ (DCRE), డీజీపీ కే రామచంద్రరావు కార్యాలయంలోనే మహిళలో అసభ్యంగా ప్రవర్తించిన వీడియోలు వైరల్ అయ్యాయి. కార్యాలయంలోనే రాసలీలల వీడియోలు వెలుగులోకి రావడంతో ఆయనను ప్రభుత్వం సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. తాజాగా బంగారం స్మగ్లింగ్ కేసులో అరెస్టయిన నటి రన్యారావు సవతి తండ్రి కావడం గమనార్హం. వైరల్ వీడియోలో ఉన్నది తాను కాదని.. అని ఫేక్ వీడియో అని డీజీపీ చెబుతుండగా.. ప్రస్తుతం ఈ వ్యవహారంపై దర్యాప్తు కొనసాగుతున్నది. ఈ క్రమంలోనే మరోసారి రన్యారావు మరోసారి వార్తల్లో నిలిచింది. గత సంవత్సరం బంగారు స్మగ్లింగ్ కేసుల్లో వార్తల్లో వ్యక్తిగా నిలిచింది. రన్యారావు ఎవరు? ఆమె ఏయే సినిమాల్లో నటించింది? గోల్డ్ స్మగ్లింగ్ కేసు ఏంటీ? ఓసారి తెలుసుకుందాం..!

రన్యారావు స్కూల్ ఎడ్యుకేషన్ పూర్తి చేసిన తర్వాత.. నటనలో శిక్షణ తీసుకుంది. 2014 సంవత్సరంలో కన్నడ నటుడు కిచ్చా సుదీప్ మూవీ 'మాణిక్య' చిత్రంలో కనిపించింది. ఇదే ఆమెకు డెబ్యూ మూవీ. ఆ తర్వాత తమిళ చిత్రం వాఘా, కన్నడలో పటాకీ చిత్రాల్లో నటించింది. తన కెరీర్‌లో కేవలం మూడు సినిమాల్లో మాత్రమే కనిపించింది. గతేడాది మార్చి 3 డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ అధికారులు బంగారం స్మగ్లింగ్ ఆరోపణలపై ఆమెను అరెస్టు చేశారు. కెంపేగౌడ అంతర్జాతీయ విమానాశ్రయం రన్యారావును అదుపులోకి తీసుకున్నారు. ఎయిర్‌పోర్ట్‌లో ఆమె వద్ద నుంచి 14.8 కిలోల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో ఆమె దోషిగా తేలింది. చివరకు గతేడాది జూలై 16న రన్యారావుతో ఆపటు సహ నిందితులు తరుణ్ రాజు, సాహిల్ జైన్‌లకు ఏడాది జైలు శిక్షతో పాటు భారీగా జరిమానా విధించారు.

తాజాగా రన్యారావు తండ్రి సైతం వివాదంలో చిక్కుకున్నారు. రన్యారావు, డీజీపీ రామచంద్రరావు సవతి కుమార్తె. రన్యారావు బంగారం స్మగ్లింగ్ కేసులో అరెస్ట్ అయిన సమయంలో డీజీపీ పేరు సైతం ప్రధానంగా వినిపించింది. ఆమెతో తనకు ఎలాంటి సంబంధం లేదన్నారు. అయితే, బంగారం స్మగ్లింగ్ చేసేందుకు రన్యారావు డీజీపీతో ఉన్న రిలేషన్‌ను ఉపయోగించుకుందని దర్యాప్తులో తేలింది. ఈ వ్యవహారంలో ఆయన పాత్ర ఉన్నట్లుగా వార్తలు రాగా.. ప్రభుత్వం ఆయనను సెలవులపై పంపింది. ఆ తర్వాత క్లీన్ చిట్ ఇవ్వడంతో ప్రభుత్వం ఆయనను డీసీఆర్ఈగా నియమించింది. తాజాగా రాసలీలల వీడియోలు వెలుగు చూడడంతో ఇద్దరు మరోసారి వార్తల్లో నిలిచారు.
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్






