IPL 2026 | ఐపీఎల్‌లో నిరాశ పరిచిన ముంబయి.. హెడ్ కోచ్ మహేలా జయవర్ధనే ఏమన్నాడంటే..?
IPL 2026 | ఐపీఎల్‌లో 2026 సీజన్‌లో ముంబయికి ఆశించిన ఫలితం దక్కలేదు. ఆరోసారి టైటిల్ గెలవాలన్న ఆశ జట్టుకు నిరాశే ఎదురైంది. జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషిస్తారని భావించిన సీనియర్ ఆటగాళ్లు రోహిత్ శర్మ, జస్‌ప్రీత్ బుమ్రా ఆశించిన స్థాయిలో రాణించకపోవడంతో జట్టుపై తీవ్ర ప్రభావం చూపింది. ముఖ్యంగా ఈ ఏడాది జరిగిన ఐసీసీ టీ20 ప్రపంచకప్‌లో భారత జట్టు విజయంలో కీలకపాత్ర పోషించి బుమ్రా.. ఐపీఎల్‌లో మాత్రం తనదైన ముద్ర వేయలేకపోయాడు. ఐపీఎల్ హిస్టరీలో అత్యంత విజయవంతమైన బ్యాట్స్‌మెన్, కెప్టెన్‌గా గుర్తింపు పొందిన సీజన్ తొలి మ్యాచ్‌లోనే ఆఫ్ సెంచరీతో ఆకట్టుకున్నాడు. ఆ తర్వాత స్థిరంగా పరుగులు చేయలేకపోయాడు. రాజస్థాన్ రాయల్స్‌తో వాంఖడే స్టేడియంలో జరుగుతున్న చివరి లీగ్ మ్యాచ్‌కు ముందు వరకు రోహిత్ ఎనిమిది మ్యాచ్‌ల్లో కేవలం 283 పరుగులు మాత్రమే చేశాడు.
హ్యామ్‌స్ట్రింగ్ గాయం కారణంగా పలు మ్యాచులకు దూరమయ్యాడు. కొన్ని మ్యాచుల్లో ఇంపాక్ట్ ప్లేయర్‌గా వచ్చాడు. ఈ క్రమంలో ముంబయి హెడ్ కోచ్ మహేలా జయవర్ధనే స్పందించాడు. జట్టు ఎంపిక పూర్తిగా ఆ మ్యాచ్ పరిస్థితులు, జట్టు అవసరాల ఆధారంగానే జరుగుతుందని తెలిపాడు. రోహిత్ కూడా జట్టు ప్రయోజనాలకే ప్రాధాన్యం ఇస్తాడని పేర్కొన్నారు. “ముంబై ఇండియన్స్ జట్టును ఎంపిక చేసే సమయంలో భారత జట్టు అవసరాల గురించి నేను ఆలోచించను. ఆ రోజు జట్టుకు ఏది మంచిదో దాన్నే దృష్టిలో పెట్టుకుంటాం. రోహిత్ నిజమైన టీమ్ ప్లేయర్. జట్టుకు ఏది అవసరమో అతడికి బాగా తెలుసు.
అతడికి హ్యామ్‌స్ట్రింగ్ గాయం ఉండడంతో కోలుకునేందుకు తగిన సమయం ఇచ్చాం. తిరిగి వచ్చిన తర్వాత అతని బ్యాటింగ్ విషయంలో చాలా జాగ్రత్తగా వ్యవహరించాం” అని జయవర్ధనే వివరించాడు. మరోవైపు జస్ప్రీత్ బుమ్రా విషయానికొస్తే టీ20 ప్రపంచకప్ అనంతరం అతనికి సరైన విశ్రాంతి దక్కలేదని జయవర్ధనే వెల్లడించాడు. ఈ సీజన్‌లో బుమ్రా 13 మ్యాచ్‌ల్లో కేవలం నాలుగు వికెట్లు మాత్రమే తీయడం అభిమానులను తీవ్ర నిరాశకు గురి చేసింది. “ప్రపంచకప్ ఆడేటప్పుడే బుమ్రాకు చిన్న గాయం ఉంది. టోర్నీ ముగిసిన తర్వాత అతడికి పూర్తిగా కోలుకునేందుకు ఎక్కువ విశ్రాంతి ఇచ్చాం. సీజన్ ప్రారంభంలో అతడి వేగం, రిథమ్ తగ్గినట్టు కనిపించడానికి అదే కారణం. ఫిట్‌నెస్‌ను మళ్లీ సాధించుకునే ప్రక్రియలో అతడు క్రమంగా ముందుకు వచ్చాడు” అని జయవర్ధనే చెప్పాడు.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Agadha Movie | బోనమెత్తిన హీరోయిన్.. బల్కంపేట ఎల్లమ్మకు బోనం సమర్పించిన కామాక్షి భాస్కర్ల
జులై 26, 2026

Vaibhav Suryavanshi | మళ్లీ చితక్కొట్టిన వైభవ్.. టీ20ల్లో అరుదైన చరిత్ర సృష్టించిన సూర్యవంశీ
జులై 26, 2026

Hardik Pandya | పాండ్యాపై కన్నేసిన చెన్నైకి.. ముంబయి ఇండియన్స్‌తో డీల్‌పై సీఎస్కే ఆసక్తి..!
జులై 26, 2026
తాజావార్తలు
- ●Agadha Movie | బోనమెత్తిన హీరోయిన్.. బల్కంపేట ఎల్లమ్మకు బోనం సమర్పించిన కామాక్షి భాస్కర్ల
- ●Serial Actress | మోడ్రన్ లుక్‌లో గుండె నిండా గుడి గంటలు మీనా
- ●PM Modi Exam Reforms | ఎగ్జామ్ పేపర్ లీక్స్‌కు చెక్: రంగంలోకి నందన్ నిలేకని.. టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేసిన ప్రధాని మోదీ!
- ●Vaibhav Suryavanshi | మళ్లీ చితక్కొట్టిన వైభవ్.. టీ20ల్లో అరుదైన చరిత్ర సృష్టించిన సూర్యవంశీ
- ●Rasha Thadani | అమ్మ స్టార్ హీరోయిన్ - నాన్న పెద్ద ప్రొడ్యూసర్ - శ్రీనివాస మంగాపురం హీరోయిన్ బ్యాక్‌గ్రౌండ్ ఇదే!
- ●Malayalam OTT | ఓటీటీలోకి వచ్చేస్తోన్న మలయాళం మర్డర్ మిస్టరీ థ్రిల్లర్ మూవీ - సీన్ సీన్‌కో మలుపు

Agadha Movie | బోనమెత్తిన హీరోయిన్.. బల్కంపేట ఎల్లమ్మకు బోనం సమర్పించిన కామాక్షి భాస్కర్ల

Serial Actress | మోడ్రన్ లుక్‌లో గుండె నిండా గుడి గంటలు మీనా

PM Modi Exam Reforms | ఎగ్జామ్ పేపర్ లీక్స్‌కు చెక్: రంగంలోకి నందన్ నిలేకని.. టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేసిన ప్రధాని మోదీ!

Vaibhav Suryavanshi | మళ్లీ చితక్కొట్టిన వైభవ్.. టీ20ల్లో అరుదైన చరిత్ర సృష్టించిన సూర్యవంశీ



