త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Rishabh Pant | రిష‌బ్ పంత్‌పై వేటు త‌ప్ప‌దా? నాయ‌క‌త్వ మార్పున‌కు సంకేతాలిచ్చిన ఎల్ఎస్‌జీ..!

Rishabh Pant | ఐపీఎల్ 2026 సీజ‌న్‌లో ల‌క్నో సూప‌ర్ జెయింట్స్‌కు నిరాశే ఎదురైంది. ఈ సీజ‌న్ పాయింట్ల ప‌ట్టిక‌లో అడ్డుగున నిలిచింది. ఆడిన 14 మ్యాచుల్లో కేవ‌లం నాలుగు మ్యాచుల్లో మాత్ర‌మే విజ‌యం సాధించింది. నిరాశాజ‌న‌క ఫ‌లితాల నేప‌థ్యంలో పెద్ద మార్పుల దిశగా అడుగులు వేస్తున్నట్లు సంకేతాలు కనిపిస్తున్నాయి.

P

Sports | Published On May 24, 2026, 4.42 pm IST

Rishabh Pant | రిష‌బ్ పంత్‌పై వేటు త‌ప్ప‌దా? నాయ‌క‌త్వ మార్పున‌కు సంకేతాలిచ్చిన ఎల్ఎస్‌జీ..!
Advertisement

Rishabh Pant | ఐపీఎల్ 2026 సీజ‌న్‌లో ల‌క్నో సూప‌ర్ జెయింట్స్‌కు నిరాశే ఎదురైంది. ఈ సీజ‌న్ పాయింట్ల ప‌ట్టిక‌లో అడ్డుగున నిలిచింది. ఆడిన 14 మ్యాచుల్లో కేవ‌లం నాలుగు మ్యాచుల్లో మాత్ర‌మే విజ‌యం సాధించింది. నిరాశాజ‌న‌క ఫ‌లితాల నేప‌థ్యంలో పెద్ద మార్పుల దిశగా అడుగులు వేస్తున్నట్లు సంకేతాలు కనిపిస్తున్నాయి. జ‌ట్టు ప్ర‌ద‌ర్శ‌న ఏమాత్రం ఆక‌ట్టుకోలేక‌పోవ‌డం, కెప్టెన్ రిష‌బ్ పంత్ కెప్టెన్సీపై ఫ్రాంచైజీ స‌మీక్ష చేయ‌నున్న‌ట్లు తెలుస్తోంది. తాజాగా పంజాబ్ కింగ్స్ చేతిలో ఏడు వికెట్ల తేడాతో ఓట‌మి పాలుకావ‌డంతో ఈ అంశం తెర‌పైకి వ‌చ్చింది. మ్యాచ్ త‌ర్వాత జట్టు డైరెక్టర్ ఆఫ్ క్రికెట్ టామ్ మూడీ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి. కెప్టెన్సీ ఒత్తిడిని పంత్ మేనేజ్ చేయ‌లేక ఇబ్బందిప‌డ్డ‌ట్లుగా పేర్కొన్నారు.

2024 చివ‌ర‌లో జ‌రిగిన వేలం లక్నో ఫ్రాంచైజీ రిషభ్ పంత్‌ను భారీగా రూ.27 కోట్లకు కొనుగోలు చేసింది. జట్టు యజమాని సంజీవ్ గోయెంకా రిష‌బ్‌పై భారీ ఆశ‌లు పెట్టుకున్నారు. వచ్చే దశాబ్దంలో పంత్‌ను ఎంఎస్ ధోనీ, రోహిత్ శర్మ స్థాయిలో నిలిచే నాయకుడిగా చూస్తున్నానని సైతం ఆయ‌న అప్ప‌ట్లో వ్యాఖ్యానించారు. అయితే, ఫ‌లితాల‌ప‌రంగా చూస్తే మాత్రం ఆ అంచ‌నాలు ఫ‌లించ‌లేద‌నే అభిప్రాయం వ్య‌క్త‌మ‌వుతోంది. గత రెండు సీజన్లలో లక్నో జట్టు మొత్తం 28 మ్యాచ్‌ల్లో కేవలం 10 విజయాలు మాత్రమే సాధించింది. ప్రస్తుత సీజన్‌లో 14 మ్యాచ్‌ల్లో నాలుగు విజ‌యాల‌తో టేబుల్‌లో అట్ట‌డుగున నిలిచింది. టామ్ మూడీ మాట్లాడుతూ కెప్టెన్సీ ఒత్తిడి ఆటగాడి బ్యాటింగ్‌పై కూడా ప్రభావం చూపుతుందా? అనే దానిపై సమీక్ష అవసరమని వ్యాఖ్యానించారు. ప్ర‌ద‌ర్శ‌న తాము ఆశించిన స్థాయిలో లేద‌ని, నాయ‌క‌త్వం అంశంపై భ‌విష్య‌త్‌లో తీవ్రంగా ఆలోచించాల్సిన అవ‌స‌రం ఉంద‌న్నారు.

ఇదే సమయంలో ఇటీవ‌లి ప‌లు నివేదిక‌లు పంత్‌పై ఫ్రాంచైజీ అసంతృప్తిగా ఉందని, జట్టు పరాజయాలకు అత‌నే ప్రధాన కారణంగా భావిస్తున్నట్లు పేర్కొన్నాయి. పంత్ తీవ్ర‌మైన ఒత్తిడి ఉన్న‌ట్లుగా కూడా అంచ‌నాలున్నాయి. ఇక గతంలోనే పంత్ భారత జట్టు టెస్ట్ వైస్ కెప్టెన్సీ కోల్పోవడం, వన్డే జట్టులో చోటు దక్కకపోవడం కూడా ఈ పరిణామాల‌కు కార‌ణం కావొచ్చ‌ని పేర్కొంటున్నారు. ప్ర‌స్తుతం ల‌క్నో సూప‌ర్ జెయింట్స్ నాయ‌క‌త్వ మార్పు.. జ‌ట్టు ప్ర‌క్షాళ‌న అనివార్యమ‌న్న వార్త ఐపీఎల్ వ‌ర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.

Advertisement
Advertisement