Vikram Bhatt | దర్శకుడు విక్రమ్ భట్‌కు ఊరట.. రూ.30కోట్ల మోసం కేసులో బెయిల్..!
Vikram Bhatt | ప్రముఖ ఫిలిం మేకర్ విక్రమ్ భట్‌కు సుప్రీంకోర్టులో ఊరట దక్కింది. ఆయనతో పాటు భార్య శ్వేతాంబరి భట్‌లకు బెయిల్ మంజూరు చేసింది. ఇద్దరు డిసెంబర్ 7 నుంచి జైలులో ఉన్న విషయం తెలిసిందే. విక్రమ్, శ్వేతాంబరి ఉయద్‌పూర్‌కు చెందిన వ్యాపారవేత్తను మోసం చేసినట్లుగా ఆరోపణలు ఎదుర్కొంటున్నారు.
Entertainment | Published On Feb 13, 2026, 3.50 pm IST
Vikram Bhatt | ప్రముఖ ఫిలిం మేకర్ విక్రమ్ భట్‌కు సుప్రీంకోర్టులో ఊరట దక్కింది. ఆయనతో పాటు భార్య శ్వేతాంబరి భట్‌లకు బెయిల్ మంజూరు చేసింది. ఇద్దరు డిసెంబర్ 7 నుంచి జైలులో ఉన్న విషయం తెలిసిందే. విక్రమ్, శ్వేతాంబరి ఉయద్‌పూర్‌కు చెందిన వ్యాపారవేత్తను మోసం చేసినట్లుగా ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. సుప్రీంకోర్టు సీజేఐ జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జోయ్ మాల్య బాగ్చి ధర్మాసనం ఉదయ్‌పూర్ జైలు నుంచి వెంటనే ఇద్దరిని విడుదల చేయాలని ఆదేశించింది.
ఈ సందర్భంగా ఐవీఎఫ్ ఫెర్టిలిటీ సెంటర్ వ్యవస్థాపకుడు అజయ్ ముర్దియా, రాజస్థాన్ ప్రభుత్వాన్ని ఈ నెల 19న జరిగే విచారణకు రావాలని నోటీసులు పంపింది. జనవరి 31న రాజస్థాన్ హైకోర్టు మోసం కేసులో విక్రమ్, ఆయన భార్య దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌లను తిరస్కరించింది. ఈ దశలో నిందితులకు బెయిల్ ఇవ్వడం సరికాదని పేర్కొంది. బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు డిసెంబర్ 7న అరెస్టు చేసి ఇద్దరిని ముంబయి నుంచి ఉదయ్‌పూర్‌కు తరలించారు. ఉదయపూర్ వ్యాపారవేత్త అజయ్ ముర్దియా చిత్రనిర్మాత విక్రమ్ భట్, అతని భార్యపై మోసం కేసు నమోదు చేశారు. భారీ లాభాలు వచ్చేలా చేస్తామని హామీ ఇచ్చి.. సినిమా నిర్మాణంలో పెట్టుబడి పెట్టాలని ఒప్పించారని ఆయన ఆరోపించారు. రూ.30కోట్లు తీసుకొని వాటిని దుర్వినియోగం చేశారని ఆరోపించారు. వేర్వేరు పేర్లతో ఫేక్ బిల్లులు సమర్పించి అజయ్ నుంచి డబ్బులు తీసుకున్నారని.. సినిమా కోసం తీసుకున్న డబ్బును విక్రమ్ తన వ్యక్తిగత ఖాతాలో జమ చేసుకున్నారని ఆరోపించారు.
పిటిషనర్ల తరఫున సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గి వాదనలు వినిపించారు. రాజస్తాన్ పోలీసులు ముంబయి నివాసానికి వచ్చి ఇద్దరిని అరెస్టు చేశారన్నారు. ప్రస్తుత దశలో కనీసం భార్యకైనా మధ్యంత బెయిల్ ఇవ్వాలని కోరారు. అజయ్ ముర్దియా తరఫున హాజరైన న్యాయవాది వాదనలను తోసిపుచ్చారు. రూ.44కోట్ల మోసం కేసని కోర్టుకు తెలిపారు. డబ్బులు తిరిగి పొందేందుకు క్రిమినల్ కేసు ఒక పద్ధతా? అంటూ బెంచ్ ప్రశ్నించింది. దురదృష్టవశాత్తు వారు (పిటిషనర్లు) ఎఫ్ఐఆర్ రద్దు చేయాలని కోరలేదు అని సీజేఐ అన్నారు. అయితే, ఇందులో తమ తప్పు లేదని.. రెండు సినిమాలు ఫ్లాప్ అయ్యాయని.. ఇందులో దర్శకుడిని, అతని భార్యను జైలులో పెట్టలేరంటూ రోహ్గతి వాదనలు వినిపించారు.
సంబంధిత వార్తలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
మే 21, 2026

Pooja Hegde | చిక్కుల్లో పూజా హెగ్డే, మృణాల్ ఠాకూర్ బాలీవుడ్ మూవీ – లీగల్ సమస్యలతో ట్రైలర్ రిలీజ్ క్యాన్సిల్
మే 21, 2026

Sai Pallavi | పాపం సాయిపల్లవి… రామాయణ డైరెక్టర్ అంత మాట అనేశాడేంటి?
మే 21, 2026
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్



