Vishwambhara | ఉగాదికి మెగాస్టార్ ‘విశ్వంభర’ నుంచి బిగ్ అప్‌డేట్..!
Vishwambhara | మెగాస్టార్ చిరంజీవి ఈ సంక్రాంతికి ‘మన శంకర వర ప్రసాద్ గారు’ చిత్రంతో బ్లాక్‌బస్టర్ హిట్‌ను తన ఖాతాలో వేసుకున్నారు. విడుదలైన తొలి రోజునుంచే మంచి టాక్‌తో విజయవంతంగా 109 కేంద్రాల్లో 50 రోజులు పూర్తి చేసుకుంది. ప్రస్తుత పరిస్థితుల్లో ఇన్ని రోజులు ఆడడం అరుదైన విషయం కావడంతో మూవీ టీమ్ ఆనందం వ్యక్తం చేస్తున్నది.
Entertainment | Published On Mar 3, 2026, 1.30 pm IST
Vishwambhara | మెగాస్టార్ చిరంజీవి ఈ సంక్రాంతికి ‘మన శంకర వర ప్రసాద్ గారు’ చిత్రంతో బ్లాక్‌బస్టర్ హిట్‌ను తన ఖాతాలో వేసుకున్నారు. విడుదలైన తొలి రోజునుంచే మంచి టాక్‌తో విజయవంతంగా 109 కేంద్రాల్లో 50 రోజులు పూర్తి చేసుకుంది. ప్రస్తుత పరిస్థితుల్లో ఇన్ని రోజులు ఆడడం అరుదైన విషయం కావడంతో మూవీ టీమ్ ఆనందం వ్యక్తం చేస్తున్నది. ఈ ఉత్సాహంలో చిరు మరో ప్రాజెక్ట్‌పై దృష్టి సారించారు. దర్శకుడు బాబీ కొల్లి మూవీకి సిద్ధమవుతున్నారు. ప్రస్తుతం మెగాస్టార్ ‘విశ్వంభర’ మూవీలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ మూవీకి కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ మూవీ రిలీజ్‌పై త్వరలోనే స్పష్టత వచ్చే అవకాశం ఉన్నది. వాస్తవానికి విశ్వంభర మూవీని గతేడాదే ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని భావించారు.
అయితే, టీజర్‌లో చూపించిన విజువల్ ఎఫెక్ట్స్‌కు నెగెటివ్ స్పందన రావడంతో చిత్రబృందాన్ని ఆలోచనలే పడేసింది. సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ట్రోలింగ్ రావడంతో వీఎఫ్‌ఎక్స్‌ని మళ్లీ చేయించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఫలితంగా సినిమా రిలీజ్‌లో ఆలస్యం జరిగింది. మూవీ బడ్జెట్ విషయంపై అప్పట్లో పెద్ద ఎత్తున చర్చ సాగింది. నిర్మాణ సంస్థ యూవీ క్రియేషన్స్ ఈ చిత్రంపై భారీగా పెట్టుబడి పెట్టిందని, ఇప్పటికే బడ్జెట్ పరిమితిని దాటిందని ప్రచారం జరిగింది. అలాంటి పరిస్థితుల్లో వీఎఫ్ఎక్స్ పనుల కోసం అదనపు ఖర్చులు పెట్టడానికి నిర్మాతలు సానుకూలంగా లేరనే వార్తలు సైతం వచ్చాయి. మరోవైపు, వీఎఫ్‌ఎక్స్ మళ్లీ చేయించినా క్వాలిటీ మాత్రం ప్రమాణాలకు అనుగుణంగా లేదని, దీనిపై చిరంజీవి అసంతృప్తిగా ఉన్నట్లు ఇండస్ట్రీలో టాక్ నడుస్తోంది. ఈ కారణాలన్నీ కలసి సినిమా రిలీజ్‌ను వాయిదా పడేలా చేశాయని అప్పట్లో చర్చ సాగింది. తాజాగా సమస్యలన్నీ తొలగిపోయాయని, ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు వేగంగా కొనసాగుతున్నాయని, ముఖ్యంగా వీఎఫ్ఎక్స్ వర్క్స్ దాదాపు పూర్తి కావొస్తోందని సమాచారం.
తాజా బజ్ ప్రకారం.. విశ్వంభర మూవీని జూన్, జులైల్‌లో రిలీజ్ చేయాలని నిర్మాతలు భావిస్తున్నారు. తేదీలను అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. విడుదలకు సంబంధించిన ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు ఇండస్ట్రీలో టాక్ నడుస్తోంది. మూవీ రిలీజ్‌కు సంబంధించి స్పెషల్ అప్‌డేట్ ఉగాదికి ఇవ్వబోతుందని తెలుస్తోంది. అదే రోజున రిలీజ్ డేట్‌ని, ప్రమోషనల్ కంటెంట్‌ని సైతం విడుదల చేసే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. పాటలు, ట్రైలర్‌తో మూవీపై మళ్లీ మంచి బజ్ తీసుకువచ్చేందుకు ప్లాన్ చేసినట్లు సమాచారం. ఓటీటీ ఒప్పందం జరిగితే.. తర్వాత థియేట్రికల్ రిలీజ్‌కు పెద్దగా అడ్డంకులు ఉండవని భావిస్తున్నారు. ఇప్పటికే సంక్రాంతి విజయంతో మంచి జోరులో ఉన్న చిరంజీవి, ‘విశ్వంభర’తోనూ మళ్లీ బ్లాక్ బస్టర్ హిట్ కొనసాగించాలని అభిమానులు ఆశిస్తున్నారు. భారీ అంచనాల మధ్య రూపొందుతున్న ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద ఎంత మేరకు ఆకట్టుకుంటుందనేది ఆసక్తికరంగా మారింది. ఇదిలా ఉండగా.. ఈ మూవీలో మెగాస్టార్ చిరుతో త్రిష కృష్ణన్ జతకడుతోంది. ఈ మూవీలో కన్నడ బ్యూటీ అషికా రంగనాథ్, ఈశా చావ్లా, సురభి కీలకపాత్రల్లో నటిస్తున్నారు.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
మే 21, 2026

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు…వచ్చింది – రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
మే 21, 2026

Chiranjeevi | 30 ఏళ్ల తర్వాత సీన్ రివర్స్ – పవన్ కళ్యాణ్‌కు థాంక్స్ చెప్పిన మెగాస్టార్
మే 21, 2026
తాజావార్తలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు



