OTT | ఓటీటీలోకి విజయ్ సేతుపతి లేటెస్ట్ మూవీ – ఈ వారం రెంటల్ – నెక్స్ట్ వీక్ ఫ్రీ స్ట్రీమింగ్
విజయ్ సేతుపతి సైలెంట్ మూవీ గాంధీ టాక్స్ రెండు ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌లో స్ట్రీమింగ్ కాబోతుంది. ఇప్పటికే అమెజాన్‌ప్రైమ్‌లో రెంటల్ విధానంలో రిలీజైన ఈ మూవీ తాజాగా మరో ఓటీటీలోకి రానుంది. మార్చి 6న జీ5 ఓటీటీలోనూ విడుదల అవుతోంది.
Entertainment | Published On Feb 28, 2026, 4.38 pm IST
OTT | విజయ్ సేతుపతి, అదితీరావ్ హైదరీ హీరోహీరోయిన్లుగా నటించిన గాంధీ టాక్స్ మూవీ సడెన్‌గా ఓటీటీలోకి వచ్చింది. ఈ సైలెంట్ మూవీ అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది. అయితే ఫ్రీగా కాకుండా రెంటల్ విధానంలో అందుబాటులోకి తీసుకొచ్చారు. అమెజాన్ ప్రైమ్‌తో పాటు మరో ఓటీటీలోకి కూడా గాంధీ టాక్స్ రాబోతుంది. మార్చి 6న జీ5 ఓటీటీలోనూ రిలీజ్ కాబోతుంది. వారం గ్యాప్‌లో రెండు ఓటీటీలో విజయ్ సేతుపతి మూవీ విడుదల కానుండటం ఆసక్తికరంగా మారింది. గాంధీ టాక్స్ మూవీకి కిషోర్ పాండురంగ్ దర్శకత్వం వహించాడు.ఈ సినిమాలో సీనియర్ హీరో అరవింద్ స్వామి ఓ కీలక పాత్రలో కనిపించారు. ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ అందించారు.
ఒక్క డైలాగ్ లేకుండా...
ఒక్క డైలాగ్ లేకుండా మూకీ మూవీగా ప్రయోగాత్మకంగా రూపొందిన ఈ సినిమా కమర్షియల్‌గా మాత్రం సరైన విజయాన్ని సాధించలేదు. సమాజంలోని అవనీతి, లంచగొండతనాన్ని డైలాగ్స్ లేకుండా కేవలం మ్యూజిక్ ద్వారానే డైరెక్టర్ ఈ సినిమాలో చూపించాడు. విజయ్ సేతుపతి, అరవింద్ స్వామి యాక్టింగ్‌తో పాటు ఏఆర్ రెహమాన్ మ్యూజిక్‌కు మంచి పేరొచ్చింది. కమల్‌హాసన్ పుష్పక విమానం తర్వాత లాంగ్ గ్యాప్ అనంతరం రూపొందిన సెలైంట్ మూవీగా గాంధీ టాక్స్ నిలిచింది.
విష్ణు, బోస్‌మన్ కథ....
మహదేవ్ విష్ణుకు (విజయ్ సేతుపతి)మున్సిపాలిటీలో ఉద్యోగం వస్తుంది. ఆ జాబ్ అతడికి దక్కాలంటే లంచం ఇవ్వాల్సివస్తుంది. ఆ జాబ్‌పైనే అతడి తల్లి ట్రీట్‌మెంట్‌తో పాటు ప్రేయసి పెళ్లి కూడా ఆధారపడిఉంటుంది. బోస్‌మన్ (అరవింద్ స్వామి) పెద్ద బిజినెస్‌మెన్‌గా పేరు తెచ్చుకుంటాడు. అనుకోకుండా వ్యాపారంలో నష్టాలు రావడంతో ఆస్తులన్నీ కోల్పోతాడు. ఒక్క రోజులోనే అతడి జీవితం మొత్తం మారిపోతుంది. డబ్బు కోసం మహదేవ్, బోస్‌మన్ ఏం చేశారు? వారిద్దరి మధ్య పరిచయానికి దారితీసిన పరిస్థితులేమిటి? మహదేవ్ జీవితంలోకి వచ్చిన గాయత్రి (అదితీరావ్ హైదరీ) ఎవరు అన్నదే ఈ మూవీ కథ.
సంబంధిత వార్తలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
మే 21, 2026

OTT | సడెన్‌గా ఓటీటీలోకి వచ్చిన నాగశౌర్య డిజాస్టర్ మూవీ
మే 15, 2026

Web Series | సలార్ రాజు మిస్సింగ్ – మెగా బ్రదర్ రీఎంట్రీ .. కామెడీ థ్రిల్లర్ వెబ్‌సిరీస్ స్ట్రీమింగ్ ఎందులో..ఎప్పుడంటే?
మే 14, 2026
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్



