Anushka Sharma | ఆర్సీబీ మ్యాచ్‌లో అనుష్క శర్మ చేతికి వింత గాడ్జెట్ – నెటిజన్ల దృష్టిని ఆకర్షిస్తున్న డిజిటల్ జపమాల
బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ వర్సెస్ గుజరాత్ టైటాన్స్ మధ్య జరిగిన ఐపీఎల్ క్వాలిఫయర్ మ్యాచ్‌కు విరాట్ కోహ్లి భార్య అనుష్క శర్మ వెరైటీ ఎలక్ట్రానిక్ గాడ్జెట్ ధరించి అటెండ్ అయ్యింది. చూడటానికి ఉంగరం లానే ఉన్న ఈ గాడ్జెట్ ఏమిటన్నది అభిమానుల్లో ఆసక్తికరంగా మారింది.
Entertainment | Published On May 28, 2026, 5.54 pm IST
Anushka Sharma | ఐపీఎల్ 2026లో ఆర్‌సీబీ ఫైనల్ చేరుకుంది. క్వాలిఫయర్ మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్‌ను చిత్తు చేసి వరుసగా రెండో ఏడాది ఫైనల్‌లోకి అడుగుపెట్టింది. ఈ మ్యాచ్‌లో ఆర్‌సీబీ 254 పరుగులు చేయగా..లక్ష్యఛేదనలో గుజరాత్ టైటాన్స్ 162 పరుగులకే ఆలౌటైంది. 92 పరుగులతో ఓటమి పాలైంది. ఈ మ్యాచ్‌లో టీమిండియా స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లి 25 బాల్స్‌లో ఐదు ఫోర్లు ఓ సిక్సర్‌తో 43 పరుగులు చేయగా...రజత్ పాటిదార్ 33 బాల్స్‌లో 93, కృనాల్ పాండ్యా 43, దేవ్‌దత్ పడిక్కల్ 30 రన్స్‌తో ఆకట్టుకున్నారు.
ఎలక్రానిక్ గాడ్జెట్...
కాగా ఈ మ్యాచ్‌కు విరాట్ కోహ్లి వైఫ్ అనుష్క శర్మ అటెండ్ అయ్యింది. ఆమె చేతికి ఉంగరం లాంటి ఓ ఎలక్ట్రానిక్ గాడ్జెట్ ఉండటం ఆసక్తికరంగా మారింది. బ్లూ కలర్‌లో ఉన్న ఆ గాడ్జెట్ ఏమిటన్నది అభిమానుల్లో ఉత్కంఠగా మారింది. అదొక డిజిటల్ జపమాల. డిజిటల్ ప్రేయర్ బీడ్ కౌంటర్‌గా పిలిచే ఈ గాడ్జెట్ ధరించే అనుష్క శర్మ మ్యాచ్‌కు అటెండ్ అయ్యింది.
జపమాల...
మంత్రాలు పఠించే సమయంలో, ధ్యానం చేసేటప్పుడు లెక్క తప్పకుండా ఉండటమే కాకుండా ఏకాగ్రత కోసం జపమాలను చేతిలో పట్టుకుంటారు. ఆ జపమాల బదులుగా ఇప్పుడు కొత్తగా డిజిటల్ ప్రేయర్ బీడ్ కౌంటర్ వచ్చింది. ఓ మంత్రాన్ని ఎన్ని సార్లు జపించారో కరెక్ట్‌గా ఈ డిజిటల్ కౌంటర్ లెక్కిస్తుంది. చూడటానికి ఇది అచ్చం ఉంగరం లానే ఉంటుంది. ఇదే గాడ్జెట్ ధరించి అనుష్క శర్మ మ్యాచ్‌కు అటెండ్ అయ్యింది.
మంత్రాలు...
విరాట్ బ్యాటింగ్ చేస్తున్నంత సేపు అనుష్క శర్మ మనసులో ఏవో మంత్రాలు పఠిస్తూనే ఉంది. బయటకు కనిపించకుండా నోటికి చేతి అడ్డుపెట్టుకొని కనిపించింది. విరాట్ ఔట్ అవ్వగానే కాస్త ఎమోషనల్‌గా కనిపించింది. గత మూడు నెలలుగా ఐపీఎల్‌లో బిజీగా ఉన్న కోహ్లి కాస్త విరామం దొరికినా భార్య అనుష్క శర్మతో కలిసి టెంపుల్స్ దర్శిస్తున్నాడు. ఇటీవలే మహాకాలేశ్వర్‌తో పాటు సింహాచలం, కంచీపీఠాన్ని దర్శించారు విరాట్, అనుష్క. సడెన్‌గా వారు అధ్యాత్మిక బాట పట్టడం అభిమానుల్లో ఆసక్తికరంగా మారింది.
సంబంధిత వార్తలు

IPL 2026 | నేటి నుంచి ఐపీఎల్ ప్లేఆఫ్ షురూ.. ఆర్సీబీ Vs గుజరాత్ మధ్య హైవోల్టేజ్ మ్యాచ్..!
మే 26, 2026

Rishabh Pant | రిషబ్ పంత్‌పై వేటు తప్పదా? నాయకత్వ మార్పునకు సంకేతాలిచ్చిన ఎల్ఎస్జీ..!
మే 24, 2026

IPL 2026 | ఐపీఎల్‌లో నిరాశ పరిచిన ముంబయి.. హెడ్ కోచ్ మహేలా జయవర్ధనే ఏమన్నాడంటే..?
మే 24, 2026
తాజావార్తలు
- ●Ram Charan Peddi | మోదీ నోట పెద్ది మాట - రామ్‌చరణ్ కామెంట్స్ వైరల్
- ●High BP Silent Killer India | సైలెంట్ కిల్లర్‌గా 'హైబీపీ'.. ఏటా 16 లక్షల మంది బలి
- ●Karnataka Techie Death | భార్యాపిల్లల ముందే ఊహించని ఘోరం: జాబ్ వదిలి వ్యవసాయం వైపు అడుగులు.. పిడుగు రూపంలో టెకీని బలితీసుకున్న విధి
- ●CM Revanth Reddy | ప్రతి పౌరుడికి 'సమగ్ర సంక్షేమ కార్డు' : సీఎం రేవంత్ రెడ్డి
- ●TGIIC | రాయదుర్గంలో ఎకరం భూమి రూ. 237 కోట్లు
- ●E20 vs E100 | E20 పెట్రోల్ ఎఫెక్ట్: మైలేజ్ తగ్గి లబోదిబోమంటున్న ఓనర్లు.. మరోవైపు దేశంలోనే ఫస్ట్ E100 బైక్ ఎంట్రీ

Ram Charan Peddi | మోదీ నోట పెద్ది మాట - రామ్‌చరణ్ కామెంట్స్ వైరల్

High BP Silent Killer India | సైలెంట్ కిల్లర్‌గా 'హైబీపీ'.. ఏటా 16 లక్షల మంది బలి

Karnataka Techie Death | భార్యాపిల్లల ముందే ఊహించని ఘోరం: జాబ్ వదిలి వ్యవసాయం వైపు అడుగులు.. పిడుగు రూపంలో టెకీని బలితీసుకున్న విధి

CM Revanth Reddy | ప్రతి పౌరుడికి 'సమగ్ర సంక్షేమ కార్డు' : సీఎం రేవంత్ రెడ్డి



