త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Wamiqa Gabbi | తొలిసారి రూ.100కోట్ల క్లబ్‌లో వామికా గబ్బి మూవీ.. భావోద్వేగానికి గురైన భూత్‌ బంగ్లా బ్యూటీ..!

Wamiqa Gabbi | బాలీవుడ్ నటి వామికా తాజాగా నటించిన భూత్‌ బంగ్లా చిత్రం ద్వారా మంచి విజయాన్ని అందుకుంది. దర్శకుడు ప్రియదర్శన్‌ తెరకెక్కించిన ఈ హారర్-కామెడీ మూవీ బాక్సాఫీస్ వద్ద అద్భుతమైన వసూళ్లు సాధించి రూ.100 కోట్ల క్లబ్‌లో చోటు సంపాదించింది. దీంతో వామికా గబ్బి కెరీర్‌లో ఇదే తొలి రూ.100 కోట్ల వసూళ్లు సాధించిన చిత్రంగా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. ఈ విజయంతో ఉత్సాహంగా ఉన్న వామికా గబ్బి తన ఆనందాన్ని అభిమానులతో పంచుకుంది.

P

Entertainment | Published On Apr 29, 2026, 2.30 pm IST

Wamiqa Gabbi | తొలిసారి రూ.100కోట్ల క్లబ్‌లో వామికా గబ్బి మూవీ.. భావోద్వేగానికి గురైన భూత్‌ బంగ్లా బ్యూటీ..!
Advertisement

Wamiqa Gabbi | బాలీవుడ్ నటి వామికా తాజాగా నటించిన భూత్‌ బంగ్లా చిత్రం ద్వారా మంచి విజయాన్ని అందుకుంది. దర్శకుడు ప్రియదర్శన్‌ తెరకెక్కించిన ఈ హారర్-కామెడీ మూవీ బాక్సాఫీస్ వద్ద అద్భుతమైన వసూళ్లు సాధించి రూ.100 కోట్ల క్లబ్‌లో చోటు సంపాదించింది. దీంతో వామికా గబ్బి కెరీర్‌లో ఇదే తొలి రూ.100 కోట్ల వసూళ్లు సాధించిన చిత్రంగా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. ఈ విజయంతో ఉత్సాహంగా ఉన్న వామికా గబ్బి తన ఆనందాన్ని అభిమానులతో పంచుకుంది. సోషల్ మీడియా వేదికగా ‘భూత్ బంగ్లా’ షూటింగ్ సమయంలో తీసిన బీహైండ్ ది సీన్స్ ఫొటోలను షేర్ చేస్తూ భావోద్వేగంగా స్పందించింది.

‘నా కెరీర్‌లో తొలి రూ.100 కోట్ల చిత్రం ఇది. ఈ ప్రయాణంలో నాపై నమ్మకం ఉంచిన దర్శకుడు ప్రియదర్శన్, అక్షయ్‌ కుమార్‌, నిర్మాత ఏక్తా కపూర్‌, అలాగే మొత్తం టీమ్‌కు నా హృదయపూర్వక కృతజ్ఞతలు’ అని ఆమె పేర్కొంది. అంతేకాకుండా ‘ఈ సినిమా మా టీమ్‌కే పరిమితం కాదు ప్రేక్షకులందరికీ చెందినది. మీరు చూపించిన ప్రేమ, ఆదరణ వల్లే ఇది సాధ్యమైంది’ అని తెలిపింది. ప్రేక్షకులను ఉద్దేశిస్తూ ఆమె ఇంకా మాట్లాడుతూ ‘ఈ చిత్రాన్ని ఆదరించి, మా ప్రయత్నాన్ని అంగీకరించినందుకు ధన్యవాదాలు. ఈ స్థాయికి చేరుకోవడం వెనుక ఎంతో కష్టం, నేర్చుకోవడం, అనుభవం దాగి ఉంది. ఇది కేవలం ప్రారంభం మాత్రమే. ఇకపై మరింత శ్రమించి, ఇంకా మంచి పాత్రలతో మిమ్మల్ని అలరించడానికి ప్రయత్నిస్తాను’ అంటూ చెప్పుకొచ్చింది. ఏప్రిల్ 17న విడుదలైన ‘భూత్ బంగ్లా’ ఒక హారర్-కామెడీ ఎంటర్టైనర్‌గా ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది.

ఈ చిత్రంలో అక్షయ్ కుమార్‌తో పాటు వామికా గబ్బి కీలక పాత్రలో కనిపించగా, రాజ్‌పాల్‌ యాదవ్‌, పరేష్‌ రావల్‌, టబు, మిథిలా పాల్కర్‌, అర్సాని కీలకపాత్రలో నటించారు. ప్రస్తుతం ఈ సినిమా థియేటర్లలో విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఇదిలా ఉండగా, వామికా గబ్బి దక్షిణాది ప్రేక్షకులకు కూడా పరిచితమే. తెలుగులో ఆమె సుధీర్ బాబు హీరోగా నటించిన ‘భలే మంచి రోజు’ చిత్రంలో హీరోయిన్‌గా నటించి ఆకట్టుకుంది. ప్రస్తుతం ఆమె తెలుగు, తమిళం, మలయాళం, హిందీ, పంజాబీ భాషల్లో వరుస సినిమాలతో బిజీగా ఉంది. బాలీవుడ్‌లో ‘పతి పత్నీ ఔర్ వో దో’, ‘దిల్ కా దర్వాజా ఖోల్ నా డార్లింగ్’, ‘కుకు కి కుండ్లి’ వంటి చిత్రాలు చేయగా, తమిళంలో ‘డీసీ’, ‘ఇరవాకాలం’, ‘జీనీ’, మలయాళంలో ‘టికి టాకా’ వంటి ప్రాజెక్టులతో ప్రేక్షకుల ముందుకు రానుంది. అలాగే తెలుగులో ‘జీ2’ చిత్రంలో అడవి శేష్‌ సరసన నటిస్తోంది.

Advertisement
Advertisement